S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/13/2018 - 19:46

నా చేతి వేళ్లు పట్టుకున్న
ఉదయంలా నవ్వుతూ
కాస్తంత ముందుకి
ఇల్లు పిల్లాడి అల్లరితో ఊగుతుంది.

తెరచిన కిటికీ అరల్లోంచి
చేతులు చాచుకు ఎగిరే గాలికి
గోడకి వేలాడే క్యాలెండర్లు
ఎగిరి ఎగిరి నవ్వుకుంటున్నాయి.

మూసిన హృదయాల్ని తెరిచే తలుపులు
కొద్దికొద్దిగా వీధి దృశ్యాల్ని
కూరగాయల బండిగానో నడిచిపోయే బాధ్యతలగానో
ఒంపుతున్నాయి.

08/10/2018 - 18:56

సద్యోగాలు ఎప్పుడోగానీ రావు
సమయానికి మేల్కొని
విమలంగా ఆలోచించి
సమరంలా యత్నించాలి
అనుక్షణం అప్రమత్తమై
అనుదినం తదేకచిత్తమై
ఎదురుచూడాలి శుభ సమయం కోసం!
ఉద్యమంతో ఉద్భవించి
కృషితో ఉజ్జ్వలించి
సాధనలో ఫలిస్తుంది
అదృష్ట కల్పవృక్షం!
ఆ వృక్షం అడిగిందల్లా ఇస్తుంది!
ఆజీవనాంతం సిరులతో వనె్న తెస్తుంది!!
*

08/07/2018 - 19:15

ఓటమిని ప్రేమిస్తున్నా
నన్ను గెలిపించాలని చూడకండి
ఇప్పుడు ఓటమి నా శ్వాస
తన నుండి దూరమై ఒక్క నిమిషం కూడ
బతకలేని నిస్సహాయ స్థితి నాది
ఓటమిప్పుడు నా ప్రాణంలో ప్రాణం
గెలుపు కోసం వేసిన అడుగుల మడుగుల్లో
అడుగడుగునా ఓటమి ఓదార్చింది
అందినట్టే అంది చేజారిన గెలుపు రాపిడిలో
వరుసుకుపోయిన గాయాల సలపరింతలపై
ఏదో మాయాలేపనం పూసి

08/03/2018 - 19:31

ఎందుకైనా మంచిది
ఎందరిలో నువ్వున్నా
నవ్వులెన్ని పూయిస్తున్నా
అభద్రతలో పడిపోవడం
కాదు కాని.. నువ్వొక్కడివే
నిజంగా నువ్వొక్కడివే

ఎందరు నిన్ను ఎన్ని విధాలుగా
పొగడ్తల్లో ముంచెత్తినా
అందుకు కారణాలు
ఏవైనా.. ఎన్నున్నా
అపనమ్మకం కాదు కాని
పొగడ్తని నిజమనుకునే
అమాయకత్వం
పొందేదేమిటని..?

08/02/2018 - 19:11

అక్షరాలను అనే్వషించే కన్నులు
పుటల వెంట పరుగులు తీస్తాయి
ఒక్కొక్క పుట మారుతుంటే
చిక్కుబడిపోయిన సంగతులన్నీ
ఒక్కొక్కటిగా విడిపోతాయి
అక్షరాలు విడిపోయినా
అర్థాలు విడిపోవు
అర్థాల మాటున దాగిన
పరమార్థాలు ఎక్కడికీ పోవు!
అసలు పదాలే జీవనదాలు
అవి బారులు తీరి రాకుంటే
ఆవిష్కరించేందుకు అంతా శూన్యమే
పదాల నదులు పరవళ్లు తొక్కుతుంటే

08/02/2018 - 19:09

మనసు పొరలలోన చీకటి
అలుముకున్నపుడు
కిటికీ నుండి లోనికి రాని వెలుగు
ఏం చేస్తుంది?
ఏ పరమాత్మ ముందు దీపాన్ని వెలిగిస్తుంది
ఇల్లు, మనసు అంతా చీకటిగానే ఉంది
ఆత్మను వెలుగులా వుంచుకో అనే తత్వం
బాగానే వుంది కానీ-
కన్నీటితో దీపానె్నలా వెలిగించగలను
చెట్టు నీడలో చిరుగాలి సంగీతం
తనివితీరా నీరు పోసాను కానీ
నీడలో ముళ్లెందుకు మొలిశాయి

07/31/2018 - 19:45

ఆకూ ఆకూ కరచాలనం చేస్తున్న వేళ
ఒక సూర్యోదయం వెలిగింది
మబ్బూ మబ్బూ ఢీకొంటున్న వేళ
ఒక మెరుపు అలా మెరిసి చినుకు అలా కురిసింది.
చిక్కుముడులు నక్షత్రాలుగా చిక్కుకున్నాయి
వేళ్లు నాటుకున్నచోట
గాలి గుహలు కట్టుకున్న చోట
వృక్షాలు వొంగి సలాం చేసే చోట
ఆకలి ఉరుముతుంటే
అరణ్యం వణుకుతోంది
ఒకప్పటి రాతి ఆయుధం
ఇప్పుడు ఆకలి తుపాకై వూగుతోంది

07/29/2018 - 22:35

ఎప్పటి నుంచో
వెంటాడుతుంది
రెక్క తెగిన ఒకానొక కల

పురాజ్ఞాపకాన్ని పురిట్లో పడేసి
వొళ్లంతా ఆక్రమించేసింది

ఈ లోకానికి నేను పరిచయం
కావడానికి
అమ్మ కడుపులో ఎన్ని యుద్ధాలో

విచ్ఛిత్తి కాకుండా సజీవంగా
నేలపై నెలల పసికందుగా
మరణం తరువాతి పుట్టుక
ఓటమి నుంచి గెలుపునకు
ఎదగడం కోసం
ఎన్నో ఏళ్ల కల రూపమై
కళ్లెదుట

07/27/2018 - 20:58

పల్లొదిలీ పట్నం బోయిండురో బిడ్డ,
పట్నానికి బోయిండురో,
నా కొడుకు పట్నానికి పోయిండురో..
సదువుకుంట ననీ బోయిండు,
పెద్ద సదువులే సదివిండు,
ఆ పాలే, గాడనే వుండిపోయిండు,
కొలువు సేసుకుంట,
గాడనే వుండీ పోయిండు,
ముందు ముందు గాల వారానికొక్క
పారి వస్తుండే,
మెలిమెల్లిగ నెలకో పారి ఆయ్యే
గింతల ప్రేమ అంట దాన్ల పడ్డడు,

07/26/2018 - 18:37

పువ్వులే కాదు
ముఖాలు వికసిస్తాయి

నవ్వులే కాదు
వదనాలు హసిస్తాయి

పెద్ద వయస్సేమి కాదు
ఇప్పుడిప్పుడే జంట పదాలను
వొంటబట్టించుకుంటుంది

ఇప్పుడు అప్పుడే
బడికి పోతుంది
ఒక బ్యాగు
నీళ్ల బాటిల్ పలక
టిఫిన్ బాక్స్ మాత్రం
ముందే కొనిపిచ్చింది

పొద్దున తయారవుతుంటే
ముఖం ఒక తాజా పువ్వుగా

Pages