S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

07/09/2018 - 22:29

నీటి ప్రవాహానికి ఏదైనా కొండ అడ్డువస్తే ఆ కొండను అధిగమించో లేక ఆ కొండ పక్కనుంచే చిన్న వాగులా మారి ప్రవాహం సాగిపోతూ ఉంటుంది. ప్రవాహానికి ఏది అడ్డు వచ్చినా తన రూపం మార్చుకుంటూ కురచగానో, ఉవ్వెత్తునో, విశాలంగానో ఏదో ఒక విధంగా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అట్లానే తరుణుల జీవితాలు ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిని అధగమించో లేక వాటిని పక్కన పెట్టో ఏదో ఒకవిధంగా జీవితాన్ని సాగిస్తుంటారు మహిళలు.

07/08/2018 - 23:55

చాలామంది నిద్రపట్టక సతమతమవుతుంటారు. క్రమబద్ధమైన అలవాట్లను పాటిస్తే మంచి నిద్ర సొంతమవుతుంది. రోజూ నిద్రపోతూనే ఉంటాం. అందుకే నిద్ర గురించి ఎప్పుడూ పెద్దగా పట్టించుకోం. నిశ్చింతగా నిద్ర అన్నది ఏదో కొద్దిమందికి దక్కే అదృష్టంలా తయారైంది. నిద్ర లేక, నిద్ర రాక, నిద్ర చాలక ఇలా ఎంతోమంది రోజూ ఏదో నిద్ర చికాకు అనుభవిస్తూనే ఉన్నారు.

07/06/2018 - 23:47

వాతావరణం మారింది. ఈ మార్పు ముఖ చర్మంలో వెంటనే తెలిసిపోతుంది. ముఖం అంతా ఎండిపోయినట్టు కాంతి విహీనంగా, అసహ్యంగా తయారవుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఒకేరోజులో ఎండ, విపరీతమైన ఉక్కపోత.. వెంటనే వర్షం, చల్లని గాలులు.. ఇలా ముఖం తాజాదనాన్ని కోల్పోయి అందవిహీనంగా తయారవుతుంది.

07/06/2018 - 02:58

అనురాగంలోని మొదటి అక్షరాన్ని మమకారంలోని మొదటి రెండక్షరాల్ని పెనవేసే బంధం అమ్మ. ‘అమ్మతనం’ అన్నదానికి విశిష్టస్థానం ఉంది. అమ్మంటే అద్భుతం, ఆత్మీయత, అనురాగం, అనుబంధం. అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత పాలన సృష్టితత్త్వాన్ని సఫలం చేస్తే, జీవితాన్నిచ్చిన ఆమె ఆలన - జీవన సత్యాన్ని ఉటంకిస్తుంది.

07/04/2018 - 23:46

కిందటి సంవత్సరం ఢిల్లీలో జరిగిన ఒక అరుదైన సంఘటన అవయవదానం విశిష్టతను అద్భుతంగా తెలియజేస్తుంది. మదన్‌మోహన్ కుమారుడు 20 సంవత్సరాల వయసుగల అన్మోల్ ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ స్థితికి వెళ్లిపోయాడు. అతని మరణం వృథాపోరాదని అతని తల్లిదండ్రులు భావించి వెంటనే ఢిల్లీలోని కుటుంబ అవయవ బ్యాంకింగ్ సంస్థ (ఆర్బో)ను సంప్రదించారు.

07/03/2018 - 21:22

పుట్టింది భారతదేశం..
పెరిగింది ఫ్రాన్స్..
ఉండేది అమెరికాలో..
ప్రముఖ మోడల్..
హాలీవుడ్ హీరోయిన్..
యోగా గురువు..
డాన్స్ మాస్టర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డ్..

07/02/2018 - 21:50

నానాటికీ పెరిగిపోతోంది జనంలో అశాంతి, అసంతృప్తి. నిరుద్యోగికి సుఖంలేదు, ఉద్యోగికి సంతృప్తి లేదు, విద్యార్థుల్లో శాంతీ సహనం లేదు. గృహంలో వున్న యజమానికీ, ఇల్లాలికీ సహనం లేదు, సంతోషం లేదు. భార్యాభర్తల మధ్య రసానుభూతినీ ఆస్వాదించలేకపోతున్నారు. ఎందుకని? అని ప్రశ్నించుకుంటే, సమాధానాలు, మనని పూర్తిగా సమాధానపరచలేవు.

07/01/2018 - 22:21

పేట్రేగిపోతున్న ప్రేమోన్మాదం..
హత్యలకు ఎగబడుతున్న యువకులు..
పాశ్చాత్య సంస్కృతికి బానిసలుగా మారుతున్న యువత..
ఇవన్నీ నేటి యువత మానసిక స్థితికి నిదర్శనం..

06/29/2018 - 22:04

కొంటాం.. వాడేస్తాం.. ఇంటికి తెచ్చి చెత్త నింపి మళ్లీ పడేస్తాం.. మళ్లీ కొంటాం.. వాడేస్తాం.. పడేస్తాం.. ఇలా ప్రతిరోజూ ఓ వ్యక్తి ఓ పాలిథీన్ కవర్‌ను పడేసినా.. అదంతా రోజుకు వందకోట్ల పైమాటే.. అవన్నీ ఎక్కడికి వెళతాయి..? ఏమైపోతాయి? అనేదే పెద్ద ప్రశ్న.. నిజమేమిటంటే అవి ఎక్కడికీ వెళ్లడం లేదు. భూమిపై, నీళ్లల్లో, కొండల్లో, గుట్టల్లో, తుప్పల్లో, జంతువుల కడుపుల్లో.. ఇలా ఎక్కడపడితే అక్కడ ఉన్నాయి.

06/28/2018 - 23:00

పెళ్ళైనా, నిశ్చితార్థమైనా.. సంతోషకరమైన ఏ వేడుకైనా అమ్మాయిలు లెహంగాలకే ఓటేస్తున్నారు. లెహంగాలు దక్షిణ భారతదేశం సంప్రదాయం కానప్పటికీ ఉత్తర భారతదేశ సంప్ర దాయ పోకడలు యువత ఎక్కువగా ఆచరించడం వల్ల పెళ్ళిళ్లలోని సంగీత్, మెహెందీ వేడుకల్లో లెహంగాలు ఆహా.. ఓహో.. అనిపిస్తున్నాయి. పెళ్ళికూతురుతో పాటు మిగిలిన అమ్మాయిలు కూడా పెళ్ళి వేడుకలైనా, కాస్త పెద్ద వేడుకలైనా వస్త్ధ్రారణకు లెహంగాలనే ఎంచుకుంటున్నారు.

Pages