S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

06/14/2019 - 19:41

సెంట్రల్ బొటానికల్ లేబొరెటరీ (అలహాబాద్)కు డైరెక్టర్‌గా, రీజనల్ రీసెర్చి లేబొరెటరీ (జమ్మూ), బాబా అటామిక్ రీసెర్చి సెంటర్ (బొంబాయి), సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ (బొంబాయి) వంటి ప్రసిద్ధ వైజ్ఞానిక సంస్థలకు గౌరవ శాస్తవ్రేత్తగా బహుముఖ సేవలను అందించారు. చెరకు, వంగ మొక్కలపై చిరస్థాయిగా నిలిచే పరిశోధనలు చేశారు.

06/13/2019 - 20:33

నాటిన ఒక్కో మొక్కను కాపాడుకునేందుకు మహిళలు గుట్టకు దిగువన ఉన్న మంజీర నది నుండి బిందెలతో నీరు తీసుకువచ్చి పోసి పెంచి పోషించారు. ఇప్పుడు ఆ గట్టు ప్రాంతమంతా పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా కనిపిస్తోంది.

06/12/2019 - 19:32

బతుకు మొదలుపెట్టగానే బాధ్యతలు మరిచిన పుత్రరత్నాల నిర్వాకానికి నిదర్శనాలు వృద్ధాశ్రమాలు.. అవసాన దశలో ప్రేమానురాగాలు, ఆప్యాయతలే ఔషధాలుగా బతుకుతూ రోజులు లెక్కపెట్టుకునే పండుటాకుల పాలిట అవి బందిఖానాలు.. ‘చిట్టితల్లి నిద్ర లే.. స్కూలుకు టైమవుతోంది..’ అంటూ నిదుర లేపిన అమ్మానాన్నలు.. ఇప్పుడు వృద్ధాశ్రమంలో లేవలేని స్థితిలో ప్రేమగా మాట్లాడే నాలుగు మాటలకోసం తపించిపోతున్నారు.

06/11/2019 - 20:02

హింసను నిశ్శబ్దంగా భరించాలి.. వివక్షను వౌనంగా ఆమోదించాలి.. నోరెత్తితే తప్పు.. ఇదీ దిల్లీలోని మురికివాడ మహిళల పరిస్థితి.. వారి జీవనం, జీవితం చాలా దుర్భరం. కష్టాల్లో ఉన్న సమయంలో ఒంటరి స్ర్తిలకు ఆసరా కావాలి. ఆ ఆసరానే అందిస్తున్నాయి దిల్లీ నగరానికి చెందిన మహిళా పంచాయితీలు.

06/10/2019 - 19:42

ఆలోచనలు అందరూ చేస్తారు. కాని అసాధారణంగా కొందరే ఆలోచిస్తారు. అలా భిన్నంగా ఆలోచించగలిగినవారు మాత్రమే జీవితంలో విజయాలు సాధిస్తారు. నాయకులు అవుతారు. ఇలా వారియొక్క, విశిష్ట వ్యక్తిత్వంతో పలువురిని ఆకట్టుకుంటారు. ఎన్నో విజయాలను సాధిస్తారు. అసలు అసాధారణంగా ఆలోచించటమంటే ఏమిటి! అందరూ ఆలోచించే పద్ధతిలో లేదా ఒక మూస విధానంలో ఆలోచించక పోవటమే.

06/09/2019 - 22:59

వేసవి సెలవులు అయిపోయాయి. బడి తెరిచే సమయం ఆసన్నమైంది. వేసవి సెలవుల్లో సమయమనేదే లేకుండా ఆడేస్తోన్న చిచ్చర పిడుగుల స్వేచ్ఛకు కళ్లెం పడబోతోంది. కారణం ఎల్లుండి నుంచి స్కూళ్లు మొదలవబోతున్నాయి. ఇన్నాళ్లూ ఆటలతో, పాటలతో ఆనందించిన చిన్నారులను మళ్లీ బడిబాట పట్టించాలంటే కాస్త కష్టమైన విషయమే.. కానీ ముందునుంచీ వారిని సిద్ధం చేయించడం వల్ల బడికి వెళ్లే సమయానికి ఇబ్బంది పెట్టకుండా ఉంటారు.

06/08/2019 - 14:40

ఇక్కడున్న బామ్మ పేరు ప్రమీల బిసోయ్.. వయస్సు 70 సంవత్సరాలు.. ఈమె ఎప్పటిలాగే ఆ రోజు కూడా చెరమరియా అనే తన ఊళ్లో.., ఓ బడిలో.. పిల్లలకు మధ్యాహ్న భోజనం కోసం వంట ఏర్పాట్లు చూస్తున్నది..
అంతలో బీజేడీ లీడర్ హడావుడిగా అక్కడికి వచ్చి.. ఆమెతో "భువనేశ్వర్ నుంచి ఫోన్ వచ్చింది.. మాట్లాడు’’ అన్నాడు.
అందుకు ప్రమీల బిసోయ్ "ఫోన్ ఎవరి నుంచి?’’ అంది.

06/06/2019 - 19:19

విశ్వవ్యాప్తంగా విభిన్న రంగాల్లో మహిళలు దూసుకుపోతుండగా.. కొన్ని ప్రాంతాల్లో మతాచారాలు, కట్టుబాట్ల పేరిట వారిపై ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫుట్‌బాల్ మ్యాచ్‌లను వీక్షించేందుకు స్టేడియంలలోకి మహిళలు అడుగుపెట్టడానికి వీల్లేదంటూ సౌదీ అరేబియా, ఇరాన్ దేశాల్లో ఇప్పటికీ నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయి.

06/05/2019 - 19:43

దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44, 45 డిగ్రీల సెల్సియస్ దాటిపోతున్నాయి. జూన్ ఐదో తేదీ రాగానే ప్రపంచ పర్యావరణ దినోత్సవాలను జరుపుకుంటాం. కానీ చిన్న చిన్న పద్ధతులను అవలంబించి భూతాపాన్ని తగ్గించుకునే దిశగా కృషి మాత్రం చేయం. వాతావరణ సమాచారం అందించే వెబ్‌సైట్ వెల్లడించిన గణాంకాల ప్రకారం భూగోళంపైనే అత్యధిక వేడి ప్రాంతంగా సెంట్రల్ ఇండియా పేరు నమోదైంది.

06/04/2019 - 23:39

కాలేజీలో మొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు కలిగే అనుభూతిని ఎవరూ తమ జీవితంలో మరిచిపోలేరు. అక్కడ చేరాకే అన్నీ తెలుసుకుంటాం. నేర్చుకుంటాం. ఊర్ల నుంచి పట్టణాలకు చదువుకోసం వచ్చే అమ్మాయిలు ఆ అనుభూతుల్ని పదిలపరుచుకోవాలంటే.. వాళ్లు అధిగమించాల్సిన సమస్యలేంటో, వాటికి పరిష్కారాలేంటో తెలుసుకుందాం.
* చదువు, భాష, ఆహార్యం.. ఇలా ఏదైనా సరే అనుకుంటే సాధించవచ్చు.

Pages