S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

07/01/2016 - 21:07

తాజా కూరగాయల్లో ఎన్నో విలువైన పోషకాలుంటాయి. వాటిని ఆరగించటానికి అనువుగా పసందైన రుచులలో వండుకుంటాం. వండడంవల్ల ఆహార పదార్థాలకు రుచి, సువాసన కలుగుతాయి. అలాగే కంటికి ఇంపుగా కనబడతాయి. జీర్ణం చేసుకోవడం తేలికవుతుంది.

,
06/30/2016 - 21:58

సర్జరీ చేసేందుకు వెళుతున్న ఆ వైద్యుడిని రోగి తండ్రి అడ్డగించి ‘‘మీరు ఇంత ఆలస్యంగానా వచ్చేది? నా కుమారుడి స్థానం లో మీ కుమారుడు ఉంటే ఇలాగే వస్తారా? పేషెం ట్ అపాయకర పరిస్థితిలో ఉన్నాడని తెలిసి కూడా ఇలా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తారా?’’ అని నిలదీశాడు. ఆ రోగి తండ్రిని ఆ వైద్యుడి సముదాయిస్తూ..‘‘నేను ఆసుపత్రిలో లేను. అప్పటికీ కబురు అందిన వెంటనే వేగంగా బయలుదేరాను.

06/29/2016 - 23:05

అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగినవాడు వెనకడుగు వేయడమే ఉండదని అంటోంది తిరుచికి చెందిన ఆశా సుల్తానా. చిన్నపాటి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకు వచ్చే భర్త ఆల్‌జఫర్ ఇంటి అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని అనుక్షణం వేధిస్తూ ఉండేవి. ఆ సమయంలో తాను కూడా ఏదో ఒకటి చేసి భర్తకి అండగా నిలవాలని సుల్తానా అనుకుంది.

06/28/2016 - 21:03

బంగారు తల్లికి ఎంత కష్టం వచ్చింది. చెంగు చెంగున లేడిపిల్లలా ఎగరాల్సిన వయసులో వేటకుక్కల్లాంటి మృగాల వేటకు బలవుతోంది. అడుగు పెడితే చాలు మాటు వేసి కాటు వేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఆడపిల్లలు కామాగ్నికి బలవుతున్నారు. ఆడపిల్ల అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. ఎన్నడూ లేనివిధంగా ఆడపిల్లల అక్రమ రవాణా 65శాతం పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్సు బ్యూరో తెలియజేస్తోంది.

,
06/26/2016 - 00:05

ఆవకాయ తిన్నప్పుడు ఆ కారానికి మనకు మంట పుడితేనే చాలా బాధగా ఉంటుంది. ముద్ద పప్పు తిన్నా మంట కలిగే వారి జీవితాలు ఇంకెంత బాధాకరంగా వుంటాయో ఊహించుకోండి. మజ్జిగ అన్నం తిన్నా మంట/నొప్పి పెట్టేవారికి తినాలంటేనే భయం వేస్తుంది, బ్రతకాలంటేనే బాధేస్తుంది. చాలామంది ఆ మంటకి భయపడి తిండి మానేసి నీరసంతో మంచాన పడతారనడంలో ఏ అతిశయోక్తి లేదు. అసలు ఈ మంట కలగడానికి గల కారణాలేంటో చూద్దాం.

06/24/2016 - 22:09

ఒంటిపై కిరోసిన్ వాసన గుప్పుమని కొడుతుంది. ఒక్కొక్క అగ్గిపుల్ల గీస్తుంది. పారేస్తుంది. ఆఖరి అగ్గిపుల్లకు వచ్చేసింది. ఆలోచనల నుంచి బయటపడి మండే ఆఖరి అగ్గిపుల్లను ఒంటిపై వేసుకుంది. నాలుకలు చాస్తూ ఒంటిని ఆక్రమించిన మంటలకు తాళలేక బాత్‌రూమ్‌లో నుంచి ఒక్కసారిగా బెడ్‌రూమ్‌లోకి పరుగెత్తుకు వచ్చింది. ఆ తరువాత కళ్లు తెరిచి చూసే సరికి ఆసుపత్రి బెడ్‌పై ఉంది.

,
06/23/2016 - 22:58

ఫొటోగ్రఫీలో ఎలాంటి కోర్సు చేయలేదు. ఎవరి వద్ద శిక్షణ కూడా తీసుకోలేదు. పొటోలను తీయటంలో సిద్ధహస్తుడు కాదు. కేవలం తాను నడిచే వీధిలో కనిపించే అందమైన ఇళ్లను, పేదల జీవన దృశ్యాలను సెల్ కెమెరాలో బంధించి, ఆ ఫొటోలను ఇంకా బాగా ఎలా తీయవచ్చో అని తపించే మనస్తత్వమే ఆతడ్ని నేడు ప్రపంచ ప్రసిద్ధ ఫొటోగ్రాఫర్‌గా తీర్చిదిద్దింది.

06/23/2016 - 03:26

బోసుబాల్‌తో అరగంట సేపు ఆడుకుంటే ఉబకాయం అనే మాటే ఉండదు. ఆహార నిపుణుల సూచనలు పాటిస్తూ.. క్రమం తప్పకుండా ఈ బోసుబాల్‌తో వ్యాయామం చేస్తే మీ శారీరక ఆరోగ్యానికి దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది. ప్రతిరోజూ దీనితో అరగంట పాటు వ్యాయామం చేస్తే చాలు ఫిట్‌నెస్ మీ సొంతమవుతోంది. శరీరంలో పేరుకుపోయిన అధిక క్యాలరీలు తగ్గిపోతాయి. గుండె సాధారణరీతిలో స్పందిస్తుంటుంది.

06/21/2016 - 21:27

పల్లవి పెళ్లి చాలా సింపుల్‌గా ఓ గుడిలో
సంప్రదాయం ప్రకారం చేసుకుంది.
ఎందుకంటే గుడిలో పెళ్లి చేసుకోవడం ద్వారా మిగిలిన డబ్బుతో ముగ్గురు
పేద పిల్లలను చదివిస్తున్నారు.
ఈ ముగ్గురు కూడా మూడు మతాలకు సంబంధించిన వారు
కావటం గమనార్హం.పల్లవి పెళ్లి చాలా సింపుల్‌గా ఓ గుడిలో
సంప్రదాయం ప్రకారం చేసుకుంది.

06/19/2016 - 04:27

......................
అమ్మ పరిచయం చేసిన మొదటి వ్యక్తి నాన్న. నాన్నంటే
నడిపించే వాహనం. నాన్నంటే నడిచొచ్చే దైవం.
బిడ్డ పుట్టుకకు హేతువై విద్యాబుద్ధులు నేర్పటంలో గురువై, వారి అభివృద్ధికోసం అహర్నిశలూ శ్రమించే సైనికుడే నాన్న. తనకంటే తన బిడ్డను గొప్పవాడిగా తీర్చిదిద్దేందుకు తన భుజాలను ఆసరాగా యిచ్చి ఎత్తుకి ఎదగాలని కోరుకునే
గొప్ప వ్యక్తిత్వం గలవాడు నాన్న.

Pages