S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

12/15/2017 - 20:36

ప్రతి గొప్ప రచయితకూ ఒక గొప్ప అనుచరుడుంటాడు - నన్నయ్యకు నారాయణభట్టులా,
జాన్సన్‌కు బాస్వెల్‌లా, శ్రీశ్రీకి కె.వి.రమణారెడ్డిలా, కాళోజీకి రామశాస్ర్తీలా -
అలాగే విశ్వనాథకు జువ్వాడి గౌతమరావు.

12/14/2017 - 20:35

కాంచనపల్లి నడిచే కాంచనగంగ. ఆయన నల్గొండ సాహిత్య శిఖరం. నల్గొండ సాహితీ మూర్తిమత్వానికి ఒక నిలువెత్తు
తెలుగుటద్దం. ఏ విషయాన్ని గురించైనా ధారాళంగా, నిష్పక్షపాతంగా ప్రసంగించే ఓర్పు, నేర్పు కలిగిన వ్యక్తి. దాశరథి, సినారె, వట్టికోట, కాళోజీ, దేవులపల్లి వంటి స్నేహితుల్ని కలిగిన సౌజన్యమూర్తి. జిల్లాలోనే గాక రాష్ట్ర రాజకీయ ఉద్యమాలలో, సాహిత్యరంగంలో ప్రముఖ పాత్ర వహించిన

12/14/2017 - 20:21

పంచీకరణలో భాగంగా వచ్చిన మార్కెట్ సంస్కృతి ప్రభావం వల్లనో, మరే కారణాల వల్లనో మనిషి రానురాను సమష్టి జీవితం నుంచి దూరమవుతున్నాడు. సంఘంలో ఉంటూనే అతి జాగ్రత్తగా ఒంటరి జీవిగా బతకటానికి ఇష్టపడుతున్నాడు. అస్తిత్వోద్యమాల్లాంటివి సామూహిక చైతన్యాన్ని కలిగించినా - వాటికి గల ఉద్యమావసరాల దృష్ట్యా అవి మొత్తంగా మనిషిని సామాజికీకరణం చేయలేకపోయాయి.

12/14/2017 - 20:04

‘‘ఆరూఢ్య గద్య పద్యాది ప్రబంధ
పూరిత సంస్కృత భూయిష్ఠ రచన
మానుగా సర్వ సామాన్యంబుగామి
జానుతెనుంగు విశేషము ప్రసన్నతకు’’
- అని సోమనాథుడు పండితారాధ్య చరిత్రలో చెప్పాడు. ‘నేను రచిస్తున్నది తెలుగు పుస్తకమని తిరస్కరిస్తారో ఏమో, సాక్షాత్తు వేదోపనిషత్తుల సారమంతా తెలుగులోకి తెస్తున్నాను. ఆదరించండి’ అని ఆంధ్ర పాఠక మహాశయులను సవినయంగా ప్రార్థించాడు మహాకవి.

12/13/2017 - 19:55

ఈ మధ్యనే ప్రచురితమైన ముస్లిం మహిళలు బురఖాలు ధరించడంపై వచ్చిన వ్యాసం చదివిన తరువాత కలిగిన ఆవేదనతో ప్రతిస్పందించడం జరిగింది. అదేదో బలవంతంగా స్ర్తిలను బురఖాలను ధరింపజేస్తున్నట్లు వ్యాఖ్యానించడం శోచనీయం. ఎంతోమంది అమ్మాయిలు స్వచ్ఛందంగానూ..యిష్టపూర్వకంగానూ బురఖాలు ధరించి కాలేజీలకు, ఆఫీసులకు వెళ్తుండటం చూస్తున్నాం. ఒకవేళ ఇంట్లో తల్లో, తండ్రో బలవంతంగానైనా బురఖాను ధరింపజేస్తే అందులో తప్పేమిటి?

12/12/2017 - 18:09

‘‘కవిత్వం జీవితమంత విస్తృతం. జీవితం కవిత్వమంత సుందరం’’ అంటారు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ. అందరూ ఎస్వీ అని ఆత్మీయంగా పిలుచుకునే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘‘జీవితం ఊహ కాదు వాస్తవం. సాహిత్యం సమాజ చలనాలకు దర్పణం’’ అనే ఆయన జీవితంలో ఎన్నో శిఖరాలు ఎక్కినా, ఎంతో సాధించినా తొణకని నిండు కుండలా ఉంటారు. సభలలో జనరంజకంగా, చమత్కారంగా మాట్లాడుతూ నవ్విస్తుంటారు.

12/10/2017 - 03:33

పచ్చని పొలాలుగా బాల్కనీలు ఇంటికి సరిపడా కూరగాయలు దిగుబడి
పట్టణ వ్యవసాయం పట్ల యువత ఆసక్తి

12/08/2017 - 19:00

పిల్లలు బయటకు వెళితే వాళ్లు వచ్చే వరకూ నాకు భయంగా ఉంటుంది. తరచూ ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అడుగుతుంటాను అని అంటుంది ఒకనాటి బాలీవుడ్ అగ్రనటి శ్రీదేవి. మీడియాకు దూరంగా ఉండే శ్రీదేవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పిల్లలు, కుటుంబ విషయాలను, అభిరుచులను మీడియాతో ముచ్చటించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
పిల్లలకు తమిళం మాట్లాడటం రాదు. నా మాతృభాష తెలుగు. నేను ఎక్కువ సమయం చెన్నై, ముంబయిలో గడిపాను.

12/07/2017 - 19:01

ఇష్టమున్నా..లేకున్నా చలి కాలంలో ప్లాయిడ్స్‌ను అమితంగా ఇష్టపడతారు. ఎందుకంటే ఇవి చలిని తట్టుకునేలా వూల్‌తో స్టయిల్‌గా తయారుచేస్తారు. యువతులు అమితంగా ఇష్టపడే ఈ ప్లాయిడ్స్ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. స్కాట్లాండ్‌లో పుట్టిన టార్టాన్ వస్త్రంతో ఈ ప్లాయిడ్స్ రూపుదిద్దుకుంటాయి. నిలువు, అడ్డం గీతలతో చెక్స్ తరహాలో ఉండే టార్టాన్ వస్త్రం స్కాట్లాండ్‌లో ప్రసిద్ధి.

12/06/2017 - 19:49

ఆ ఇంటిలో అడుగుపెడితే ఆ ఇంటి గోడలు సరిగమలు వినిపిస్తాయి. ఆ ఇంటిలో ఉండే ప్రతి వస్తువు రాగాలాపన చేస్తోంది. అదే పండిట్ శంకర్‌జీ కుటుంబం. ఆ కుటుంబ పాటల పూదోట నుంచి మరో కుసుమం వికసించింది. ఆ కుసుమమే స్నేహా శంకర్. ఔత్సాహిక గాయకురాలిగా తనను తాను నిరూపించుకుంటున్న పదకొండేళ్ల స్నేహా శంకర్ సంగీత వినీలాకాశంలో మెరుస్తున్న మరో నక్షత్రం. పిల్లలు బొమ్మలతో ఆడుకుంటారు.

Pages