S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/22/2016 - 21:46

రాధాకృష్ణులు పవిత్ర ప్రేమమూర్తులుగా విరాజిల్లిన ఈ ప్రాంతాలలో హోలీ కన్నుల పండువగా నిర్వహిస్తారు. మధుర బిహారి దేవాలయంలో రంగుల హరివిల్లు కనిపిస్తోంది. బృందావనంలో దాదాపు వారం రోజుల పాటు హోలీ సంబరాలను నిర్వహిస్తారు.

03/22/2016 - 21:44

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన శాంతినికేతన్‌లో వసంతోత్సవం ఇక్కడే విరబూస్తుందా అన్నట్లుగా విద్యార్థులు వివిధ రంగులలో దుస్తులు ధరించి ఠాగూర్ రచించిన గీతాలు పాడుతూ విభిన్నమైన సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. దీనివల్ల విద్యార్థులకు సంస్కతీ, సంప్రదాయాలపై అవగాహన కలుగుతోంది.

03/22/2016 - 21:41

ఉదయ్‌పూర్‌లో జరిగే ఈ హోలీ ఉత్సవంలో రాజసం ఉట్టిపడుతోంది. హోలీకి ఓ రోజు ముందే హోలికా దహనం జరుగుతోంది. ఈ పట్టణంలోని జగదీశుని ఆలయంలో జరిగే హోలికా దహనం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. పట్టణంలోని పలుచోట్ల కూడా దహనాలు జరుగుతాయ. వసంత రుతువు ఆగమనం మనుషులలోనే కాదు ప్రకృతిలోనూ సరికొత్త సొగసును తీసుకువస్తుంది. ఎండిన చెట్లు చిగురిస్తాయి.

03/19/2016 - 21:54

తినీ సన్నగా ఉండడం వరం, ఏం తినలేక సన్నగా కనబడినా, బలహీనంగా ఉండడం సమస్య. ఈ సమస్యకి కారణం తినడం ఇష్టం లేకపోవడం కావచ్చు లేక తినలేకపోవడం కావచ్చు. మనం రెండో దానిమీద శ్రద్ధ వహిస్తే, తినలేకపోవడానికి కారణాలు చాలా ఉన్నా, ముఖ్యమైనవి మాత్రం ఇవి-
1.పళ్లు పూర్తిగా లేకపోవడం
2.పంటి నొప్పి
3.నోరు తెరవలేకపోవడం
4.దవడ ఎముక విరిగినపుడు

03/18/2016 - 22:50

‘ఒకప్పుడు మనం నిద్రలేవగానే మన కళ్ల ముందు కనిపించే చిన్ని నేస్తం పిచ్చుక. పెరట్లోని చెట్లపై ఎన్నో రకాల పక్షులు కిలకిల రావాలు చేసినా ఇంటి చూరుల్లో, గోడల నెర్రెల్లో గూడు కట్టుకుని కళ్లు తెరవగానే కనిపించే ఈ జంట చిట్టి గువ్వలు చేసే కిచకిచలు నేడు పల్లెల్లోనే కరువైంది.

03/18/2016 - 01:13

ఇపుడు సోని సొరి పోరాట బాణం పోలీసులపైనే కాకుండా ఐజి కల్లూరి శివరామ్‌పైనే ఎక్కుపెట్టారని చెప్పవచ్చు. తమ గ్రామంలోని ఇళ్లన్నీ తగులబెట్టించిన శివరామ్‌పై ఇంతవరకు చత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమ పల్లెసీమలో ప్రతి రెండు కిలోమీటర్ల దూరానికి సైనిక బలగాలను నియమించాల్సిన అవసరమేమిటని ఆమె ఆక్రోసిస్తున్నారు.
============

03/17/2016 - 07:24

కంప్యూటర్ ఆన్‌చేసి మెయిల్స్ చెక్‌చేసుకుంటున్న ఎలిజబెత్‌కు ఓ ఈ-మెయిల్ సారాంశం ఆనందడోలికల్లో ముంచెత్తింది. ఇరవై ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ.. అంటూ పొంగిపోయింది నాలుగు పదులు దాటిన ఎలిజిబెత్ పూర్వే జురెండల్. 42 ఏళ్ల ఎలిజబెత్‌కు ప్రతి క్షణం అమ్మ తలపులే. జన్మనిచ్చిన ఆమ్మ ఎలా ఉంటుంది? జీవితంలో ఒక్కసారైనా ఆమెను చూడగలనా? మాతృమూర్తి మమకారం ఎలా ఉంటుందో తెలియకుండానే కన్నుమూస్తానా?

03/15/2016 - 22:11

సరిత కుండీలోని మట్టిని సరిచేసి తులసి మొక్కకు నీరు పోస్తుంది. తల్లి చేస్తున్న పని చూసిన ఎనిమిదేళ్ల అనుష్కా రివ్వున ఇంట్లోకి పరుగెత్తుకు వెళ్లి టీ తాగే పేపర్ గ్లాసులను తీసుకువచ్చి వాటిల్లో మట్టి వేసి పోపుల డబ్బాలో ఉన్న ఆవాల గింజలు వేసి నీళ్లు పోసింది. కూతురు చేస్తున్న పని చూసి మురిసిపోయిన ఆ తల్లి తనకెందుకు ఇలాంటి ఐడియా తట్టలేదు. ఇంట్లో పనికిరాని గాజు సీసాలు, జాడీలు, బౌల్స్ ఉన్నాయి.

03/11/2016 - 23:30

‘మనసుని అదుపులో వుంచుకోగలిగినవారే మహాశక్తిశాలురని’ లోకోక్తి. రోజు రోజుకీ సంక్లిష్టమవుతున్న జీవనశైలిలో ప్రతినిత్యం మనసు ఎన్నో రకాల ఒత్తిళ్ళకు గురి కావలసి వస్తోంది.సమస్యలతో యుద్ధం చేయడమే మనిషి జీవితంగా మారిపోయిన ఈ రోజుల్లో మానసిక ప్రశాంతత అన్నది అందినట్టే అంది చేజారిపోతూ వుంటుంది. ఇటీవల జరిగిన ఓ సభలో మీలో మానసిక ఆనందం ఉన్నవారు చేతులు ఎత్తండి అని అంటే.. ఒకరిద్దరు మాత్రమే చేతులు ఎత్తగలిగారు.

03/11/2016 - 00:51

‘మహిళా బిల్లు’ అటకెక్కినందున చట్టసభల్లో మగువలకు రిజర్వేషన్లు ఇవ్వలేకపోయామంటూ రాజకీయ పార్టీల నేతలు తరచూ సానుభూతి ఒలకబోస్తుంటారు. అయితే, సవరించిన కంపెనీల చట్టం ప్రకారం కార్పొరేట్ సంస్థల్లో విధిగా కొంతమంది మహిళా డైరెక్టర్లను నియమించాలన్న నిబంధనలు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. నిబంధనల్ని ఉల్లంఘించే కంపెనీల యాజమాన్యాలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మన నేతలెవరూ డిమాండ్ చేయరు.

Pages