S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

02/06/2016 - 23:52

ఓసారి నా దగ్గరకి 24 ఏళ్ల కుర్రాడొచ్చాడు కన్సల్టేషన్‌కి. చాలా ‘డల్’గా ఉన్నాడు. ‘ఏమైంది బ్రదర్..?’ అని ఆసక్తిగా అడిగా. ‘పండక్కి ఇంటికి వెళ్లా.. చాలా ఆనందంగా ఇంటికెళ్లిన నాకు అక్కడ నిరాశ ఎదురైంది. నా గర్ల్‌ఫ్రెండ్ నాతో విడిపోయింది’- అని కన్నీరు పెడుతూ చెప్పాడు.

02/05/2016 - 20:18

కాయకష్టం చేస్తూ వేళకు ఆహారం తీసుకునే గ్రామీణులు ఆరోగ్యవంతంగా ఉంటారని అనుకోవడం సహజం. మంచి ఆహారపు అలవాట్లు, మేలైన ఆరోగ్య పద్ధతులకు దూరమవుతున్నందున నగర వాసుల్లోనే ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తాం. అయితే, ఉరుకులు పరుగుల ఆధునిక యుగంలో పల్లెల్లోనూ జీవనశైలి మారుతున్నందున గ్రామీణులు సైతం రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నట్లు ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’లో వెల్లడైంది.

02/05/2016 - 00:15

ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ బాక్సింగ్ పోటీల్లో సత్తా చూపిన పదిహేనేళ్ల నిహారిక 2020 ఒలింపిక్స్‌లో దేశానికి స్వర్ణపతకం సాధించి పెడతానని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఈ తెలుగింటి బాలిక కొద్దిరోజుల క్రితం సెర్బియాలో జరిగిన బాక్సింగ్ పోటీల్లో అసమాన ప్రతిభ చూపింది. గత నెలలో జరిగిన 5వ జాతీయ బాక్సింగ్ కప్ పోటీల్లో రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది.

02/04/2016 - 03:23

కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు.. బరువును తగ్గించుకోవాలని, చెడు అలవాట్లకు స్వస్తిపలకాలని చాలామంది సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, ఆచరణలో కొద్దిమంది మాత్రమే ఆశాజనకమైన ఫలితాలను సాధిస్తుంటారు. బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ ఫిట్‌నెస్ కోసం ఈ ఏడాది రెండు భిన్నమైన వ్యాయామాలను ప్రాక్టీస్ చేస్తోంది.

02/03/2016 - 02:57

దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అనతికాలంలోనే అరుదైన ఘనతను సాధించింది. హర్యానాలోని ఫరీదాబాద్ వద్ద జరుగుతు న్న ‘సూరజ్‌కుండ్ అంతర్జాతీయ కళా ప్రదర్శన’లో కీలక రాష్ట్రం (్థమ్ స్టేట్)గా స్థానం సంపాదించడంతో తెలంగాణ సంస్కృతి, కళల గురించి విదేశీయులకు సైతం తెలిసే అవకాశం కలిగింది. ‘30వ సూరజ్‌కుండ్ మేళా’లో తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే స్టాళ్లు సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి.

02/01/2016 - 15:23

పురాణాల కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకూ మగువల మనోహర రూపానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాల భామల కోసం రాజుల మధ్య యుద్ధాలు జరిగాయి. రాజ్యాలను కోల్పోయిన వారూ ఉన్నారు. చరిత్రను పక్కనపెట్టి, వర్తమానంలోకి వస్తే ఆడ,మగ అనే తేడా లేకుండా అందరిలోనూ అందం కోసం ఆరాటం పెరిగింది. అమ్మాయిల్లోనే కాదు, అబ్బాయిల్లోనూ అందం పట్ల ఆసక్తి పెరిగింది.

01/29/2016 - 21:14

చిన్నారులనే కాదు, తల్లుల్ని సైతం ఎంతో ఆకట్టుకుని విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్లాస్టిక్ బొమ్మ ‘బార్బీ’ ఇపుడు కొత్త అందాలను సంతరించుకుంది. బొమ్మల ప్రపంచంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానం పొందిన ‘బార్బీ’ ఇన్నాళ్లూ ఒకే ఆకారంలో సాక్షాత్కరించేది.

01/28/2016 - 21:31

‘వీణావాదన తత్త్వజ్ఞో శ్రుతి జాతి విశారదః
తాలజ్ఞశ్చా ప్రయాసేన మోక్షమార్గం నియచ్ఛతి’
-యాజ్ఞవల్క్య స్మృతి

01/27/2016 - 22:39

‘అమ్మా.. ఈ ఫ్యామిలీ ఫొటో చూడు.. ఇందులో ఎంతమంది ఉన్నారనుకున్నావు? నలభై మంది పైనే ఉన్నారు. మా ఫ్రెండ్ శార్వాణి వాళ్ల ఫ్యామిలీ ఫొటో ఇది. ఆమెకి ఐదుగురు బాబాయిలు, ముగ్గురు అత్తయ్యలు, నాన్నమ్మ, తాతయ్య, ఇంకా ఎంతోమంది కుటుంబ సభ్యులు. అంతా ఒక్క దగ్గరే ఉంటారు. వాళ్ల ఇల్లు మేడపైన, కింద కలిసి ఆరు పోర్షన్లు. వాళ్లింట్లో ఎపుడూ సందడే. ఇంతమంది ఒక్క దగ్గర ఏ గొడవా లేకుండా ఎలా వున్నారా? అనిపిస్తుంది.

01/27/2016 - 08:46

మండే ఎండాకాలమైనా, వణికించే శీతాకాలమైనా ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నపుడే మానసికోల్లాసం ఎవరికైనా సాధ్యపడుతుంది. కాలానికి తగ్గట్టుగా ఇళ్లలో పూలమొక్కలు పెంచుకుంటే మన కళ్లముందు వన సౌందర్యం కాంతులీనుతుంది. చిన్న చిన్న పట్టణాల్లో సైతం అపార్ట్‌మెంట్ల సంస్కృతి విస్తరించడంతో నేడు ఇళ్లలో మొక్కలు పెంచడం కష్టతరమవుతోంది.

Pages