S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

07/19/2019 - 12:28

గులాబీ రంగు చీరలు కట్టుకుని..
స్కూలు బ్యాగు పట్టుకుని..
బడి గంట కొట్టగానే..

07/17/2019 - 18:39

మడకశిరలో ఒక వింత ఆచారం మహిళా వివక్షకి ప్రతిరూపమే అని చెప్పొచ్చు. బాలింతలు, బహిష్టు మహిళలకు గ్రామ బహిష్కరణ విధిస్తారు. మడకశిర నియోజకవర్గంలోనే కాకుండా సమీప కర్ణాటక ప్రాంతాలైన చిత్రదుర్గం, తుమకూరు, కోలార్ జిల్లాల్లోనూ ఈ మూఢాచారం పాతుకుపోయింది. కల్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి.

07/16/2019 - 18:34

సృష్టిలో మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి కుటుంబమనేది సహజ సిద్ధమైనదే కదా! ప్రతి కుటుంబంలో తల్లి, తండ్రి, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు అనే బంధంతో సహజీవనం చేస్తుంటారు. బీదవారైనా, శ్రీమంతులైనా, ఆగర్భశ్రీమంతులైనా తమ కుటుంబంలో జన్మించిన ఆడకూతురిని పరాయి కుటుంబంలోని పిల్లవాని కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం తమ భాగ్యం భావిస్తారుకదా! ఇది మానవ జీవనంలో సామాజిక, సాంస్కృతిక, సంస్కారములో భాగమే కదా!

07/15/2019 - 19:24

పుట్టిన ప్రతి ప్రాణికి మొదటి గురువు అమ్మ. మనుషుల్లోనయితే కొంచెం ప్రాయం వచ్చాక బుడిబుడి అడుగులతో, నాన్న చిటికెనవేలు పట్టుకుని నడుస్తూ, బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాడు. ఐదేళ్ళు దాటగానే, అక్షరాభ్యాసం కోసం గురువు దగ్గరకువెళ్లి అ ఆ, ఇ, ఈలతో మొదలుపెట్టి ప్రపంచానే్న తెలుసుకోగలిగినంత జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు.

07/11/2019 - 23:02

ముద్దులొలికే చిన్నారి.. అప్పటివరకూ ఆనందంగా ఆడుకుంది.. ఆ తర్వాత అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిద్రించింది. కామంతో కళ్ళు మూసుకుపోయిన రాక్షసుడు ఆ పసికూనపై కనే్నశాడు. తల్లి పొత్తిళ్లనుంచి వేరుచేసి చిదిమేశాడు. ఆ తల్లికి శాశ్వతంగా కడుపుకోత మిగిల్చాడు. సభ్య సమాజం తలదించుకునేలా హన్మకొండలో జరిగిన ఘటనతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ఇంత దారుణం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. అత్యాచారాలకు అంతం లేదా?

07/10/2019 - 18:33

మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి..
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి..
వెనకవచ్చు వాళ్లకు బాట అయినదీ.. అని ఓ సినీ కవి చెప్పినట్లుగా..

07/09/2019 - 19:24

కేష్నీ ఆనంద్ 1983 బ్యాచ్ ఐఏఎస్. హరియాణా రాష్ట్రంలో తొలి మహిళా డిప్యూటీ కమీషనర్‌గా ఆమె రికార్డుల్లోకి ఎక్కింది. హరియాణా స్వతంత్ర రాష్ట్రంగా అవతరించిన తర్వాత 25 సంవత్సరాలకు ఒక మహిళ డిప్యూటీ కమీషనర్ అయ్యింది. తాజాగా ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా బాధ్యతలు చేపట్టింది. మరో విశేషం ఏంటంటే.. కేష్నీ కుటుంబంలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లు చీఫ్ సెక్రటరీలు అయ్యారు.

07/08/2019 - 18:18

ఇస్లాం ధర్మం స్ర్తిజాతికి సముచిత స్థానాన్ని కల్పించింది. మానవ సమానత్వం విషయంలో పురుషులతోపాటు స్ర్తిలకు కూడా ఇస్లాం సమాన హోదాను ప్రసాదించింది. పురుషులకు మహిళలపై ఎలాంటి హక్కులు ఉన్నాయో- అలాంటి హక్కులే ధర్మప్రకారం మహిళలకు మగవారిపై ఉన్నాయి.

07/07/2019 - 23:24

కిక్కిరిసిన స్టేడియం..
ప్రేక్షకుల కేరింతలు..
ఎదురుగా తల్లిదండ్రులు..
ఐదుసార్లు వింబుల్డన్ గెలిచిన టెన్నిస్ రాణి వీనస్ విలియమ్స్ ప్రత్యర్థి..

07/05/2019 - 18:51

చాక్లెట్ పేరు వింటే చాలు అందరి నోట్లో నీరూరుతుంది. చిన్న పిల్లలతో మొదలుకొని వయోధికుల వరకూ అందరూ చాక్లెట్‌ను ఇష్టపడతారు. ఏ షాపుకు ఎక్కడికి వెళ్లినా దర్శనమిస్తుంది చాక్లెట్. చాక్లెట్‌ను చూస్తే భయపడాల్సిన అవసరం లేదు. మనోల్లాసంతోపాటు అద్భుతమైన ఆరోగ్యాన్నిస్తుందని పరిశోధనల ద్వారా తేల్చి చెప్పారు. ఆలుమగలైనా, అత్తాకోడళ్ళైనా, ఆఫీసులో బాస్ కొలీగైనా చాక్లెట్లవైపు మొగ్గు చూపిస్తే రోజంతా ఆరోగ్యం, ఆనందమే.

Pages