S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

01/18/2019 - 18:36

కడుపులో పెరుగుతున్న బిడ్డ భవిష్యత్తు గురించి అమృతం లాంటి ప్రేమను పంచే అమ్మ ఎనె్నన్నో కలలు కంటుంది. పుట్టగానే బిడ్డకు భాష నేర్పడానికి తానూ మూగదై బిడ్డకు అర్థమయ్యే ఊసులతోనే భాష నేర్పడానికి ప్రయత్నిస్తుంది అమ్మ. మాట్లాడటం పూర్తీగా రాని చంటి పిల్లాడు మాట్లాడే కొత్త కొత్త మాటలకు అర్థాలు చెప్పే నిఘంటువు అమ్మ.

01/17/2019 - 18:39

‘నేటి బాలలే రేపటి పౌరులు.. బాలలే భారత భాగ్య విధాతలు..’ -ఇలాంటి నినాదాలు వింటున్నప్పుడు మధురాతిమధురమైన అనుభూతి ఏదో మనల్ని మైమరిపిస్తుంది. మనం మన పిల్లలను నిజంగా ప్రేమిస్తున్నామా? ఈ విషయమై మనల్ని మనం ప్రశ్నించుకోగలమా? మన దేశంలో బాల్యం అనేక దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. కొన్ని దృశ్యాలు మనసును పరవశింపచేస్తాయి. మరికొన్ని దృశ్యాలు గుండెను బరువెక్కిస్తాయి. బాల్యం ఎవరికైనా మధుర జ్ఞాపకమే.

01/16/2019 - 18:07

మనిషి దశలలో చాలా ప్రముఖమైనది యుక్తవయస్సు. యుక్తవయసులో కలిగే అనుభవాలు మనిషి జీవితాంతం వెన్నంటే ఉంటాయి. ఉన్నత స్థితికి ఎదగాలంటే యుక్తవయసులో తీసుకునే నిర్ణయాలు ప్రధానమైనవి. మధుర స్మృతులు కావచ్చు లేదా మచ్చగా మిగిలే గాయాలుకావచ్చు. బంగారం లాంటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యువత ఒక్కొక్క అడుగువేయాలి. యుక్తవయసులోనే శారీరక, మానసిక పరిపక్వత అభివృద్ధి చెందుతాయి.

01/14/2019 - 22:18

తెలుగువారు సంస్కృతీ ప్రియులు. సంప్రదాయబద్ధులు. ఆచార వ్యవహార పరాయణులు. తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలలో పండుగలు ఒక భాగం. తెలుగువారికి ముక్కోటి దేవతలు ఉన్నట్లే, అందుకు తగినట్లుగానే పండుగలు కూడా ఉన్నాయి. చైత్ర వైశాఖాది ద్వాదశ మాస పర్యంతం, పాడ్యమి మొదలగు ముప్పది తిథులకు సంవత్సరం మొత్తంమీద ఏదో ఒక పండుగ ఉంటూనే ఉంటుంది.

01/14/2019 - 22:10

తెలుగుప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి మూడు రోజుల పండుగ. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగిమంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా సంక్రాంతి వచ్చిందంటే ఆ సందడే వేరు.

01/11/2019 - 18:53

యుగద్రష్ట వివేకానందుని155వ జయంతి సందర్భంగా

01/10/2019 - 19:29

కుంకుమ వనె్న అంచుపై జరీపూలతో లేత తెలుపు పట్టు పరికిణి, జాకెట్టుపై బంగారు జరీ బుటాలు, కుంకుమ రంగు జార్జెట్ ఓణీ, జడగంటలతో జడ ముందుకేసుకుని, చెవులకు అందంగా ఊగే కెంపుల జూకాలు ధరించి అమ్మాయి ఇంటిముందు సంక్రాంతి ముగ్గు పెడుతుంటే.. ఆ ఇంటి పండుగ కళ గురించి వేరే చెప్పాలా.. వర్ణరంజితమైన పూ బంతులు, ముంగిట రంగవల్లికలు, గొబ్బెమ్మలు, భోగిమంటలు..

01/09/2019 - 18:56

ఇస్లాం మతాన్ని, స్వదేశాన్ని, అయినవాళ్లను విడిచి దూరంగా వెళుతూ.. బ్యాంకాక్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన 18 ఏళ్ల సౌదీ యువతి రహాఫ్ మొహమ్మద్ అల్ కునన్ ఎట్టకేలకు ఐక్యరాజ్యసమితి శరణార్థి సంస్థ ఆశ్రయాన్ని పొందింది. వివరాల్లోకి వెళితే..

01/08/2019 - 19:14

దైనందిన జీవితంలో శారీరక బలాన్ని ఉపయోగించాల్సి రావడం, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి రావడం సర్వసాధారణం. యోగా శారీరక బలాన్ని పెంచడానికి, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుంది. ఆత్మస్థైర్యానికి శరీరాకృతి, అంతర్గత శక్తి చేసే సహాయం అంతా ఇంతా కాదు. ఈ రెండు విషయాలు దైనందిక జీవనంలో ప్రతి అంశంపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి. శారీరక బలం లేని వ్యక్తి అనేక ఆరోగ్య, మానసిక సమస్యలను ఎదుర్కోక తప్పదు.

01/06/2019 - 22:40

తరగతి గది ఒక ప్రసూతి గది, జ్ఞానానికి జన్మనిచ్చేందుకు..
తరగతి గది ఒక స్మశానవాటిక, అజ్ఞానాన్ని ఖననం చేసేందుకు..
తరగతి గది ఒక కర్మాగారం, జాతి భవితను నిర్మించేందుకు..
తరగతి గది ఒక న్యాయ స్థానం, సరైన నిర్ణయాలు తీసుకునేందుకు..
- సర్వేపల్లి రాధాకృష్ణ
*
నిరంతరం నేర్చుకునే ఉపాధ్యాయుడే..
మంచి విద్యావంతుల్ని తయారు చేయగలడు..
- రవీంద్రనాథ్ ఠాగూర్

Pages