S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

06/20/2017 - 21:45

ఐదువేల ఏళ్ల చరిత్రగల విశిష్ట సాధన ప్రక్రియ యోగ. ఈ పదం సంస్కృత పదం ‘యుజ్’ నుంచి పుట్టింది. అంటే కలపడం, కలవడం, కలిసి ఉండటం అనే అర్థాలున్నాయి. ‘యోగా’ను పాశ్చాత్యులకు పరిచయం చేసిన తొలి గురువు స్వామి వివేకానంద! మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో ఒంటికి యోగా అంతే అవసరం. యోగాను అందించిన పతంజలి మహర్షి ‘యోగాః కర్మను కౌశలం’ అన్నారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘నీవు చేసే పనిలో నైపుణ్యమే యోగా’ అని సెలవిచ్చాడు.

06/17/2017 - 22:03

నాన్నంటే కుటుంబానికి చుక్కాని. బాధ్యతలు మోసే పెద్దాయన. మార్గదర్శి. అన్నప్రాశన, అక్షరాభ్యాసం స్కూల్లో చేర్పించటం వంటి పనులు చేస్తూ, తాను పడ్డ కష్టాలని మరచిపోతాడు. పిల్లలు ప్రయోజకులైతే అతడి ఆనందానికి అవధులు ఉండవు. ‘నాన్నా’ అని పిలిస్తే చాలు మంచులా కరిగిపోయి సంబరపడిపోతాడు. వసుదేవ సుతుడు, పాండునందనులు, శ్రవణుడి వృత్తాంతాలు మనకు తండ్రీ కొడుకుల పాత్రలను గుర్తుచేస్తాయి.

06/16/2017 - 21:37

కంటి జబ్బుల్లో ప్రధానమైన ‘మయోపియా’ (‘షార్ట్ సైటెడ్‌నెస్’- హ్రస్వదృష్టి) 3-5 ఏళ్ళ చిన్నపిల్లల్లోనే ఎందుకొస్తోంది? తమ వద్దకొస్తూన్న కంటి రోగుల్లో 25 శాతంమంది వీళ్లే ఎందుకవుతున్నారు? కంటి డాక్టర్లే ఈ ప్రశ్నలు వేసుకొని తామే సమాధానం చెప్పుకుంటున్నారు. దీనిక్కారణాలు రెండు.
ఒకటి పిల్లల తల్లులు, రెండు ప్రభుత్వం.

06/15/2017 - 21:58

అధునికయుగంలో పాశ్చాత్య పోకడల మాయలో పడినవారు సంప్రదాయ సంగీతాన్ని పెద్దగా ఇష్టపడటం లేదు. ముఖ్యంగా కుర్రకారు అలనాటి సంప్రదాయ వాయిద్య సంగీతా న్ని పెద్దగా ఇష్టపడటం లేదు. ఒకప్పుడు గాత్రానికి ఎంత ప్రాధా న్యం ఉండే దో వాద్యసంగీతానికీ అంతే విలువ ఉండేది. అందు నా వీణ మీటడంలో ప్రావీణ్యం ఉంటే అదో పెద్ద హోదాగా పరిగణించే రోజులున్నాయి.

06/14/2017 - 21:26

గౌతమ్ పసితనం నుంచే సామాజిక స్పృహతో వ్యవహరించేవాడు. తండ్రి ఆర్మీ ఉద్యోగి కావటం వల్ల క్రమశిక్షణతోపాటు మంచితనం, మానవత్వం అలవడ్డాయి. రోడ్డుమీద గుంతలు కనిపిస్తే బైక్ ఆపి పక్కన పెట్టి ఆ గుంతలను బాగు చేయడానికి నడుం కట్టేవాడు. పేదలు కష్టాలను చెప్పుకుంటే తన వంతు సాయంగా వారికి కావలసినవి సమకూర్చేవాడు. చెట్టుకింద ఏ పని లేక విచారించే బీదవారికి తమకు చేతనైన పనిని సమకూర్చేవాడు. అలా అలా ప్రజల దృష్టిలో పడ్డాడు.

