S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

09/23/2017 - 19:15

భారతీయ పండుగలలో దసరాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనంగా ఈ పండుగును ప్రతి ఇంటా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. గోపికలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు దుస్తులు ధరించి చిన్ని కృష్ణుడితో ఆడిపాడారు. ఈ ఆనంద నృత్య తాండవ దృశ్యం మనకు దాండియా, గర్బా నృత్యాలలో కనిపిస్తుంది. అందుకే శరన్నవరాత్రులు తెచ్చే సందడి మాటల్లో చెప్పలేం.

09/22/2017 - 18:40

తిరుమలేశుడు, తిరుమలప్ప, శ్రీగిరీశుడు, వేంకటేశుడు. ‘తిరు’ అంటే ‘శ్రీ’, ‘మల’ అంటే కొండ, గిరి, పర్వతం. కనుక ‘తిరుమల’ అంటే శ్రీగిరి. శ్రీగిరిమీద స్వయంభువుగా వెలసిన కరుణామయుడు, వేంకటేశ్వరుడు- ఏడుకొండలవాసి.

09/21/2017 - 17:29

* యుద్ధ విద్యలో శిక్షణ * మాటలతో పనిలేదని చేతల్లోనే సత్తా * ‘హిమాలయ హీరోలు’గా అభివర్ణన

09/20/2017 - 20:05

శరన్నవరాత్రి సంబరాలు ఆరంభమయ్యాయ. దేవాలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా అమ్మను ఈ శరన్నవరాత్రులలో భక్తితో పూజిస్తారు. ఆదిపరాశక్తి తొమ్మిది అవతారాల్లో పూజలందుకుంటుంది. ఈ పండుగు సందర్భంగా అమ్మవారి లీలను స్మరించుకుంటూ పూజిస్తే ధర్మం ఆచరించేవారికి అండదండగా నిలిచి తన బిడ్డలను కాపాడుతుంది. అమ్మ దయార్థస్వరూపిణి. ఆమె కనులలో కరుణను కురుపిస్తుంది. మనిషిలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానజ్యోతి.

09/19/2017 - 21:27

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబం బతుకమ్మ పండుగ. గౌరమ్మగా
మహిళలంతా కొలిచే పూల పండుగ రానే వచ్చింది. ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు బహుళ భాద్రపద అమావాస్య నుండి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ గడ్డమీద ప్రకృతిని పూలతో ఆరాధించే పండుగ బతుకమ్మ. తరతరాల నుంచి తెలంగాణ ప్రజల జీవితంలో మమేకమైంది. తెలంగాణ ఆవిర్భావంతో రాష్ట్ర పండుగ అయంది.

09/16/2017 - 20:49

జీవితం నేర్పే పాఠాలు అరటి పండు ఒలిచిపెట్టినంత సులువుగా ఉండవు. ఒక్కొక్కసారి కఠినంగా ఉంటాయి. సవాళ్లను ఎదుర్కొంటూ విజేతగా నిలిచే వ్యక్తుల జీవితగాథలు నిత్యం ప్రేరణగా నిలుస్తాయి. అందుకే వీరి జీవితగాథలను తెలుసుకోవాలనే ఆసక్తి కూడా మెండుగా ఉంటుంది. ఈ ఆసక్తిని కథలుగా మలిచి వెండితెరపై మెరిపించే సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలే కాదు నటులు సైతం ఆసక్తి వీరి జీవితగాథల్లో నటించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.

09/15/2017 - 23:08

ప్రపంచానికి ఆమె కర్నాటక సంగీత స్వరరాణి, ఓ స్వర్ణపుట. భారతీయ సంప్రదాయ సంగీతానికి గమకం, గమనం, గమ్యం. సంగీతంతో వసుధైక కుటుంబాన్ని ఏర్పాటుచేసి అందరి హృదయాల్లో దైవత్వాన్నినింపిన శాంతమూర్తి ఎంఎస్ సుబ్బులక్ష్మి. దాదాపు ఏడు దశాబ్దాల పాటు తన గానామృతంతో యావత్ ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసిన ఈ సంగీత శిఖామణి భౌతికంగా మనమధ్య లేకపోయినా.. వేకువ జామున శ్రీవారి సుప్రభాతంతో ప్రపంచాన్ని మేలుకొలుపుతోంది.

09/14/2017 - 21:32

చిన్నప్పుడు ఆడుకోమని పెద్దలు ఎందుకు బొమ్మలు ఇస్తారో ఈ అమ్మాయని చూస్తే అర్థమవుతుంది. ఆ పసివయసులో ఈ బొమ్మలే వారిలో సరికొత్త ఆలోచనలకు శ్రీకారం చుడతాయ. బొమ్మల్లో బార్బీ బొమ్మకున్న విలువ అంతా ఇంతా కాదు. ఈ బొమ్మ ఉండని ఇల్లు ఉండదు. ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ను బార్బీ బొమ్మతో పోల్చారు. ఇలాంటి ఈ బొమ్మను ఆధారంగా చేసుకున్న శైలజ కియా ఇండియన్ డాల్‌కు శ్రీకారం చుట్టారు.

09/13/2017 - 23:22

శ్రావ్యమైన శాస్ర్తియ సంగీతం చెవినపడితే చేస్తున్న పని కూడా ఆపేసి వినేవారు ఈ కళల కాణాచిలో ఎంతో మంది ఉన్నారు. స్వరాలే జీవితం అనుకుని సాధన చేసే సంగీత సరస్వతులు వీరు. రాగాల పల్లకిలో సరికొత్త రాగాలను పలికిస్తున్న ఈ కోయిలమ్మలు సరిగమలతో సావాసం చేస్తుంటారు. శాస్ర్తియ సంగీతంలో సాహసంతో సరికొత్త ప్రయోగాలు చేస్తూ ఆ సంగీత కళామతల్లికి తమ సేవలు అందిస్తున్నారు.

09/12/2017 - 23:15

ప్రియకు పిజ్జా అంటే ప్రాణం. ప్రేమికి ఫ్రెంచ్ ఫ్రైస్ పేరు వింటేనే ఆనందం, భాస్కర్‌కు బర్గర్ ఉంటే మరేమీ అవసరం లేదు. నల్లికి నూడిల్స్ ఉంటే హాయి. బుజ్జికి బజ్జీలంటే మహాప్రీతి. ఈ స్నాక్స్ అన్నీ కుర్రకారుకే కాక అందరికీ మహా ఇష్టమైనవి. పద్మిని, అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్‌లోని పెరుగన్నం బస్‌స్టాప్ వద్ద డస్ట్‌బిన్‌లో వేసి కాలేజీకెళుతుంది. ఆ పెరుగన్నం చూస్తే అందరూ వెక్కిరిస్తారని ఆమె భయం.

Pages