S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

03/30/2017 - 22:56

‘‘మేడంటే మేడాకాదు గూడం టే గూడూ కాదు పదిలంగా అల్లూకున్న పొదరిల్లూ మీది’’ అంటూ మరిచిపోతున్న పల్లె సొగసులను ప్రతిష్టిస్తున్నారు ఈ జంట. ప్రపంచమంతా కాం క్రీట్ జంగిల్‌గా మారుతున్న తరుణంలో మూడు లక్షలకే పొదరిల్లును అల్లిపెడతామని ముందుకు వస్తున్నారు అరుణ, ప్రశాంత్ జంట. హైదరాబాద్‌లో బాంబూ హౌజ్ ఆఫ్ ఇండియా పేరుతో సంస్థను ఏర్పాటుచేసి వెదురుతో ఇల్లు కట్టిపెడతారు.

03/30/2017 - 07:59

కరడుగట్టిన నేరస్థులకు కళాప్రదర్శనల్లో శిక్షణ
పరివర్తన తెస్తున్న ప్రముఖ కళాకారిణి అలకానంద రాయ్

36 ఏళ్ల వయసులో వైధవ్యం ప్రాప్తించినా విధిరాతకు చింతించలేదు అలకానంద రాయ్. తాను ప్రాణపందంగా భావించే నాట్యంతో నేరస్థుల్లో మానసికంగా మార్పు తీసుకువస్తూ తన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మహిళా ఖైదీలతో పాటు ఉండే పిల్లల చదువుకోసం ఫండ్స్ సేకరిస్తూ వారికి తల్లయ్యారు.

03/28/2017 - 22:20

ఆయన ఒక అనాథ. రైల్వే స్టేషన్లు, రైళ్లలో చెత్త ఏరడం, పాల ప్యాకెట్లు విక్రయిస్తూ ఉండేవారు. ఒక సేవాసదన్ సహాయంతో ఉన్నత స్థితికి ఎదిగాడు. తన మాదిరిగా ఉన్న అనాథలకు స్ఫూర్తి కలిగించే విధంగా, తన ఆత్మకథను పుస్తక రూపంలో తీసుకువచ్చాడు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వినూత్న తరహాలో ముంబాయిలో ఒక హోటల్‌ను ప్రారంభించాడు. హోటల్‌లో తాను పెరిగిన అనాథ ఆశ్రమంలోని 19 మందిని నియమించాడు.

03/28/2017 - 00:28

కాలము అనంతం, అప్రమేయం. అపరిమితమైన కాలంలో పరిమితమైనది మానవ జీవితం. మానవ జీవితమే కాలస్వరూపం. సూర్యోదయ, సూర్యాస్తమయం మధ్య మనిషి వయస్సు పెరుగుతుంది, ఆయుష్షు తగ్గుతుంది. వయస్సు అందరికీ పెరుగుతుంది. ఆ వయస్సు సార్థకం అయ్యేదీ, వయస్సుతో పాటు వ్యక్తిత్వం పెరిగేదీ కాల ప్రాముఖ్యాన్ని గుర్తెరిగి, కాలాన్ని సద్వినియోగపరచుకుంటేనే. కాల సంబంధిత పండుగ ‘ఉగాది’.
వసంత ఋతువు - ఋతు ధర్మములు

03/25/2017 - 22:08

భారతీయ సంస్కృతిలో మహిళల కట్టూబొట్టుకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంత కాదు. చీరకట్టులో సంస్కారంతో పాటు అందమూ ఉట్టిపడుతుంది. ఆధునిక పోకడల్లో కొంతకాలంపాటు చీర కళాకాంతులు కోల్పోయినా ఇటీవలి కాలంలో మళ్లీ ఆదరణ పెరిగింది. సినీతారలు, రాజకీయ నాయకులు చీరలంటే మోజు చూపుతున్నారు. ఆధునిక వస్త్రాల రూపకల్పనతో రాజ్యమేలుతున్న మేటి డిజైనర్లు కూడా చీరలకు విశేష ప్రాధాన్యం ఇస్తున్నారు.

03/24/2017 - 21:30

మగువ సిగలో ఎన్ని రకాల పువ్వులు ఒదిగినా మల్లెపువ్వు ముందు దిగదుడుపే. వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంటా మల్లెపూల వాన కురుస్తుంది. మల్లెపూల వాసన చూస్తే లయతప్పని గుండె ఉండదు. ప్రతి మగువని దాసోహం చేసే మల్లెపూలను తమిళనాడులోని మదురైలో కేవలం పుష్పంగానే పరిగణించరు. సమకాలీన సంస్కృతిలో భాగంగా చూస్తారు. మల్లెపూలు పెట్టుకోవటం అదృష్టంగా భావిస్తారు.

03/23/2017 - 22:41

ఇంటినిండా కార్లు..
తండ్రి పెద్ద ఉద్యోగి..
డబ్బుకు కొదువలేదు..
కానీ... స్కూలుకు నడిచేవెళ్లాలి..
నాన్న చేసిన అలవాటది..
తనకూ అదే ఇష్టం...
అది చిన్నప్పటి మాట..
అంత పద్ధతిగా పెరిగిన శుక్లాబోస్ పెద్దయ్యాక ఊరికే ఉంటారా?
చిన్నప్పుడే మొదలైన పరివర్తన...‘పరిక్రమ’కు దారితీసింది..

03/23/2017 - 01:22

తమిళనాడులో జయలలితమ్మ లేదు గానీ, ఆమె 2013 నుంచీ మొదలుపెట్టి అమలు చేస్తున్న అమ్మ క్యాంటీన్లు దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉన్నాయి. శుచిగా పుష్టికరంగా అతి స్వల్ప ధరలకే వండి వడ్డించే సాంబార్ సాదం తైర్ సాదం, ఇడ్లీ, వడై, సాంబర్‌ల లాంటి ఆహార పదార్థాలు పేదలకి లభిస్తున్నాయి.

03/21/2017 - 22:38

గొల్లభామ... ఈ పేరు వింటే సిద్దిపేట గుర్తుకువస్తుంది...

03/19/2017 - 07:11

-ఇండియన్ ఐడల్ జూనియర్స్ రన్నరప్ నహిద్
-ఫత్వాలకు బెదరిపోనంటున్న గాయని

Pages