S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

06/04/2019 - 20:01

ప్రకృతి సహజ వనరులను అభివృద్ధి, నాగరిక జీవనం కోసం శృతిమించి కొల్లగొట్టడం నేటి ప్రభుత్వాలు- సమాజం ప్రగతి, పురోగతి సాధించే కర్తవ్యంగా భావిస్తున్నాయ. నేల, గాలి, నీరు ప్రధానంగా జీవనావసరాలు విపరీత కాలుష్యంతో, మనిషి మనుగడను మృత్యుముఖం వైపు నడిపిస్తున్నాయి. అధిక ఆహారోత్పత్తి కోసం రసాయనక వ్యవసాయం, వాయు, జల కాలుష్యలతో బతుకు ప్రశ్నార్థకమవుతోంది.

05/27/2019 - 18:27

(నేడు వీరేశలింగం శత వర్థంతి)

05/26/2019 - 19:30

పిల్లల్లో చంచల స్వభావం ఎక్కువ. ఒకరోజు సంగీతంపై ఉత్సాహం చూపిస్తే.. మరోరోజు కరాటేపై ఉత్సాహం చూపిస్తారు. అంతలోనే ఏమవుతుందో తెలియదు.. దాన్ని మధ్యలో వదిలేసి డ్యాన్స్ వెంట పడతారు. అది కూడా కొద్దిరోజుల ముచ్చటే.. ఇది చిన్నపిల్లల్లో తరచూ జరిగేదే.. వీటిని పట్టించుకోకుండా తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహిస్తుంటారు. అయితే పిల్లలు పెరుగుతున్నకొద్దీ అదే ధోరణి కొనసాగిస్తుంటే?

05/24/2019 - 19:26

అటో కుట్టు.., ఇటో కుట్టు.., సింపుల్‌గా కట్టు.. అంటోంది కఫ్తాన్. ఇది స్టైల్‌కి, నిండుతనానికి నిలువెత్తు నిదర్శనం(అందం). అందుకే కఫ్తాన్ స్టైల్‌ను టీనేజర్లు ఎక్కువగా ఇష్టపడతారు. కొనే్నళ్ల క్రితం టర్కీలో మొదలైన ఈ ఫ్యాషన్ ట్రెండ్ ఇప్పుడు మన దగ్గర కొత్త కొత్త రకాలుగా రూపొందుతోంది. వేసుకునే డ్రెస్ స్టైలిష్‌గా ఉండటంతో పాటు సౌకర్యంగానూ, ట్రెండ్‌గానూ, అందంగానూ ఉండాలి. ఇవన్నీ కఫ్తాన్ సొంతం.

05/22/2019 - 19:37

ఫ్యూడల్ వ్యవస్థ, పెట్టుబడిదారీ వ్యవస్థ రెండూ అబార్షన్ల రద్దును కోరుకుంటూనే ఉన్నాయి. ఫ్యూడల్ వ్యవస్థలోని
పురుషులు తమ పాపాల్ని కడిగేసుకునేదానికి అబార్షన్లని ఉపయోగించుకుంటుంటే.. పెట్టుబడిదారీ వ్యవస్థ పుట్టే
పిల్లలకి బాధ్యత వహించడం తప్పుతుందని భావిస్తోంది.

05/21/2019 - 18:53

జీవనశైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం ద్వారా మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. తన సహజ అలవాట్ల ద్వారా సమస్త జీవానికి ఆవాసమైన భూమిని కూడా ఆరోగ్యంగా ఉంచవచ్చు అంటున్నారు పరిశోధకులు.

05/20/2019 - 19:02

లక్ష్యానికి దగ్గరి దారులుండవు.. పట్టుదలతో కష్టపడటం తప్ప.. అలా దుర్భర దారిద్య్రాన్ని లెక్కచేయకుండా పట్టుదలతో తను అనుకున్నది సాధించి చూపించింది ఇల్మా అఫ్రోజ్. వివరాల్లోకి వెళితే..

05/19/2019 - 22:52

తాను రూపొందిస్తున్న కళాఖండమే తన ప్రాణాలను హరిస్తోందని తెలుసుకోలేకపోయింది కెనడా శిల్పి గిలియన్ గెన్సర్. జీవ ఆవిర్భావంపై రూపొందిస్తున్న కళాఖండమే ఇందుకు కారణమైంది. దేవుడు సృష్టించిన తొలి మనిషిగా భావించే ‘ఆడమ్’ శిల్పాన్ని ఆల్చిప్పలతో రూపొందించేందుకు గిలియన్ పదిహేనుళ్లుగా కృషి చేస్తోంది. ఈ పదిహేనేళ్లలో ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవుతూనే ఉంది. కానీ సమస్య ఏమిటో తెలియక ఆమె తికమకపడిపోయింది.

05/19/2019 - 22:34

‘పక్కింటి విశ్వని చూడు.. ఉదయం ఐదున్నరకే లేసి బాస్కెట్ బాల్‌కి వెళ్లిపోతాడు. నువ్వు ఉదయం తొమ్మిదైనా నిద్రలేవవు. సెలవులు నీకేనా, ఎవరికీ లేవా?’ అంటూ పనె్నండేళ్ల ఆయుష్‌కి తండ్రి మేలుకొలుపు. ‘సోనాకు 9.8 మార్కులు వచ్చాయి. నీకూ వచ్చాయి 8.3.. అవీ ఓ మార్కులేనా.. ఎప్పుడు నేర్చుకుంటావు?’ అని వైష్ణవికి తల్లి మందలింపు..

05/16/2019 - 22:51

కోల్డ్ షోల్డర్స్, హాఫ్ షోల్డర్స్.. ఇప్పుడు టీనేజర్లు ఇష్టపడే డిజైన్లు.. ముఖ్యంగా హాఫ్ షోల్డర్స్‌ను ఇష్టపడని యువతరం లేదు. అందుకే టీషర్టులు, శారీ బ్లవుజుల వరకూ ఈ ట్రెండ్ విస్తరించింది. ఎంతలా అంటే చివరికి పెళ్లి కూతుర్లు కూడా ఈ బ్లవుజులనే ఎక్కువగా ఇష్టపడుతున్నారంటే హాఫ్ షోల్డర్స్ క్రేజ్ ఏమిటో తెలుస్తోంది.

Pages