S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

09/10/2017 - 00:14

అరచేతుల్లేవన్న చింత తప్ప ఈ చెన్నై అమ్మాయి సాధించని ఘనకార్యాల్లేవు! పదిహేనేళ్ళకిందట గ్రెనేడ్ పేలడం వల్ల మాళవిక అయ్యర్ రెండు అరచేతులు కోల్పోయింది. అయినప్పటికీ ఎన్నో అవార్డులు గెలుచుకుంది. దివ్యాంగుల హక్కుల కోసం పోరాటం సాగిస్తోంది. ఐక్యరాజ్య సమితి వేదికల్లో ప్రసంగించింది. దివంగత రాష్టప్రతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్‌తో భేటి అయింది.

09/08/2017 - 23:01

ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ నేడు కుటుంబ నిర్ణయాల్లోనూ, సంపాదనలోనూ ఆమె పాత్ర గణనీయంగా పెరుగుతోంది. నిర్ణయాలు తీసుకోవటంలోనే కాదు వాటిని అమలుపరచటంలోనూ అతివల హవా కొనసాగుతోంది. సంపాదనలోనూ తామెవ్వరికీ తీసిపోమంటూ పురుషుల కంటే స్ర్తిలే అధికంగా సంపాదిస్తున్నారు. కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, చాలెంజ్‌లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు.

09/07/2017 - 23:28

దూకుడు, చురుకుదనం, బలమైన ముష్టిఘాతాలతో బాక్సింగ్‌లో తనదంటూ ఒక శైలిని సృష్టించుకుని, నాలుగేళ్ళ కిందట సెర్బియాలో జరిగిన అంతర్జాతీయ సబ్ జూనియర్ బాలికల బాక్సింగ్ చాంపియన్ షిప్‌లో బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది జమునా బోడో! అసోంలోని సోనిత్‌పూర్ జిల్లా బెల్సిరి గ్రామానికి చెందిన ఈ పంతొమ్మిదేళ్ళ అమ్మాయి చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలను చవిచూసింది.

09/06/2017 - 23:32

ఇంటికి అందాన్ని, మనసుకు ఆహ్లాదాన్ని అందించే గార్డెన్ అంటే ఎవరికి మాత్రం ఇష్టముండదు.ఇంటి పైకప్పుపై పచ్చటి వనాన్ని సృష్టించాలనే ఆసక్తి ఉన్నవారికి ఇదే సరైన సమయం. నలుగురు కుటుంబ సభ్యులకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవటం చాలా ఈజీ. వీటితో పాటు పండ్ల మొక్కలను కూడా పండించుకోవటం నేడు సులువే. నగరంలో ఇంటి పంటలు పండించేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది.

09/05/2017 - 22:26

మమకారం, మాతృత్వం కలగలిపిన అమృతమూర్తి.. ధనిక, పేద, కుంటి, గుడ్డి, కుష్టి - ఎవరైనా ఆమెకు బిడ్డలు. లక్షలాది మంది ఆ చల్లని నీడలో ఈనాటికీ సేదతీరుతున్నారు. అందుకేనేమో ఆమె విశ్వమాత అయంది. ప్రేమమూర్తే మదర్ థెరిస్సా పేరు విననివారు ప్రపంచంలో బహు అరుదుగా ఉంటారు. ఆ వటవృక్షం నీడలో పెరిగిన ఓ వికలాంగుడు తనకు అమ్మ ప్రేమను పంచిపెట్టిన ఆ సేవామూర్తి చెప్పిన మూగవేదన ఇది.

09/02/2017 - 23:18

‘మీరు కన్నకల నిజమవడం ఓ గురువుతో ఆరంభమవుతుంది’ అని ప్లాటో మహాశయుడు అన్నట్లు పుట్టిన బిడ్డకు తొలి గురువు అమ్మ అయితే మలి గురువు ఉపాధ్యాయుడే. బాధ్యతలు ఏమిటో నేర్పిస్తూ.. భవిష్యత్తుకు బాటలు వేస్తూ.. సమాజంలో ఉత్తమ పౌరుడిగా మలిచే అపురూప శిల్పి గురువు. చదువు చెప్పటం అనేది వృత్తిగా భావించకుండా అదో బాధ్యతగా విద్యార్థినీవిద్యార్థులను తీర్చిదిద్దిన అసాధారణ ఉపాధ్యాయులు వీరు. అసలుసిసలు స్ఫూర్తి ప్రదాతలు.

09/02/2017 - 00:14

క్రీడారంగంలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్ మరిదేనికి లేదు. క్రికెట్ కంటే ఎక్కువ పతకాలు తెచ్చి దేశ గౌరవాన్ని నిలబెడుతున్న అథ్లెటిక్ క్రీడాకారులకు ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దాతలు ఉండరు. లక్షల్లో ఖర్చు. అయినప్పటికీ అడుగడుగున ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ.. సివంగుల్లా పోరాడుతూ.. అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నారు. పతకాలను తమ ఖాతాల్లో వేసుకుంటూ దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నారు.

08/31/2017 - 23:49

మనం ఆర్థికంగా బాగున్నాం. మిగతావారి గురించి మనకెందుకు అని ఆలోచించే ఈరోజుల్లో అనాథలైన ఆడపిల్లలను అక్కున చేర్చుకుంటారు ఈ అక్కాచెల్లెల్లు. వారి కోసం ఏదైనా చేయాలని తపిస్తుంటారు. కంప్యూటర్ విద్యలో ఓనమాలు దిద్దించి, సాంకేతిక రంగంలో నిష్ణాతులను చేస్తున్నారు. వారికి ఉపాధి చూపించి జీవితంలో స్థిరపడేలా చేస్తున్నారు.

08/30/2017 - 22:14

పెళ్లంటే మూడు ముళ్లు.. ఏడడుగులు కాదు.కలిమిలోనూ లేమిలోనూ కలకాలం తోడుంటామని బాస చేసుకునే పవిత్ర బంధం. కళ్యాణం అనే ఈ పదంలోనే ఎంతో కమ్మదనం దాగివుంది. వివాహం అయిన తరువాత సంఘంలో పరిపూర్ణమైన జీవితానికి పునాది ఏర్పడుతుంది. కాని ఈ అనురాగ బంధం నేడు అపహాస్యం పాలవుతుంది. పెళ్లయిన వెంటనే వేరే కాపురానికి రెడీ అవ్వటం. ఆధునిక జీవనశైలికి అలవాటుపడలేక యువతీ యువకులు విడాకులకు మొగ్గు చూపుతున్నారు.

08/29/2017 - 22:51

ఆమె ప్రపంచ ప్రజలు మనసు గెలుచుకున్న అందాల యువరాణి. అందుకే అందరి హృదయ సామ్రాజ్ఞి అయింది. ఆమె అందమైన నవ్వు వెనుక దాగివున్న విషాదం ప్రజానీకాన్ని వెన్నాడుతూనే ఉంది. ఆ నవ్వు అనంత విశ్వంలో కలిసిపోయి నేటికి ఇరవై ఏళ్లు. అయినా ఈనాటికీ అందరి మనసుల్లో చెదరని జ్ఞాపకంగా నిలిచిపోయింది. ఆమే బ్రిటిష్ ప్రినె్సన్ డయాన. రేపటికి ఆమె చనిపోయి రెండు దశాబ్దాలు దాటింది.

Pages