S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

09/08/2019 - 23:14

నేడు మానవ సంబంధాలు పూర్తిగా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు అందరూ కలిసి ఉండేవారు. పల్లెటూళ్ళలో కూడా అంతా కలిసిమెలిసి ఉండేవారు. ఊరికి ఏ కష్టం వచ్చినా కుల, మత, జాతి భేదం లేకుండా అందరికీ సహాయం చేసేవారు. ఆ సహృదయత, సద్భావం పూర్తిగా అంతరించలేదు. ఇప్పటికి కొన్ని పల్లెటూళ్ళలో వరసలతో పిలుచుకుంటూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటారు.

09/06/2019 - 18:49

పారిస్‌లో వేడుకలు
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని యునెస్కో ప్రతి ఏటా సెప్టెంబర్ 7, 8 తేదీల్లో రెండు రోజుల పాటు పారిస్‌లో వేడుకగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది భారీ ఏర్పాట్లు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా అక్షరాస్యతపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు ప్రత్యేకించి పురస్కారాలను అందజేయబోతున్నారు. వచ్చే ఏడాది కాలానికి కార్యాచరణ రూపొందించారు.

09/05/2019 - 19:30

'ధనం మూలం ఇదం జగత్’ అని ఆర్యోక్తి. జగతి జీవనాధారానికి డబ్బు మూలం అని అర్థం. డబ్బే ప్రపంచం కాకూడదుగానీ ప్రపంచం గడవడానికి డబ్బు అవసరం. ప్రతి మనిషికి కోరికలనేవి ఉంటాయి. అవి తీరాలంటే ఆర్థిక వనరులు అవసరం. ‘కోరికలే బాధలన్నిటికీ మూలం’ అని బోధివృక్షం క్రింద జ్ఞానోదయంతో బుద్ధుడు చెప్పాడు. మనిషిగా పుట్టాక కోరికలు లేకుండా బ్రతకడం సాధ్యమయ్యే పనేనా?

09/04/2019 - 19:03

విశ్వవిద్యాలయాలు విద్యార్థులలో మంచి నాయకత్వ లక్షణాలు కలిగించే నాగరికతా కేంద్రాలుగా భాసిల్లి ప్రాచీన సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబాలుగా నిలబడాలి. మన విద్యా విధానం మానవీయ విలువలను విద్యార్థుల్లో
ఇనుమడింపజేయాలి. వారిలో నిగూఢంగా వున్న సామర్థ్యాలను వెలికితీసి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి.

09/03/2019 - 19:02

ఇటీవల మహబూబ్‌నగర్‌లో ఫేస్‌బుక్ పరిచయం ఓ యువతి ప్రాణాలు తీసింది. పరిచయం లేని వ్యక్తులతో ఫేస్‌బుక్ కొత్త స్నేహమే ఓ అభం శుభం తెలియని బాలిక ప్రాణాలను బలిగొంది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన యువకుడు అమ్మాయి పాలిట యముడిగా మారి ప్రాణాలు తీశాడు. ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన 17 సంవత్సరాల అమ్మాయికి మాయమాటలు చెప్పి ప్రేమించానంటూ, కోరిక తీర్చుకుని ఆపై ముఖం చాటేసిన హైదరాబాద్ యువకుడు...

09/01/2019 - 22:54

‘‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!’’

08/30/2019 - 20:00

టీవీ, న్యూస్‌పేపర్, వాట్స్‌అప్, ఫేస్‌బుక్ ఇలా ఇపుడున్న ఏ ఆధునిక సౌకర్యాన్నైనా చూడండి. ఎక్కడో ఒకచోట ప్రతిరోజు ఆత్మహత్యల పర్వం ఉంటుంది. ఆర్థిక కష్టాలో, ప్రేమ వైఫల్యాలో, నిరాశలో, భగ్న ప్రేమికులో, పరీక్షల్లో తప్పడమో ఇలా ఏదైనా ఆత్మహత్యకు కారణం అవుతోంది.

08/29/2019 - 18:48

మనిషికి ఎప్పుడూ ఏవో ఆలోచనలు వస్తూనే వుంటాయి. ఏదో ఒక అంశం గురించి మనం ఆలోచిస్తూనే ఉంటాం. అయితే ఎప్పుడూ ఒకే అంశంపై దృష్టిని కేంద్రీకరించి ఆ ఆలోచనలతోనే.. ఆ కోరికలతోనో.. ఆ వ్యాపకాలతోనే కాలం గడపటం అంత మంచిది పద్ధతి కాదు. ఈ లక్షణాలు కలిగినవారు చాలామంది ఉంటారు.

08/28/2019 - 18:51

ఆత్మహత్య అనే కంటే ఇచ్ఛా మరణం అనటమే సరైనది. అది బలవన్మరణం కాదు. ఐపిసి 309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నం చేసి బ్రతికినవారిపై కేసులు పెడతారు. ఆత్మహత్యాయత్నం నేరం కాదు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. ‘తీవ్రమైన నిరాశ నిస్పృహలతోనే ఆత్మహత్య చేసుకోవాలని ఎవరైనా భావిస్తారు. వారికి కావలసింది సహాయం కానీ శిక్ష కాదు’ అని స్పష్టం చేసింది.

08/27/2019 - 18:59

‘‘అందమె ఆనందం
ఆనందమె జీవిత మకరందం’’
-అన్న అలనాటి సినీకవి సముద్రాల మాటలు అక్షరాల నిజం చేస్తోందీ మానవ ప్రపంచం. ఆ మకరందం గుబాళింపు గొప్ప గొప్ప ఋషుల్లో కూడా నాడు గుబులు పుట్టించింది. ఇనుప కచ్చడం బిగించి కఠోర తపస్సుచేస్తున్న విశ్వామిత్రుడు మేనక అందానికి ఐసయిపోయి ఆధ్యాత్మిక వికాసానికి ఆనకట్ట వేసుకున్నాడు.

Pages