S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

09/17/2016 - 22:12

పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు. వరకట్నం అనే జాఢ్యం ఈ కమ్మటి మాటను కాలరాస్తోంది. అం దుకే ఆధునిక యువతి పెళ్లికి గుడ్‌బై చెప్పేస్తోం ది. ఒంటరి జీవితమే బెటర్ అనే నిర్ణయానికి వస్తోంది. కట్నం ఇస్తేనే తాళి కడతానని వరుడు భీష్మించుకుని కూర్చోవటాన్ని నేటి యువతులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిని అవమానకరంగా భావిస్తున్నారు.

09/16/2016 - 22:56

ఇల్లు ఆహ్లాదకరంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలు ముందుగా మానసిక ఆరోగ్యవంతురాలుగా ఉండాలి కదా! అప్పుడే ఆ కుటుంబంలోని సభ్యులంతా ఉత్తములుగా ఎదుగుతారు. ‘సంస్కారం’ అనే బండి సజావుగా ముందుకువెళ్ళాలంటే తల్లీదండ్రులు బుద్ధిమంతులై ఉండాలి.

09/16/2016 - 00:37

కౌసల్యా సుప్రజారామా! పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం- అంటూ ఆ కలియుగ దైవాన్ని మేల్కొలిపే ఆ గాన మాధుర్యం నేటికీ ప్రతి ఇంటిలోనూ మారుమోగుతూనే వుంటుంది. ప్రాతఃకాలంలో మధుర మంజులంగా వినబడే స్వరం ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్.సుబ్బులక్ష్మిది. కర్నాటక శాస్ర్తియ సంగీతం పేరు చెబితే తొలుత వినబడే పేరు ఎం.ఎస్.సుబ్బులక్ష్మి.

09/15/2016 - 04:40

కృష్ణకుమారి ఇష్టంగా వండే వంటల వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయని కుమార్తె దీపిక చెబుతోంది. అలాగే అందాల నటి పట్ల సహనటీ, నటులుకున్న అభిప్రాయాలు కూడా ఇందులో ఉన్నాయి.

09/13/2016 - 20:57

ఇంచుమించు తొంభై సంవత్సరాలుగా భారతీయ మహిళ మేనుకు మెత్తగా హత్తుకునే నల్లిసిల్క్స్ వస్త్ర సామ్రాజ్యానికి ఐదవతరం ప్రతినిధిగా లావణ్య నల్లి అడుగుపెట్టారు. అనతికాలంలోనే సిల్క్ వస్త్రాలకు పర్యాయపదంగా నల్లి సిల్క్స్‌ను తీర్చిదిద్దారు. గత కొనే్నళ్లుగా ఆ కుటుంబంలోని మగవారే ఈ వస్త్ర సామ్రాజ్యాన్ని తరతరాలుగా ఏలుతున్నారు. నేడు ముప్పయి రెండేళ్ల అమ్మాయి ఆ సామ్రాజ్యాన్ని ఏలుతూ తన వ్యాపార దక్షతను చాటిచెబుతోంది.

09/13/2016 - 20:51

కట్టిపడేసే డిజైన్లలో వస్త్రాల అమ్మకాలు జరపటం లావణ్య ప్రత్యేకమని అంటారు. వస్త్రాలు కొనేది ఆడవారే అయినప్పటికీ ఈ రంగంలో డిజైనింగ్, అమ్మకాల రంగం మాత్రం పూర్తిగా పురుషాధిక్యతతో నిండివుంది. ఇలాంటి సమయంలో ఆధునిక తరానికి ప్రతినిధిగా లావణ్య రావటం జరిగింది. సంప్రదాయ వస్త్రాలతో పాటు పాశ్చాత్య డిజైన్‌లలో వస్త్రాలను అధికంగా అందుబాటులోకి తెచ్చారు.

09/10/2016 - 22:03

మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు ఏర్పడటానికి పెంపొందటానికి ఒకరినొకరు పిల్చుకునే పిలుపులు కూడా ఎక్కువగా కారణమవుతాయి. ఒకరితో మరొకరికి ఉండే బాంధవ్యాన్ని తెలియజేస్తాయి. అనురాగాన్ని అభివృద్ధి చేస్తాయి.

09/09/2016 - 21:04

నేటి బాలలే రేపటి పౌరులు. అయితే, అటువంటి బాలలను మనం ఏ విధంగా తీర్చిదిద్దుతున్నామన్నదే నేటి మన సమస్య. సమస్త జీవరాశిలో అనుకరణ అనేది మనుషులకే బాగా వచ్చు. పుట్టిన దగ్గరనుంచి మరణించేవరకు అనుకరించేది మానవజాతే. అనుకరణ అనేది మానవ జీవితంలో ఒక భాగం అయింది. పిల్లలు మొదట తమ తల్లిదండ్రులను, అనంతరం నట్టింట్లో భూతం (బుల్లితెర)లో ప్రసారం అయ్యే కార్యక్రమాలలో సంగీతకారులను, నటులను అనుసరిస్తున్నారు.

,
09/08/2016 - 22:10

పద్దెనిమిదేళ్ల అమ్మాయి.. పేదరికమైనప్పటికీ పరదాల చాటున జీవితాన్ని మగ్గిపోనివ్వకుండా చదువుకుంటుంది. జీవిత లక్ష్యంతో ముందుకు సాగుతున్న వేళ..అనుకోనివిధంగా ఆమ్లదాడికి గురైంది. ముఖం మొత్తం కాలిపోయింది. ఓ కన్ను పోయింది. అయినప్పటికీ ఏటికీ ఎదురీదుతూ ఆత్మసౌందర్యమే మాలాంటివారికి నిజమైన అందం అంటూ ఆత్మస్థయిర్యంతో అడుగుముందుకు వేస్తోంది. ఆమే రేష్మా.

09/07/2016 - 21:20

ఆ కుటుంబంలో పుట్టిన పిల్లలంతా అద్భుత చిన్నారులే. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనటానికి నిదర్శనంగా నిలుస్తారు. బహదూర్ వర్మకు పుట్టిన ముగ్గురు పిల్లలు కూడా వయసుకు మించి మేథస్సును సొంతం చేసుకుని కన్నవారి పేరును నిలబెడుతున్నారు. పోనీ తల్లిదండ్రులేమైనా గొప్ప విద్యావంతులా అని అనుకుంటే కనీసం పదవతరగతి పాసైనవారు కూడా కాదు.

Pages