S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

04/19/2019 - 20:00

భోగము, మోక్షము రెండింటిని అను గ్రహింప చేసే స్వామి శ్రీ ఆంజనేయస్వామి. అత్యంత శక్తి సంపన్నుడు.రాముని భక్తుల్లో అత్యంత శ్రేష్టుఢు.

04/14/2019 - 22:08

సజ్జనులకు మనసున మలయమారుతాలు వీస్తే శత్రువుల గుండెల్లో అతిభీకరమైన ప్రచండమైన ప్రళయం సంభవిస్తుందని రాముని గూర్చి మారీచుడు రావణుని హెచ్చరించాడు. పోయే కాలానికి విపరీత బుద్ధి పుట్టినట్టు రావణుడు ఒక్కమారీచుని మాటే కాదు తన స్వంత భార్య మండోదరి చెప్పినా వినలేదు. తమ్ముడు చెప్పినా అర్థం చేసుకోలేని వాడు రావణుడు కనుక రాముని చేతిలో అసువులు కోల్పోయాడు.

04/12/2019 - 19:33

సప్తపురాల్లో అయోధ్య సర్వశ్రేష్ఠం. శ్రీరాముడు దశావతారాలలో విశిష్ఠమైన అవతారం. 84 లక్షల ప్రాణికోటిలో మానవుడు ఒక పరిణితి చెందిన జీవోత్తముడు. సాక్షాత్తు ఆ పరంధాముడే పురుషోత్తముడైన మానవుడుగా అవతరించాడు. ఆదర్శమానవుడై ముల్లోకాల్లోనూ కీర్తిగడించాడు. మూర్త్భీవించిన ధర్మంగా, సాక్షాత్కరించే దైవంగా పేరెన్నిక గన్నాడు.

04/12/2019 - 19:31

ఎడబాటుకు తడబడని
ఆ మనువు మకుటాయమానం
సంకటాలకు సంచలించని
ఆ వలపు తలమానికం
అపనిందలకు హడలిపోని
ఆ అనురాగం అజరామరం
వనవాసానికి వెనుదీయని
ఆ సాంగత్యం
లోకం మెచ్చిన దాంపత్యం
అగ్ని పరీక్షకు అదరని బెదరని
ఆ తియ్యని చెలిమి
వాడని వీడని మమతల కలిమి
ఆకాపురం కష్టాల కడలే అయినా
ఆ బంధం జగానికే అందం
ఆ సంసారం వ్యాకుల సాగరమైనా

04/05/2019 - 19:48

విధాత తన సృష్టి కార్యకలాపాలను సాగిస్తూ కాల చక్రమును నిర్ణయించాడు.

04/05/2019 - 19:46

శివపూజకు
వేళాయంటూ
అడవి అంతటా పూసిన
మోదుగపూల అరుణకాంతులు
ఉషాకిరణాల సమ్మిళితమై
మిరుమిట్లు గొలుపుచుండగా
మళయమారుత
శిశిర శీతలములకు
ఆకురాలిన తరువులు
క్రొత్త చిగురులు తొడుగగా
జలతరంగమై
రైతురాజు వడికిన
ఆకుపచ్చని చీరకట్టిన
ప్రకృతి కాంత
పంచవనె్నల రామచిలుక
కనువిందు ఆవిష్కరణ
ఒక అపురూప దృగ్విషయం

04/05/2019 - 19:45

పండుగలు మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకూ, ఆచారాలకూ కేంద్ర బిందువులు. సమాజంలో ప్రతి కుటుంబంవారు పండుగలు జరుపుకుంటారు. పండుగలు మానవులకు కొత్త ఉత్సాహాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. బంధువులు, మిత్రులు అందరూ కలుసుకోవడానికి పండుగలు ఉపకరిస్తాయి. తద్వారా ప్రతిమనిషి మధ్య ఐకమత్యం ఏర్పడుతుంది. దీనితోపాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఏర్పడుతుంది.

04/05/2019 - 19:45

విళంబిలో తీపి చేదులను చవి చూసి
కొత్త వసంతానికి చిగురు తొడుక్కున్న ఒక కోయిల
పిలవకనే ఇంటికి వచ్చేసింది!
ఇదేంటంటే? మనవారే కదా
నేను శుభం పలుకాలి కదా! అంది
భవిష్యత్తు భరోసా ఇస్తా
అంటూ ఆశపాటొకటి ఈ కొత్త కోయిల
రాగరంజితంగా ఆలపిస్తోంది
మనిషిలోని వికారగుణాల ఏరివేతకు
నాందీసూచకమే ఈ కొత్త ‘వికారి’ అంటోంది

04/05/2019 - 19:44

ఎందుకీ మావికొమ్మ
విప్లవ గీతాలు వినిపిస్తోంది?
ఎందుకీ మూగ ఎండ
మట్టిని కూడా కాల్చేస్తోంది?

కాలాన్ని కలంగా
మార్చుకుని కాల పురుషుడు
ఏకథ వ్రాయాలనుకొంటున్నాడు?
ఏ యే వ్యధలు చెప్పాలనుకొంటున్నాడు.?

04/04/2019 - 19:48

యుగాది... యుగ, ఆది అన్న పదాల కలయిక. యుగారంభం అని అర్థం. యుగాదే వాడుకలోకి వచ్చేసరికి ఉగాది అయ్యింది. ‘యుగం’ యొక్క ‘ఆది’ అనే అర్థంలో ఉగాది శబ్దం ఏర్పడింది. ‘‘చాంద్రమానం’ ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమితో కాలం ప్రారంభమవుతోంది. కనుక దానే్న సంవత్సరాదిగా, ఉగాదిగా వ్యవహరిస్తున్నాం. బ్రహ్మ చైత్రమాసంలో శుక్ల పాడ్యమినాడు మొదటి నక్షత్రంలో సూర్యోదయ కాలంలో సృష్టి కార్యానికి శ్రీకారం చుట్టాడు.

Pages