S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

12/10/2015 - 03:46

ఒక ఆలోచన లక్షలాది రైతు కుటుంబాల తలరాతను మార్చివేసింది. ఆ వజ్ర సంకల్పం ముక్త్యాల సంస్థానాధిపతులు రాజా రామగోపాల కృష్ణమహేశ్వరప్రసాద్ (ముక్త్యాల రాజా)ది. ముక్త్యాల కోట కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున ఉంది. ఆ కోట నదికి ఎత్తయిన ప్రదేశంలో ఉంది. కోటలోనుంచి చూస్తుంటే- చాలా లోతులో కృష్ణానది ప్రవహిస్తూ కనిపిస్తుంది.

12/08/2015 - 21:36

‘ఈ కాలపు యువత స్వేఛ్చను కోరుకుంటోంది.. సవాళ్లను ఎదుర్కొంటూ గెలుపుతీరానికి చేరుకోవడంలోనే నిజమైన ఆత్మసంతృప్తి ఉంటుంది.. పెద్దల అనుభవాలను స్ఫూర్తిగా తీసుకుంటే నేటి కుర్రకారుకు అసాధ్యం అంటూ లేదు..’ అని ఆమె చెబుతుంటారు. వ్యాపారరంగంలో కుటుంబ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆమె ఇపుడు అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి వనె్న తెచ్చారు.

12/07/2015 - 22:30

గళం విప్పుతున్న పురుష హక్కుల సంఘాలు

12/06/2015 - 07:23

ఆమె- ఉమ్మడి కుటుంబాల వద్దకు వెళుతుంది.. చిన్నాపెద్దా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంది.. లేడీస్ హాస్టల్‌కు వెళ్లి అక్కడి టీనేజీ అమ్మాయిలతో కబుర్లు చెప్పి వాళ్ల ఇష్టాయిష్టాల గురించి ఆరా తీస్తుంది.. రోడ్డుపక్కన నిలబడి కాలక్షేపం చేసే యువకులను కలిసి వారితో సరదాగా మాట్లాడుతుంది.. విలక్షణమైన హెయిర్ స్టయిల్, అలరించే హావభావాలు, మాటల గారడీతో ఆమె అందరినీ ఇట్టే కట్టిపడేస్తుంది..

12/05/2015 - 05:44

మన దేశంలో పెళ్లి సంబరం అంటే చాలు- ఆర్భాటాలకు, అనవసర ఖర్చులకు అంతూ పొంతూ ఉండదు. పలురకాల వంటకాలకు, సినిమా సెట్టింగ్‌లను తలపించే కల్యాణ మండపాలకు మంచినీళ్ల ప్రాయంగా డబ్బు వెచ్చిస్తుంటారు. పెళ్లి వేడుకలో ఆర్భాటాలు లేకుంటే అది తమ హోదాకు తక్కువని భావిస్తూ అప్పు చేసి మరీ లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం ఆనవాయితీగా మారింది. సంపన్న వర్గాల్లో అయితే ఇది మరీ వేలం వెర్రిగా ఉంటుంది.

12/02/2015 - 21:34

‘ఊరు నుంచి ఎంతో తీసుకున్నాం.. తిరిగి ఇవ్వకపోతే లావెక్కిపోతాం.. సొంత ఊరి బాగు కోసం ఎంతో కొంత త్యాగం చేయాల్సిందే..’ అంటూ ఇటీవల ‘శ్రీమంతుడు’ సినిమా గ్రామాలను దత్తత తీసుకోవాలంటూ గొప్ప సందేశం ఇచ్చింది. ఊరిని ఉద్ధరించేవారే అసలైన ‘శ్రీమంతులు’ అంటున్న ఆ సినిమా గురించి తెలియకముందే- కొంతమంది యువతీ యువకులు సేవాభావంతో ముందడుగు వేశారు. విదేశాల్లో భారీ సంపాదన, విలాస వంతమైన జీవితం, మంచి హోదా..

12/02/2015 - 02:03

అనునిత్యం అనూహ్య మార్పులే ‘్ఫ్యషన్ ప్రపంచం’ అసలు లక్షణం. మార్పుకు స్వాగతం పలుకుతూ, మగువలు వైవిధ్యాన్ని కోరుకోవడంతో ఈ ఏడాది భారత్‌లోనే కాదు, విశ్వవ్యాప్తంగా కొత్త కొత్త ఫ్యాషన్లు రంగప్రవేశం చేశాయి. సాంప్రదాయాలకు ఆలవాలమైన భారత్‌లోనూ మహిళలు స్వేచ్ఛాగళం వినిపిస్తూ ఆధునికత వైపు పరుగులు తీస్తున్నారు. ముఖ్యంగా యువతులు తమకు నచ్చిన దుస్తులు ధరిస్తూ, అలంకరణపై తెగ మోజుపడుతున్నారు.

12/01/2015 - 04:58

దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి చెందిన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు,దిల్లీ) మహిళల పట్ల లైంగిక వేధింపుల విషయంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. దేశ రాజధానిలో ప్రభుత్వ, ప్రైవేటురంగ కార్యాలయాల్లో ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు సంబంధించి 2013 తర్వాత 101 ఫిర్యాదులు అందగా, అందులో 50 శాతం ఫిర్యాదులు జెఎన్‌యుకి చెందినవేనని దిల్లీ మహిళా కమిషన్ తాజాగా ప్రకటించింది.

11/28/2015 - 23:27

ఈ చిత్రాల్లో కన్పిస్తున్న వనిత పే రు ట్రేసీ కుర్టిస్ టేలర్. ప్రపంచంలో 24 దేశాలను ఒంటరిగా విమానంలో చుట్టిరావడం ఆమె లక్ష్యం. ఈ ఏడాది అక్టోబర్ 1న ఆమె తనకు అత్యంత ఇష్టమైన ‘1942-బోయింగ్ స్టీర్‌మన్ ఓపెన్ కాక్‌పిట్ బై ప్లేన్’లో ప్రయాణాన్ని ప్రారంభించింది. తాను ఎంతగానో అభిమా నించే అమీ జాన్సన్ స్ఫూర్తితో ఈ విమాన యాత్రకు ఉపక్రమించానని ఆమె అంటోంది.

11/28/2015 - 03:17

నలుగురు సంతానం కలిగిన ఇళ్లలో సైతం- ఆడపిల్లల కన్నా మగపిల్లల సంఖ్యే ఎక్కువ.. పరిమిత కుటుంబాల సంఖ్య అధికం అవుతుండగా- ఆడశిశువుల సంఖ్య రానురానూ మరింత తగ్గుతోంది.. మగపిల్లాడు పుడితే వంశాంకురమని, ఆడపిల్ల పుడితే అన్నీ అవస్థలేనన్న భావజాలం మన దేశంలో ఇంకా పదిలంగానే ఉంది.. ఆడశిశువుల పట్ల వివక్ష యథేచ్ఛగా కొనసాగుతోంది..

Pages