S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

12/17/2015 - 01:56

ఇరవై ఏళ్ల వర్షారాణికి ఒకప్పుడు నలుగురిలో తిరగాలంటేనే మితిమీరిన మొహమాటం.. బడికి వెళ్లాలంటేనే ఎంతో బిడియం.. అలాంటిది ఇపుడు ఆమె అందరిలో చలాకీగా తిరుగుతూ నవ్వుతూ కనిపిస్తుంది.. బాక్సింగ్ క్రీడ తన జీవితాన్ని మార్చేసిందని, తాను ఇపుడు ఎంతో శక్తిమంతురాలినని ఆమె ధైర్యంగా చెబుతోంది.. ఆత్మవిశ్వాసం పెరగడంతో అటు ఆటలో, ఇటు చదువులో దూసుకుపోతున్నానని ఎంతో సంతోషంగా అంటోంది..
***

12/15/2015 - 22:46

ఆ సంఘటన ఆసేతుహిమాచలం మహిళల్ని కదిలించి వేసింది.. పల్లెలు, పట్టణాలనే తేడాలేకుండా నారీలోకం
నిరసన గళం విప్పి కదం తొక్కింది.. ఆందోళన కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడడంతో కేంద్ర ప్రభుత్వం జడత్వాన్ని

12/15/2015 - 01:51

పప్పులు, కూరలు, పండ్లు, నూనెలు, ఉల్లిపాయలు, బియ్యం... ఇలా నిత్యావసర సరకుల ధరలన్నీ ఇపుడు కొండెక్కి కూర్చోవడంతో పేద, మధ్య తరగతి వారు కడుపునిండా తృప్తిగా భోజనం చేసే పరిస్థితులు కనిపించడం లేదు. బతుకుబండికి అవసరమైన తిండి విషయంలో నేడు ఒకటికి పదిసార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. అధికధరలకు జడిసి అరకొరగా కొంటు న్న ఆహార పదార్థాలతో శరీరానికి అవసరమైన పోషకాలు లభించని దుస్థితి నేడు నెలకొంది.

12/12/2015 - 21:52

అవిభక్త మద్రాసు రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో ఉన్న ఉన్నత పాఠశాలలు మరి ఏ ఇతర భాషా ప్రాంతాలలోనూ లేవని చెప్పుకునేవారు విద్యారంగ ప్రముఖులు. ‘అది గొప్ప తెలుంగునాడునన్’. అఖిల భారతదేశంలోనే మహా వైభవోపేతంగా శివరాత్రి ఉత్సవం జరుపుకునే పది దివ్య క్షేత్రాలు పేర్కొనవలసి వస్తే మా త్రికూటేశ్వరగిరి అందులో తప్పక ఉంటుంది. జనప్రియంగా కోటప్పకొండ తిరునాళ్లు అని మా పరగణా అంతా చెప్పుకొని మురిసిపోతుంటారు మా జిల్లావారు.

12/11/2015 - 22:24

పిల్లలు అనగానే టీవీలో ఎపుడూ కార్టూన్ నెట్‌వర్క్ చూడటం, వీడియో గేమ్స్ ఆడటం, పేరెంట్స్ తిడతారన్న ఒత్తిడికి లోనై చదవడం.. వంటివి మనకు వెంటనే గుర్తుకొస్తాయి. అయితే, ఆ కుర్రాడు మాత్రం ఇందుకు పూర్తిగా విభిన్నంగా కనిపిస్తాడు. పేదవర్గాలకు చెందిన తన వయసు చిన్నారులకు పాఠాలు చెబుతూ ‘టీచర్ అవతారం’ ఎత్తుతూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

12/10/2015 - 03:46

ఒక ఆలోచన లక్షలాది రైతు కుటుంబాల తలరాతను మార్చివేసింది. ఆ వజ్ర సంకల్పం ముక్త్యాల సంస్థానాధిపతులు రాజా రామగోపాల కృష్ణమహేశ్వరప్రసాద్ (ముక్త్యాల రాజా)ది. ముక్త్యాల కోట కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు పది కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున ఉంది. ఆ కోట నదికి ఎత్తయిన ప్రదేశంలో ఉంది. కోటలోనుంచి చూస్తుంటే- చాలా లోతులో కృష్ణానది ప్రవహిస్తూ కనిపిస్తుంది.

12/08/2015 - 21:36

‘ఈ కాలపు యువత స్వేఛ్చను కోరుకుంటోంది.. సవాళ్లను ఎదుర్కొంటూ గెలుపుతీరానికి చేరుకోవడంలోనే నిజమైన ఆత్మసంతృప్తి ఉంటుంది.. పెద్దల అనుభవాలను స్ఫూర్తిగా తీసుకుంటే నేటి కుర్రకారుకు అసాధ్యం అంటూ లేదు..’ అని ఆమె చెబుతుంటారు. వ్యాపారరంగంలో కుటుంబ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆమె ఇపుడు అంతర్జాతీయ స్థాయిలో మన దేశానికి వనె్న తెచ్చారు.

12/07/2015 - 22:30

గళం విప్పుతున్న పురుష హక్కుల సంఘాలు

12/06/2015 - 07:23

ఆమె- ఉమ్మడి కుటుంబాల వద్దకు వెళుతుంది.. చిన్నాపెద్దా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తుంది.. లేడీస్ హాస్టల్‌కు వెళ్లి అక్కడి టీనేజీ అమ్మాయిలతో కబుర్లు చెప్పి వాళ్ల ఇష్టాయిష్టాల గురించి ఆరా తీస్తుంది.. రోడ్డుపక్కన నిలబడి కాలక్షేపం చేసే యువకులను కలిసి వారితో సరదాగా మాట్లాడుతుంది.. విలక్షణమైన హెయిర్ స్టయిల్, అలరించే హావభావాలు, మాటల గారడీతో ఆమె అందరినీ ఇట్టే కట్టిపడేస్తుంది..

12/05/2015 - 05:44

మన దేశంలో పెళ్లి సంబరం అంటే చాలు- ఆర్భాటాలకు, అనవసర ఖర్చులకు అంతూ పొంతూ ఉండదు. పలురకాల వంటకాలకు, సినిమా సెట్టింగ్‌లను తలపించే కల్యాణ మండపాలకు మంచినీళ్ల ప్రాయంగా డబ్బు వెచ్చిస్తుంటారు. పెళ్లి వేడుకలో ఆర్భాటాలు లేకుంటే అది తమ హోదాకు తక్కువని భావిస్తూ అప్పు చేసి మరీ లక్షలాది రూపాయలు ఖర్చు చేయడం ఆనవాయితీగా మారింది. సంపన్న వర్గాల్లో అయితే ఇది మరీ వేలం వెర్రిగా ఉంటుంది.

Pages