S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

04/11/2017 - 22:32

తాను ఎదుగుతూ.. తన చుట్టూ ఉన్నవారి కోసం ఆలోచించేవారు కొంతమంది మాత్రమే ఉంటారు. ఇటువంటి కోవకు చెందినవారు త్రిషీతా తేజ్. స్ర్తికి స్ర్తినే శత్రువు అనే నానుడ్ని ఒమ్ము చేస్తూ సాటి స్ర్తి సాధికారత కోసం కృషిచేస్తున్నారు. నేను చేయగలను అనే ధీమాతో ఆమె వేసిన ముందడుగులో నేడు ఎంతో మంది అతివలు అడుగులు వేస్తున్నారు.

04/08/2017 - 21:19

వేసవిలో భానుడి కిరణాలను ముద్దాడాలనుకుంటున్నారా? ఆకాశాన్నంటే ఎత్తయిన దేవదారు వృక్షాల మధ్య..కొండాకోనల్లో జలజలపారే సెలయేళ్ల సవ్వడి వింటూ..పచ్చని లోయలు.. యాపిల్ తోటల మధ్య వేసవి వినోదాన్ని సొంతం చేసుకోవాలంటే
చల్ల చల్లని కాశ్మీర్‌ను చుట్టేయటానికి సిద్ధమవ్వండి.

04/08/2017 - 00:11

వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే ఖద్దరు, కాటన్ వస్త్రాలకు గిరాకీ అంతా ఇంతా కాదు. పవర్ స్టార్ పవన్‌కల్యాణ్, అందాల సమంత కాటన్ వ్రస్తా లకు అంబా సిడర్లుగా మారటంతో వీటి హవా,హంగు అందానికి మెరుగులుదిద్దుతుంది.స్వాతంత్రోద్యమంలో విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం చేపట్టడం ద్వారా స్వదేశీ ఖాదీ వస్త్రాల విలువను చాటారు. అప్పట్లో మగ్గాలపై నేతనేసే ఈ వస్త్రాలు.. ఇప్పుడు యంత్రాలపైనా తయారవుతున్నాయి.

04/06/2017 - 21:37

సేవ చేయాలనే తపన చాలామందికి ఉంటుంది. అందుకవసరమైన వేదిక, మార్గం లభించదు. దీంతో తమలోని పరోపకార గుణాన్ని తమలోనే దాచేసుకుంటారు. అటువంటివారికి ఫుయల్ ఏ డ్రీమ్ మార్గం చూపుతుంది. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ ఆన్‌లైన్‌లో సోషల్ సర్వీసు చేస్తోంది. ఎన్జీఓ సంస్థలనూ భాగస్వామ్యం చేస్తుంది. గత పదహారేళ్లుగా ఎన్నో సామాజిక కార్యక్రమాలకు చేయుతనిస్తున్న ఫూయల్ ఏ డ్రీమ్‌ను స్థాపించింది తోట రంగనాథ్.

04/06/2017 - 21:36

దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా ఇప్పటికీ బల్బు ఎలా వుంటుందో తెలియని అడవిబిడ్డలు ఎందరో ఉన్నారు. పొద్దుగూకగానే చిమ్మచీకటిలో ముడుచుకుంటారు. ఇలాంటి పల్లెలు విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో ఎన్నో ఉన్నాయి. ఒడిశాకు ఆనుకుని ఉండే ఈ మండలంలో గ్రామాలన్నీ చాలా చిన్నవి. అక్కడో ఊరు..ఇక్కడో ఊరు అనట్లు విసరేసినట్లు ఉంటాయి. అక్కడో ఊరు...అక్కడో ఊరు.. మధ్యలో అడవి. బండలమీద కమ్మగా పారే సెలయేళ్లు.

04/06/2017 - 21:34

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్నప్పటికీ ఈ సంస్థ కార్యకలాపాలు ఒక్క కర్నాటకకే పరిమితం కాలేదు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా వంటి రాష్ట్రాలకు సైతం విస్తరించాయి. ‘ఏ గోడ కూడా ఎత్తయింది కాదు’ అనే ప్రాజెక్టుతో ఇటీవలనే బెంగళూరులో పనె్నండు లక్షలు రూపాయలు ఖర్చుచేసి 1500 మంది పేద పిల్లలకు సంగీతం నేర్పించింది.

04/06/2017 - 04:42

హైదరాబాద్ కుర్రాళ్లవేదిక యువ రచయితలకు
ఆర్థిక అవకాశాలు ఆన్‌లైన్ సాహిత్య సంపుటి కహానియా

04/04/2017 - 21:27

నేడు శ్రీరామ నవమి పర్వదినం. యావత్ దేశంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇల్లు, వీధి, వాడ, పట్టణం, నగరం శ్రీరామ నామ స్మరణతో ప్రతిధ్వనిస్తాయి. అందుకే రామాలయం లేని ఊరు కానరాదు. వసంతరుతువులో చైత్రమాసం నవమినాడు సకల గుణాభిరాముడు ఈ భువిపైకి అరుదెంచారు. విద్యార్థిగా, రాజుగా, తండ్రి మాటను జవదాటని తనయునిగా, సీతానే్వషణలో ఆ మహనీయుడు ప్రదర్శించే వ్యక్తిత్వం ఆదర్శనీయం. ఆచరణీయం.

04/01/2017 - 21:28

తొంభై ఏళ్ల ముసలోళ్ల దగ్గర నుంచి, పుట్టిన పిల్లాడికి సైతం ఆసక్తి కలిగించే ఏకైక హీరో సూపర్‌మేన్ ఒక్కడే. తనకున్న అపూర్వ శక్తులతో అద్భుత సాహసాలు చేసే ఈ సూపర్‌మేన్ తన గ్రహాంతరవాసులను రక్షిస్తాడు. అలాగే హైదరాబాద్ నగరంలోని జంతువులకు ఓ సూపర్‌మేన్ ఉన్నాడు. అతనే ప్రదీప్ నాయర్. కాకపోతే ఈ నాయర్ వద్ద అద్భుత శక్తులు లేవుగానీ ప్రేమ, మానవత్వం దాగున్నాయి.

03/31/2017 - 22:39

ఆమె జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఎన్నో కష్టాల్ని, బాధల్ని అనుభవించింది. అయితే విఫలమైన ప్రతిసారి నిలదొక్కుకుంది. ఎదురైన ఎన్నో అవమానాలను అధిగమించి నేడు అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమే చీలు చంద్రన్. డీబాక్స్ వ్యవస్థాపకురాలిగా మారి తనలా కృంగిపోయినవాళ్లలో ఆత్మస్థయిర్యం నింపటాన్ని తన కర్తవ్యంగా మలచుకున్నారు.
డీబాక్స్ వ్యవస్థాపకురాలు

Pages