S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

02/10/2017 - 03:06

మహిళా అక్షరాస్యత 62.50 నుంచి 74.70 శాతం మాత్రమే పెరిగింది.
18 ఏళ్లు నిండకుండానే వివాహం చేసుకునే వారి సంఖ్య గత పదేళ్లలో 36.27 నుంచి 23.10శాతానికి తగ్గింది.
ఉద్యోగ, ఉపాధి విషయానికి వస్తే వ్యవసాయరంగంలో-76.3, ఉత్పత్తి రంగంలో 10, ఇతర రంగాలలో 8.5 శాతం మంది మహిళలు మాత్రమే పనిచేస్తున్నారు.

02/08/2017 - 22:03

మనిషికి లేని విలువ అతను సృష్టించిన డబ్బుకు ఉంది. జీవితం సాఫీగా సాగాలంటే డబ్బు కావాలి మరి. 33 ఏళ్ళ నందిని డబ్బుల్లేక ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. గత ఏడాదివరకు రెండు పూటలా భోజనం దొరికితే చాలనుకుంది. చిన్నప్పుడు పేదరికంలో మగ్గిపోయింది. డాక్టర్ కావాలని కలలు కనేది. అయితే డబ్బులు లేకపోవడంతో పదో తరగతిలోనే చదువును ఆపేయాల్సి వచ్చింది. అలాంటి నందిని జీవితాన్ని ఊబర్ కంపెనీ మార్చేసింది.

02/07/2017 - 23:05

అక్కడి ఆడపిల్లలు చాలామంది కదిలే బొమ్మలే. అచ్చంగా బార్బీ బొమ్మల్లానే ఉంటారట. ఒక్క వలేరియానే కాదు.. ఆమెలాగే చాలామంది యువతులు జీవితాన్ని బొమ్మలాట చేసుకుంటున్నారు. ఉక్రెయిన్‌కే చెందిన అలీనా కోవలెస్కాయా.. ప్లాస్టిక్ సర్జరీలతో బార్బీ బొమ్మలా మారింది. గూగుల్‌లో ఆమె పేరు టైప్ చేస్తే చాలు.. కొన్ని వం దల బార్బీ బొమ్మలు దర్శనమిస్తాయి. అవి నిజంగా బార్బీలు కాదు.. ఈ వయ్యారి బొమ్మలే.

02/05/2017 - 03:18

* లైంగిక వేధింపులకు గురయ్యే బాధితులకు‘మానవత్వం’తో చికిత్స!
* వెబ్‌సైట్‌తో అవగాహన కల్పిస్తున్న క్లైరే క్విడెట్

02/03/2017 - 23:12

ఆమెకు పరిశోధనలో ఓ తీరని దాహం. ఆ పరిశోధనలకే తన జీవితానే్న అంకితం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి, రచయిత్రి డాక్టర్ జోళపాళెం మంగమ్మ. మధురమైన కంఠంతో అఖిల భారత శ్రోతల్ని అలరించిన తొలి రేడియో ప్రయోక్త. దేశ విదేశాల్లో పర్యటించి పలు పరిశోధక గ్రంథాలను లోకానికి అందించిన అధ్యయన కర్త.

02/02/2017 - 22:12

ఆహ్లాదకరమైన నవ్వుల్లోనే ఆనందం దాగివుంటుందనే విషయం మరిచిపోతున్నాం. చిరునవ్వులు చిందించే ముఖంలోనే అందం సైతం దోబూచులాడుతోంది. నవరసాల్లో ఆరోగ్యకరమైన నవ్వును నిర్లక్ష్యం చేయటం వల్ల అనారోగ్యాల పాలవుతున్నాం. ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్లు దిగులుతో కనిపించేవాళ్లు సరదాగా, ఆనందంగా ఉండే వారికంటే ఎక్కువ బాధలు అనుభవిస్తున్నటు ఇటీవల జరిపిన ఓ సర్వేలో సైతం వెల్లడైంది.

02/02/2017 - 02:07

గుండె ధైర్యం ఆమె సొంతం.. కాళ్లు లేకున్నా పరుగు ప్రాక్టీస్
పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ఆకాంక్ష

నాకు తెలుసు నేను సొంతంగా చిన్న పని కూడా చేయలేనని. అయితే ఆత్మవిశ్వాసం, కుటుంబ సభ్యుల మద్దతు ఉంటే ఎవరైనా అద్భుతాలు సృష్టించగలరు. అందుకు తానే ప్రత్యక్ష నిదర్శనమని చెబుతారు షాలిని
సరస్వతి.

01/31/2017 - 22:29

రేపటి పౌరుడు ఉత్తముడిగా వెలుగొంది, దేశ భవిష్యత్‌కు పునాది కావాలంటే అక్షర స్వీకారం తప్పనిసరి. ఇది జీవితానికి తొలి పునాదిగా చెప్పాలి. చదువు, సంస్కారం, క్రమశిక్షణ, సత్ప్రవర్తన వంటి సద్గుణాల కలయికే విద్య.

01/28/2017 - 22:25

మనది పురుషాధిక్య సమాజం. అందువల్లనే మహిళలను అరిటాకులతోను, పురుషులను ముళ్ళతోను పోల్చుతా రు. అరిటాకు వచ్చి ముల్లు మీద పడినా, ముల్లు వచ్చి అరిటాకుమీద పడినా, నష్టం జరిగేది అరిటాకుకే అనే మెట్ట వేదాంతం చెప్పడంలో మనవాళ్లు బహునేర్పరులు. ఈ మెట్ట వేదాంతాన్ని తల్లులు తమ పిల్లలకు చిరుప్రాయం నుంచే బోధించి వారి బ్రెయిన్ వాష్ చేస్తారు.

01/27/2017 - 22:10

తొమ్మిదేళ్ల వినీల ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఆసియాలోనే కాదు ప్రపంచంలో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు నమోదు చేసుకుంది. ఈ చిన్నారి హైదరాబాది వాసి. సాహసంగా చేసిన తన యాత్ర గురించి అడిగితే చాలు ఆ రికార్డులు గురించి నాకేమి తెలియదు. అన్నయ్య చెయ్యి పట్టుకున్నాను. అధిరోహించాను అని చెబుతుంది.

Pages