S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

10/28/2016 - 21:12

చాలామంది పిల్లలు స్టైల్‌గా చేతుల్లో బాంబు పట్టుకుని కాల్చే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల చేతులు కాలే ప్రమాదం ఉంది.
సినిమాల్లో రజనీకాంత్ అలా చేస్తే తనకి కోట్ల రూపాయలు ఇస్తారు. అదే నిజ జీవితంలో మనం చేస్తే ప్రమాదానికి గురై ఆసుపత్రికి లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

10/27/2016 - 22:01

ఆంగ్లేయుల కబంధహస్తాల్లో భారతదేశం చిక్కుకుని విలవిలలాడుతున్న సమయమది. పేదరికం, నిరక్షరాస్యత కష్టాలు అనుభవిస్తున్న భారతదేశ ప్రజలను ఆదుకునేందుకు, వారికి సేవ చేసేందుకు పశ్చిమ దేశాల నుంచి పలువురు తరలివచ్చారు. అలాంటి వారిలో మిస్ మార్గరేట్ ఒకరు. ఈమె ఐర్లాండ్‌నుంచి వచ్చింది. భారత్‌లాగే ఐర్లాండ్ కూడా అప్పట్లో స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తోంది.

10/27/2016 - 02:50

ఆ ఆకారాన్ని చూస్తే ఫక్కున నవ్వు వస్తోంది. ముఖం నిండా తెల్లటి మేకప్.. ముక్కుమీద ఎర్రటి వస్తువు.. నోటి చుట్టూ ఎర్రటి గీతలతో విచిత్రంగా ఉండే కౌన్స్ అందరూ ఒకచోట చేరితే ఎలా ఉంటుంది. ఇక అక్కడ నవ్వులే.. నవ్వులు కదా!. పసి పిల్లాడి నుంచి పండు ముదుసలి వరకూ అందర్నీ నవ్వించే ఈ హాస్య విదూషకులందరికీ ఓ పెద్ద నెట్‌వర్క్ కూడా ఉంది. దీని పేరే ‘వరల్డ్ క్లౌన్స్ అసోసియేషన్.

10/25/2016 - 23:21

ఇల్లు.. స్వర్గసీమ! అది లక్ష్మీదేవి నడయాడే ప్రదేశమని తెలుసుకున్నప్పుడే కదా ఆనందాల హరివిల్లు అవుతుంది.! లేదంటే అన్నీ కష్టాలే.. నిత్యం కన్నీళ్ళే! ఇంటి ‘స్వచ్ఛత’ కోసం వారంలో ఒక రోజు కేటాయించి ఇంటిని చక్కదిద్దుకుంటే కుటుంబం అంతా హాయిగా, ఆరోగ్యంగా గడిపేయొచ్చని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. లేదంటే ఆదాయానికి మించి వైద్య ఖర్చులు తలపై కూర్చొంటాయ.

10/25/2016 - 23:16

ఇంటికి నిత్యం ఓ అరగంట కేటాయించి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ లేదా వారానికి ఒకసారి ఇంట్లోని ఫ్లోర్‌ను సర్ఫ్‌తో లేదా పసుపుతోనైనా లేదా తేలికైన క్రిమి సంహారక లిక్విడ్‌లను ఉపయోగించి శుభ్రం చేసుకుంటే ఆరోగ్యం. పసుపు సర్వరోగ నివారిణిని కాబట్టి ఈ పసుపునే ఎక్కువగా ఉపయోగిస్తే ఎంతో మేలు.

10/25/2016 - 23:14

ఈ ఆధునిక యుగంలో మానవుడు అన్ని రంగాల్లో కొంగొత్త ఆవిష్కరణలు చేస్తున్నప్పటికీ ‘చిన్న‘పనైన ‘పరిశుభ్రత’పై నిర్లక్ష్యం వహిస్తున్నాడు. ఆ అశ్రద్ధ ఫలితమే వ్యాధుల విజృంభణ.. మరణాలు! డెంగ్యూ జ్వరానికి సం బంధించి నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం (మినిస్టరీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) గణాంకాల ప్రకారం మన రాష్ట్రంలో 2010లో 776 కేసులు నమోదు కాగా, ముగ్గురు చనిపోయారు.

10/25/2016 - 23:07

స్వచ్ఛ్భారత్ పేరుతో ప్రధాని మోదీ దేశ ప్రజల ను ఒక్కసారిగా తట్టిలేపారు. ఈ కార్యక్రమంవల్ల దేశమంతటా ఏ విధంగా చైతన్యం వెల్లివిరిసిందో వేరే చెప్పనక్కర్లేదు. కొంతమేర ఫలితాలనే ఇచ్చింది. గాఢంగా నిద్రపోతున్న వ్యక్తిని తట్టి లేపినట్టు.. ఎవరో వచ్చి వివరిస్తేగానీ తెలుసుకోలేని పరిస్థితిలో బతుకు సాగిస్తున్నాడు.

10/25/2016 - 23:04

వసుధైక కుటుంబంతోనే మానసిక ఆరోగ్యం లభిస్తుంది. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబ యజమానిని గౌరవించేవారు. ఆయనను భగవంతుడని తలచేవారు. ఆయన ఏది చెబితే ఆ ఇంటివారికి అది వేదం. ఆనాటి కుటుంబాల్లో కలహాలు కనిపించేవి కావు. రోజులు మారా యి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమయ్యా యి. స్వేచ్ఛ పేరిట కుటుంబాలు విచ్ఛన్నమైనట్లే వ్యక్తిగత ‘స్వచ్ఛ’తను నేటి ప్రజలు విస్మరిస్తున్నారు.

10/25/2016 - 23:03

కుటుంబంలోని పిల్లలు, పెద్దలు ఇంటి శుభ్రత, వ్యక్తిగత శుభ్రత పాటించాలి. అదేవిధంగా ఇంటిల్లిపాది పౌష్టికాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆకుకూరలు, పప్పు్ధన్యాలు, తాజాపండ్లు తినాలి. గర్భిణులు, బాలింతలు కూడా పోషకాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇంటితోపాటు పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

10/25/2016 - 23:01

యోగాను ఆచరించటంవల్ల దేహం, దేశం సుభిక్షంగా ఉంటుంది. ఆసనాలు వేయడం ద్వారా రజోగుణం, శారీరక రుగ్మతలు తొలగిపోతాయి. ‘ప్రాణాయామేన పాతకం హంతి’.. ప్రాణాయామం సాధనతో సప్త ధాతువుల్లోని దోషాలు పోతాయి. యోగా చేసిన ప్రతి వ్యక్తి సైనికుడిలా అన్నింట్లో ముందుంటాడు.
- పి.ఎం.వి.కేశవరావు, నాగార్జున యూనివర్సిటీ
గౌరవ యోగాధ్యక్షుడు, విశాఖపట్నం

Pages