06/13/2017 - 21:47

‘అల్ట్రామోడ్రన్’ అని చెప్పుకునే ఈ మాయదారి కాలంలో మనిషికి ఏమయిందో ఏమో గానీ చాలా స్వార్థంగా ప్రవర్తిస్తున్నాడు. తన గురించి తను తప్ప, తనవారి గురించి, సాటి మనిషి గురించీ ఆలోచించటంలేదు. విలాస వస్తువులమీద, ఎలక్ట్రానిక్ గాడ్జెస్‌మీద చూపించే ప్రేమ మనుషులమీద చూపించటంలేదు.

06/10/2017 - 21:20

తెలంగాణ రాష్ట్రంలోని సిరిసిల్లలోని కామారెడ్డి ప్రధాన రహదారి పక్కన సాయినగర్‌లో నివాసముండే భూర రాజేశ్వరి స్ఫూర్తికి మారుపేరు అని చెప్పవచ్చు. నేత కుటుంబానికి చెందిన భూర సాంబయ్య, అనసూర్య దంపతులకు ఆరుగరు సంతానంలో అయిదవ బిడ్డగా జన్మించిన రాజేశ్వరి.. పోలియో వ్యాధితో శరీరంలోని అంగాలు సరిగా పని చేయక పోతే.. ఆ తల్లి తండ్రులు, నానమ్మ, అమ్మమ్మలు రాజేశ్వరిని నడిపించడానికి అవసరమైన అన్ని లేపనాలు రాశారు.

06/09/2017 - 20:58

‘తత్త్వము’ అంటే ఆ సర్వేశ్వరుడే. కనుక
‘తత్త్వ జ్ఞానం’ అనేది పూర్తిగా ఆయన విషయమైన తెలివిడియే. ఆ తత్త్వజ్ఞానాన్ని (అంటే సర్వేశ్వరుడియొక్క ఉనికి గురించిన వివరం) తన తపస్సుతో, అనుభవంతో గ్రహించినవాడే గురువు! ఏ శిష్యుడికి ఏది
అవసరమో తెలిసి, ఆ వ్యక్తి అజ్ఞానాన్ని
తొలగించి, ఆ వ్యక్తికి కూడా
తత్త్వజ్ఞానాన్ని
అందించగలవాడే గురువు!..

06/08/2017 - 22:33

నూనె తక్కువతో వండే వంటకం
ఈ పొంగడాలు. నూనె లేకుండా కూరలు వండుకునేవారికి వారికి ఈ ఫలహారం నచ్చుతుంది. ఇడ్లీ వలే సాత్వికాహారం. వేడి వేడి పొంగడాలను చట్నీ అద్దుకుని తింటే రుచిగా ఉంటాయ. పొంగడాల తయారీకి ప్రత్యేక పళ్ళెం, మూత, ప్రత్యేక దబ్బనం లాంటి స్టిక్ ఉంటుంది.

06/08/2017 - 22:30

జీవితంలో విజయం సాధించాలంటే చేసే పనిని మనస్ఫూర్తిగా చేయాలని మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలామ్ మాటలు నిజం చేస్తున్నారు ఈనాటి మహిళా పోలీసు అధికారిణులు. ఖాకీ దుస్తులు వేసుకున్న ఈ మహిళల్లో కరకుదనం ఉండదు. సామాన్యుడిని కాపాడే రక్షణదుర్గమే పోలీసు వ్యవస్థ అని నిరూపిస్తూ అన్యాయాలకు ఎదురొడ్డుతున్నారు. ఇంటిని, విధి నిర్వహణను బ్యాలెన్స్ చేసుకుంటూ తమదైన శైలిలో ముందుకు దూసుకుపోతూ తమ సత్తా చాటుకుంటున్నారు.

Pages