S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

05/06/2019 - 19:43

ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మాసాలలో వైశాఖ తృతీయ అక్షయ సంపదలు అందిస్తుంది. ‘‘వైశాఖ మాస శుక్ల తృతీయా- అక్షయ తృతీయోచ్ఛతే’’ అని శాస్త్ర వచనం. కుబేరుడే ఈరోజున మహాశివుని దగ్గర నుంచి అక్షయ సంపద లను పొందాడని పురాణ వచనం. వైశాఖాన్ని మాధవం అని కూడా పిలుస్తుంటారు.

05/05/2019 - 22:59

భృగు వంశోద్భవుడు, జమదగ్ని మహర్షి కుమారుడు, సహస్ర బాహుడైన కార్తవీర్యార్జునుని సంహరించిన మహావీరుడు పరుశురాముడు. తండ్రి ఆజ్ఞానువర్తియై, కన్నతల్లిని హతమార్చి, తిరిగి తండ్రి ఆశీస్సులతో పునరుజ్జీవితురాలిగా చేసిన ధర్మవీరుడు, భూ భారాన్ని తగ్గింప భార్గవరాముని రూపంలో ఉదయించాడు శ్రీహరి.

05/01/2019 - 19:59

సీ. విఘ్నాలు తొలగించు విఘ్నేశ్వరా! మమ్ము
గాచేటి వాడవే కరుణతోడ
శ్రీ శంకరా! మాకు సిరులిచ్చి బ్రోచేటి
వాడవీవే నయ్య భవభయ హర
మంగాపతీ! మాకు మార్గంబు ఁజూపుచు
రెప్పవై గాచేటి ఱేడువయ్య
శ్రీ ఆంజనేయ! మా సేమంబుఁ గోరేటి
వాడవే! శ్రీరామభక్తితోడ

04/30/2019 - 19:26

స్వేచ్ఛామృత ధారలతో
స్వర్ణాన్ని పండించే ఓ రైతన్నా!
ఇక్కట్ల ఇనుప తెరలు
చుట్టేసిన నేపథ్యంలో
ఊపిరి సలపక
విలవిల్లాడిపోతున్నావే!
శ్రమైక జీవన సౌందర్యాన్ని
ఆవిష్కరిస్తున్న ఓ శ్రామికా!
వెట్టి చాకిరితోవెన్నువిరిగి
అచేతనంగా పడిపోయిన నీకు
ఆసరా దొరకక
అల్లల్లాడిపోతున్నావే!
బిగించిన ఉక్కు పిడికిలి
ఉద్యమస్ఫూర్తికి చిహ్నంగా

04/29/2019 - 18:57

భగవంతుడు మానవునకిచ్చిన అద్భుత వరం.. ‘వాక్కు’! మనిషి మనసులోని భావమే వాక్కుగా పరిణమించి నోటి వెంట వెలువడుతుంది. కాలు జారితే ఫర్వాలేదు కానీ నోరు జారితే వెనక్కు తీసుకోలేము అంటారు. అంటే నోటి మాట చాలా గొప్పది. మాట వల్లనే కొందరు మిత్రులు ఏర్పడితే మరికొందరు ఆ మాట అందుకే వాక్కును లక్ష్మీ నివాసం అంటూంటారు. మాట్లాడేటపుడు ఒకటి రెండు సార్లు బాగా ఆలోచించి మాట్లాడాలి.

04/25/2019 - 22:22

భగవంతుని సృష్టి విచిత్రమైనది. అది వాక్కుకు, మనసుకు, కాలానికి, బుద్ధికి అందదు. అందుకే దానిని ‘అనాది’, ‘అనిర్వచనీయం’ అను పేర్లతో పిలుస్తారు. అహంకార చతుష్ఠయములో మొదటిది మనసు (మనో, బుద్ధి, చిత్త, అహంకారం). ఈ మనసు పుట్టినది మొదలు మనము చచ్చేదాకా అగ్నిలో నుండి ‘మిణుగురులు’లాగా ‘ఆలోచనలు’ సృష్టిస్తుంది. అవి సముద్రములో అలల రీతి ఎగిసిపడుతూ వస్తుంటాయి. ఒక రహస్యమేమి అనగా ఒకే సమయంలో రెండు ఆలోచనలు రావు.

04/22/2019 - 19:51

అపకారికి ఉపకారం నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ .. అంటూ శతకకారుడే కాదు మన పెద్దలూ నీతిబోధ చేస్తుంటారు. అపకారం ఫలానా వారు చేశారు అని తెలిస్తే చాలు వారిమీద ఎక్కడ లేని ఆగ్రహం వచ్చితీరుతుంది. ఒకవేళ రాకపోతే అదేవింత అవుతుంది. అటువంటి అపకారులకు ఉపకారం చేయాలనేది మన పెద్దల బోధ.

04/21/2019 - 22:31

తెలుగు ప్రాచీన భాష కాదనే వాదనలకు ముగింపు పలికి, ప్రాచీన భాష (క్లాసికల్ లాంగ్వేజ్) హోదా పొందుటకు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన తొలి తెలుగు కంద పద్యాలు విశేష ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అటు కన్నడిగులకు, ఇటు తెలుగు వారికి సదరు కంద పద్యాలు కలిగిన కురిక్యాల శాసనం అమూల్యమై, ప్రధాన ఆధారంగా మారింది.

04/19/2019 - 20:00

భోగము, మోక్షము రెండింటిని అను గ్రహింప చేసే స్వామి శ్రీ ఆంజనేయస్వామి. అత్యంత శక్తి సంపన్నుడు.రాముని భక్తుల్లో అత్యంత శ్రేష్టుఢు.

04/14/2019 - 22:08

సజ్జనులకు మనసున మలయమారుతాలు వీస్తే శత్రువుల గుండెల్లో అతిభీకరమైన ప్రచండమైన ప్రళయం సంభవిస్తుందని రాముని గూర్చి మారీచుడు రావణుని హెచ్చరించాడు. పోయే కాలానికి విపరీత బుద్ధి పుట్టినట్టు రావణుడు ఒక్కమారీచుని మాటే కాదు తన స్వంత భార్య మండోదరి చెప్పినా వినలేదు. తమ్ముడు చెప్పినా అర్థం చేసుకోలేని వాడు రావణుడు కనుక రాముని చేతిలో అసువులు కోల్పోయాడు.

Pages