S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/14/2018 - 22:28

భారత్‌లో స్మార్ట్ఫోన్ల ద్వారా ఫేస్‌బుక్ వంటి సోష ల్ మీడియాలో మహిళలు ఎక్కువ సేపు కాలక్షేపం చేస్తున్నారు. స్మార్ట్ఫోన్ వినియోగంలో స్ర్తిలు, పురుషులకు సంబంధించి పలు వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం కోసం స్మార్ట్ఫోన్లను మహిళలు అధికంగా వినియోగిస్తుండగా, ఇ-కామర్స్ సైట్లపై పురుషులు దృష్టి సారిస్తున్నారు. మన దేశంలో స్మార్ట్ఫోన్ల వినియోగదారుల్లో 20 శాతం మేరకు మహిళలు ఉన్నారు.

03/13/2018 - 21:59

హాస్టల్ భవనం మీంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని- అధికారి వేధింపులు తాళలేక ఉద్యోగి బలవన్మరణం- రైలు పట్టాలమీద గుర్తు తెలియని శవం- ఇలా నేడు ఏ వార్తాపత్రిక తిరగేసినా, ఏ న్యూస్ చానల్ పెట్టినా ఇటువంటి వార్తలే కోకొల్లలుగా కానవస్తున్నాయి. ఒకప్పుడు ఒకటో అరో ఇటువంటి సంఘటనలు జరిగేవి. వాటిని చూసినా, చదివినా జనం ఎంతో ఉద్వేగానికి గురయ్యేవారు.

03/12/2018 - 23:14

ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల పరిమిత పాత్ర, తక్కువ వేతనాల కారణంగా ప్రపంచ లింగ వ్యత్యాస సూచీలో భారత్ 108వ స్థానంలో నిలిచింది. మొత్తంమీద 108వ ర్యాంక్ సాధించిన భారత్ ఆర్థిక కార్యకలాపాలు, అవకాశాలు, ఆరోగ్యం విషయంలో మహిళల పాత్రకి సంబంధించి వరసగా 139, 141వ స్థానంలో నిలిచింది. ఇక పనిచేసే చోట లింగ వ్యత్యాసం, మహిళలకు వేతన చెల్లింపులో 136వ స్థానంలో ఉంది.

03/11/2018 - 20:56

సకార, రకార, తకారముల మేలు కలయిక స్ర్తి. సత్వ రజస్ తమోగుణములచే నేర్పుగా చేయబడిన చర ఆకృతి స్ర్తి. ఆమెలో సాధుస్వభావం, రజోగుణమైన దర్పము, గాంభీర్యము, తకారమైన తపస్సు, గుణ సంపదలుగా కూర్చబడిన త్రిశక్తి స్వరూపిణి స్ర్తి. స్వర్గంలో బ్రహ్మదేవుడు స్ర్తిని తయారు చేస్తే భూమిపై ఉత్తమ పౌరులను ఓ మహిళ ఎలా తయారుచేసి సమాజానికి అందిస్తోందో ఈనాడు పురుషప్రపంచం తెలుసుకోవాలి.

03/09/2018 - 21:11

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బయ్ ఏళ్లవుతుంది. గృహిణిగా, శ్రమజీవిగా, ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతంగా పనిచేస్తున్నా ఆమెకు తగిన గుర్తింపు రావడంలేదు. ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం దక్కడంలేదు. ప్రజాప్రతినిధులుగా స్థానం సంపాదించినా భర్తల చేతిలో కీలుబొమ్మలుగానే వున్నారు. మహిళల సమానత్వం ప్రచార ఆర్భాటాలకే తప్ప ఆచరణలో కానరావడంలేదు.

03/08/2018 - 21:00

మహిళలు, అందునా సాంప్రదాయ కుటుంబీకులు ఎవరూ ఆలోచన కూడా చేసే సాహసం చేయని రోజులలో సాహసించి ప్రతి రంగంలోనూ దూకి తనదైన ప్రత్యేక ముద్ర వేసిన సాహసి మన టంగుటూరి సూర్యకుమారి. సంపన్న కుటుంబాల స్ర్తిలు కూడా అడుగుపెట్టడానికి జంకే రంగాలలో ప్రవేశించి, పరిశోధించి ఆ ఆ రంగాలో జన హితానికి మన దేశంలోనే కాక ప్రపంచంలోని ఇతర దేశాలలలో కూడా విశేష కృషి చేశారు.

03/07/2018 - 23:16

21వ శతాబ్దంలోని ప్రస్తుత అధునాతన సాంకేతిక సమాజంలోని భారతీయ మహిళా భాగస్వామ్యం, సమానత సాధించే పోరాటాలలో శాంతియుత మానవీయ సంస్కరణల విలువలు ప్రసాదించే జీవన లక్ష్యాలను నిర్దేశించుకొంటోంది. సమానత్వ హక్కుల కోసం ఒకే అస్తిత్వ ఆధిక్య వాదానికి, శక్తి యుక్తుల ఐక్యతకు కట్టుబడే స్ర్తివాద పోరాటం, ప్రస్తుతం మహిళలు సాధిస్తున్న విద్యా ప్రగతిశీల ప్రగాఢ భావోత్తేజం కారణంగా కొత్త పుంతలు అనుసరిస్తోంది.

03/06/2018 - 21:09

ఇంకోచోట అత్తగా ఉన్న మహిళ కోడలు ఉద్యోగిగా కష్టపడుతున్నా ఇంట్లో పనులు చక్కబెడుతున్నా సంతృప్తి చెందలేకపోతోంది. కనీసం చేయూత నివ్వకపోగా కొడుకు అనే పురుషునికి అండగా నిలిచి కోడలనే స్ర్తిని ఇబ్బంది పాలు చేయడంలో ముందేఉంటోంది. ఇది ఎంత వరకు సమంజసం? కొడుకు చేసే తప్పులను కూడా కోడలిమీదే ఎక్కుపెడుతోంది. మావాడు అమాయకుడన్న బిరుదులిస్తూ వారికి అండగా నిలవడం ఏంబాగుంది?

03/05/2018 - 22:28

ఎవరిలోనైనా ఆలోచనలు ఉండడం సహజం. కాకపోతే ఆ ఆలోచనలకు రూపం ఇస్తే అందరూ శభాష్ అంటారు. మంచి ఆలోచనలకే సుమా. సాధికారత సాధించామనే మహిళలూ రోజుకు 24 గంటలున్నా 42 పనులు ఇంటా బయటా చేస్తున్నారు. ఇంకా ఏమి ఆలోచనలో ఏమో.. అనేవాళ్లూ ఉన్నారు. కాని అవసరమే అవకాశాన్ని కలిగిస్తుంది. ఆ అవకాశమే అన్నింటా గెలిచే శక్తి నిస్తుంది.

03/02/2018 - 22:33

మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ అన్నమాట మనం నిత్యం స్మరించే మహోన్నత వేదమంత్రం. ‘అమ్మ’ అన్న రెండక్షరాల మాట గురించి చెప్పాలంటే మనకు సాధ్యంకాదు. నవమాసాలు మోసి మనకు జన్మనిచ్చి తను పునర్జన్మ ఎత్తుతుంది. ఉగ్గుపాలతో పెంచి పోషించి.. ఉన్నతమైన సన్మార్గంలో మనల్ని నడిపించేది అమ్మ మాత్రమే. మంచైనా.. చెడైనా నేర్పేది అమ్మ. ఈ సృష్టిలో ప్రతి మనిషికి తొలి గురువు అమ్మ. కంటికి రెప్పలా కాపాడుతూ.

Pages