S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/29/2018 - 18:48

అక్కడి పూలు దుఃఖాన్ని వినీవినీ
దుఃఖానే్న పరిమళిస్తున్నాయి
నైట్‌క్వీన్ చెట్లు
రక్త, మూత్ర పరీక్షల వాసనలను
వెదజల్లుతున్నాయి
అక్కడి కిటికీల్లోంచి చంద్రుడు
వెనె్నలను భళ్లున వాంతి చేసుకుంటున్నాడు
రోగి ‘ఇన్’ ‘అవుట్’ గేట్ల మధ్య తిరిగీ తిరిగీ
ఎగ్జిట్‌కై వెంపర్లాడుతున్నాడు
అతని సంబంధీకుల చేతుల నిండా
మందు బిళ్లలో, ఆసుపత్రి బిల్లులో

08/28/2018 - 18:49

మా ఇంట రావిచెట్టు
గుబురుతో సొగసుతో ఉన్నవేళ
నిండా పక్షుల గూళ్లు
కిలకిలరావాల చప్పుళ్లు ఎప్పుడూ...
* * *
రెక్కలిప్పి ప్రతి పక్షిపిల్ల
నింగిలోకెగిరి నక్షత్రాలను
ముద్దాడాలనే తహతహ
తనువు నిండా...
* * *
గ్రీష్మఋతువు తాకిన కాలం
రావాకులు ఒక్కొక్కటిగా రాలి
కిరీటమై కీర్తించాయి అవని శిరమెక్కి..
* * *

08/27/2018 - 19:10

జీవితాన్ని ప్రేమిస్తున్నాను కానీ
జీవనం ఆనందంగాలేదు
జీవితం మర్రిచెట్టు
జీవనం తుమ్మచెట్టు
అందం కనుమరుగవుతున్న వేళ..
అస్తమయ గీతాలు పాడక తప్పదేమో కానీ
ఇంకా అస్తమయానికి సమయం కాలేదు
తలమీద సూర్యుడు వ్రేలాడుతున్నాడు.
తనివితీరా కౌగిలించుకోవటానికి
మల్లెచెట్టు కనిపించదు..
మంచి మనసు వినిపించదు
ఓడిపోయిన రాత్రి
కన్నీరు కార్చికార్చి

08/26/2018 - 21:44

హేయ సంస్కృతి
హీన కృత్యాలు
నీ రంగస్థలిలో
నవరస నటనలు
ఆకాశదారుల వెంట
భూమార్గాల నిండా అదే నటన!
గాలి తలవంచుకు పోతూంది
నీరు నిశ్శబ్దంగా పారుతూంది
ప్రకృతి పెదవి కదపక నిలిచింది
చరిత్ర పుటలకెక్కుతూ ఉంది.
రేపు
గాలి పీల్చినవాడు
తలవంచిన గాలిని తలెత్తి ప్రశ్నిస్తాడు
నీరు తాగినవాడు
పారే నీటి నిశ్శబ్దంలో శబ్దం వింటాడు

08/24/2018 - 18:45

రక్తం పంచుకొని పుట్టిన పేగుబంధం
మరొకరి గడపని సుసంపన్నం చేస్తూ మంచితనాన్ని
విస్తరిస్తే గుబాళించిన పరిమళం
దశదిశలా వ్యాపించింది

పుట్టక ముందే చచ్చిపోతున్న కాలంలో
అస్తిత్వ పుష్పమై మొలిచిన స్ఫూర్తికి
చేయెత్తి మొక్కాలి

అన్న కష్టం వెనుకున్న ప్రతి సందర్భంలో ఓదార్పు పవనమై
మనసుకు హాయినిచ్చే సోదర భావం
అడుగడుగునా కాళ్లకి
అల్లుకుపోతూ ఉంటుంది

08/23/2018 - 20:10

రాస్తేనే కవిత్వమా
మరి..
మెదడు జీర్ణించుకోలేని
సందర్భాలలో వేదన వినే దిక్కెవరు?
మెచ్చుకోలును ఒప్పుకోని ఈగో
సన్మాన పీఠమెక్కడానికి
తయారవుతోంది రేపటి లోగో
తేనె పొగడ్తల మాటల వెనక
విషపూరిత సమాలోచనలు
గుండెకు అర్థమవుతూనే ఉంటాయ్
ప్రతిభను ప్రోత్సహించే పెద్ద మనుషులు
గద్దలకూ తెలుసు ఆహారాన్ని
ఎలా పట్టుకోవాలో

08/22/2018 - 19:48

ఎన్ని చదువులు చదివినా
ఏమి లాభం?
మానవత్వం పరిమళించనపుడు
మానవత్వమే మనిషిలోని దైవత్వం

నేటి ‘నీటి’ వృథా
భావితరాలకు
కన్నీటి వ్యథ

‘అమృతం’ సురలకు
పంచాడు విష్ణువు
‘అమ్మ’ను మానవాళికి
ప్రసాదించాడు బ్రహ్మ
గర్భగుడిలో దేవుడు
భక్తులు కోరేది దైవదర్శనం
హుండీ నిండాలని గుడి ధర్మకర్తలు
కోర్కెలు పండాలని భక్తజనం

08/21/2018 - 19:08

ఒక ఆత్మీయ పలకరింపు
బరువెక్కిన గుండెను
తేలికపరచగలదు.

చేరువైన ఒక బంధం
ఒంటరితనాన్ని
దూరం చేయగలదు.

ఒక ఆశావహ దృక్పథం
నైరాశ్యాన్ని తొలగించి
ఉత్సాహాన్ని నింపగలదు.

ఒక ప్రేమాస్పద వైఖరి
వైరి భావాన్ని హరించి
స్నేహతత్వాన్ని పెంపొందించగలదు.

ఒక విస్పష్ట ఆలోచనా ధోరణి
శూన్యాన్ని పోగొట్టి
కార్యశీలత నందించగలదు.

08/20/2018 - 20:42

ఇసుక తినె్నలు
నా భారాన్ని మోయలేక
పాదముద్రల సొట్టలు పడుతూ
పశ్చిమ తీరానికి నన్ను ఆహ్వానిస్తున్న
శుభ సాయం సంధ్యవేళ..
ఎదురుగా నా ఆయుష్షుకు
ప్రతిరూపంగా సూర్యుడు అస్తమిస్తున్నాడు
ఏదో చల్లని చెమరింపు స్పర్శ
నా అరిపాదాల క్రింద...
అణువణువూ విస్తరిస్తూ
పైకి పాకుతున్న అనుభూతి...
అస్థిత్వపు చలనాన్ని కలుగజేస్తూ చిన్న కదలిక..

08/17/2018 - 18:44

పురివిప్పిన చిరుజ్ఞాపకం
మనసు పొరల్ని-
ఆర్ద్రంగా తడిమినా-
తిరిగి రాని ఆ వసంతం
కలలా కరిగిపోయింది!
నవ్వుల నావలా సాగిపోయిన
యవ్వన జవ్వని - నేడు
జవసత్త్వాలు కోల్పోయి
మోహనరాగాలు పలికించలేక
మోడువారిన తరువులా మిగిలాయి!
సుమధుర సరాగాలను
శృతిచేసిన వలపు వీణ
కాలాన్ని జయించలేక
కన్నీటి పర్యంతమై మిగిలింది!

Pages