S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

06/24/2018 - 22:04

ఒక ఆలోచన జీవితానే్న మలుపు తిప్పుతుందన్నది నానుడి. ఆ నానుడిని నిజం చేసింది చిత్తూరుకు చెందిన మంజూషా. తనకు ఎదురైన కష్టాన్ని మరో పేద, మధ్య తరగతి వారికి ఎదురుకాకకూడదని వారి సమస్యను పరిష్కరించడానికి తన భర్తతో కలసి ఒక యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌కు కేంద్రప్రభుత్వం గుర్తింపు కూడా లభించింది. ఇక ఆ గృహిణిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి.

06/22/2018 - 21:55

ఆలోచనలకు కృషిని మేళవిస్తే నవీన ఆవిష్కరణలకు, అద్భుత కళాకృతులకు అంతే ఉండదని ఆ దంపతులు నిరూపిస్తున్నారు.. ‘కళకు కాదేదీ అనర్హం’ అన్నట్లు మనం నిత్యం వినియోగించే కూరగాయలను అపురూప కళాఖండాలుగా తీర్చిదిద్దుతూ ప్రాచీక కళకు ప్రాచుర్యం కల్పిస్తున్నారు.. గుమ్మడి, ఆనప, కాకర వంటి కూరగాయలను వండుకుని తినడం అందరికీ తెలిసిందే..

06/22/2018 - 03:09

మిస్ ఇండియా వరల్డ్ అనుక్రీతి వాస్. చెన్నైలో పుట్టి పెరిగిన ఈ చిన్నది చిన్నప్పటి నుంచీ చురుకే. మధ్యతరగతి అమ్మాయైన అనుక్రీతి చదువుల్లోనే కాదు, ఆటపాటల్లోనూ, ఇతర భాషలు నేర్చుకోవడంలోనూ, అందాల పోటీల్లోనూ ప్రతిభావంతురాలే.. అయితే కుటుంబ పరిస్థితులరీత్యా చిన్నవయస్సులోనే తండ్రి దూరం కావడంతో తల్లే ఆమెను కంటికి రెప్పలా కాపాడింది.

06/20/2018 - 23:39

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం.....

06/19/2018 - 23:53

కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు..
నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి..
నిన్ను నీవు నిరూపించుకునేందుకే వచ్చాయి..
కష్టాలకు కూడా తెలియాలి..
నిన్ను సాధించడం మహాకష్టమని..!
- ఎ.పి.జె. అబ్దుల్ కలాం

06/18/2018 - 23:35

సమాజంలో సగభాగమైన స్ర్తిలు స్వేచ్ఛగా జీవించే స్థితి, భద్రంగా బతికే పరిస్థితి కానరావటం లేదనటానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులు, గృహహింస, పరువు హత్యలు, వరకట్న చావులు- ఇలా ఎన్నో ఎనె్నన్నో ఉదహరణలుగా చెప్పవచ్చు. చట్టాలు ఎన్ని వున్నా కొత్తగా వస్తున్నా అవి నేరస్థులకు చుట్టాలుగా ఉన్నాయే తప్ప తగిన శిక్షలు పడటంలేదు. నిర్భయ చట్టం అమలులో వున్న నేరస్థులకు భయం లేదు.

06/17/2018 - 21:47

సౌందర్య వర్ణన చేసేటపుడు నఖశిఖ పర్యంతం వర్ణించేవారు మన పూర్వకవులు. అంటే కొనగోటి నుంచి కొప్పు వరకు నానాలంకార ప్రయోగాలతో వర్ణిస్తూ పద్యాలల్లేవారు. కొప్పుల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఏ ముఖానికి ఏ కొప్పు అందంగా ఉంటుందో అది వారి ముఖారవిందమే చెబుతుంది అని లెక్కలేనన్ని కొప్పులు చుట్టేవారు. ఇక తామరతూడుల్లాంటి చేతుల సౌందర్యం చెప్పడం ఆ శ్రీనాథునికి కూడా కష్టమేనంటారు.

06/15/2018 - 22:25

కాలంతోపాటు జీవితాలు పరుగులు పెడుతున్న నేటి ఆధునిక యుగంలో కూడా అమ్మాయిలు వాహనాలపై దూసుకుపోతుంటే వింతగా చూస్తూ కామెంట్స్ చేసే మగవారికి కొదవేలేదు. అలాంటిది అగ్రరాజ్యమైన అమెరికాలో దివ్యా సూర్యదేవర అనే ముప్ఫై తొమ్మిదేళ్ళ తెలుగు మహిళ తన ప్రతిభా పాటవాలతో ఉన్నతస్థాయికి చేరుకుంది. ఇప్పటికే మహిళలు అన్ని రంగాల్లోనూ నిబద్ధతతో పనిచేస్తూ తమ ప్రతిభాపాటవాలను చాటుతున్నారు.

06/14/2018 - 22:56

ఆధునిక జీవనశైలిలో అమ్మాయిలకు, మహిళలకు చీరకంటే రవికలపైనే మోజు పెరుగుతోంది. చీర ఎంత తక్కువ ధర పెట్టి కొన్నా రవికను మాత్రం రకరకాల మోడల్స్‌లో కుట్టించుకుంటున్నారు. ఇక అమ్మాయిలైతే చాలా చాలా ముందుంటున్నారు. సంప్రదాయ సొగసులకి ఆధునిక సొబగులు అద్ది నయా ట్రెండ్‌కి స్వాగతం పలుకుతున్నారు. అవే ఇండో వెస్ట్రన్ బ్లవుజులు.

06/14/2018 - 00:25

‘‘ముదితల్ నేర్వగరాని విద్యగలదే! ముద్దార నేర్పించినన్’’ అంటూ ప్రతి మహిళా సభలోనూ వక్తలు నొక్కి వక్కాణించే పద్యపాదం చిలకమర్తి లక్ష్మనరసింహం (1867-1946)గారు రచించిన ‘నరకాసురవధ’ అను ప్రసన్న యాదవము అనే నాటకంలోనిది.

Pages