S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

02/23/2017 - 22:18

భోళా శంకరుడికి జేజేలు పలుకుతోంది త్రిలింగ క్షేత్రం. తెలుగునేలపై అడుగడుగునా దర్శనమిచ్చే శైవక్షేత్రాలకు మహాశివరాత్రి శోభ వచ్చేసింది. శివభక్తుల నోట పంచాక్షరి మంత్రం జపమై వినిపిస్తోంది. భక్తితో ఉపవాసం చేసి, జాగరణతో లింగోద్భవాన్ని, కల్యాణాన్ని చూసి తరించేందుకు అంతా సిద్ధమయ్యారు. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం ఇప్పటికే ఉత్సవశోభను సంతరించుకుంది.

02/23/2017 - 05:44

ఇటీవల జరిగిన లాక్మీ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఈ ముగ్గురు అమ్మాయిలు సంచలనం సృష్టించారు. వీరు పుట్టి పెరిగింది గ్రామీణ ప్రాంతాల్లో. చదివింది ఏడవ తరగతి లోపే. ఫ్యాషన్ డిజైనింగ్‌లో కనీసం పట్టా కూడా లేదు. కట్టుబాట్లు, ఆచారాల మధ్య సహజీవనం చేస్తూనే పొట్టకూటి కోసం నేర్చుకున్న చేతవృత్తి పనిలో చూపిన ప్రతిభ వీరిని అంతర్జాతీయ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టేలా చేసింది.

02/21/2017 - 22:13

సైన్యంలో పనిచేసే భర్త.. అందమైన కాశ్మీర్..
నిత్యం గర్వపడుతూండేది...
దేశం కోసం చక్కటి బాధ్యత నిర్వహిస్తున్నామని...
ఇంతలో జీవితంలో అనుకోని మలుపు... ఓ పెద్ద కుదుపు..
అంతా బాగానే ఉందనుకున్న వేళ.. ఉగ్రవాదులు తెగబడ్డారు...

02/18/2017 - 21:26

మానవ త్వానికి కన్నా విలువైంది లేదని తల్లిదండ్రులు చెప్పారు. చిన్నప్పటి నుంచి పేద, అర్హులైన అభ్యర్థులను చూశాను. వారికి రిజర్వేషన్లు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలుసు. అదే సమయంలో ధనవంతుల పిల్లల తల్లిదండ్రులు ఈ రిజర్వేషన్లను అవకాశంగా తీసుకుని లబ్ధిపొందుతున్న విషయం తెలుసు. ఆత్మవంచన చేసుకోదలచుకోలేదు. అందుకే రిజర్వేషన్లు నాకు వర్తింపజేయవద్దని వేడుకున్నాను.
-డిన్‌చెంగ్‌ఫా బారువా

02/17/2017 - 22:42

కికెట్ అంటే వారికి ఇష్టం..
మరోమాటలో చెప్పాలంటే ఆ ఆటంటే పిచ్చి..
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలన్న భావన వారిది...
ఇది చిన్నప్పటి నుంచి వచ్చిన లక్షణం...
కాకపోతే డబ్బులేదు...
పేదరికం ఆట వద్దంది..
మనసు ఆడి తీరాలంది..
అదే ఆటలో గాయాలపాలై
కంటిచూపు పోయింది...
కానీ వారి దృష్టి అంతా క్రికెట్‌పైనే..

02/16/2017 - 23:58

చెరగని చిరునవ్వు.. కలనేత చీర.. సంప్రదాయమైన కట్టూబొట్టూ.. తలలో నిండుగా పూలు.. ఆమె ఆషామాషీ వ్యక్తేం కాదు... సింపుల్‌గా కనిపిస్తున్నా దేశంలో పేరెన్నికగన్న సామాజికవేత్త. ఆమె మాటలు సూటిగా ఉంటాయి. అందులో తన విలువైన సమయాన్ని కాపాడుకునే ఆరాటం కనిపిస్తుంది. ఎదుటివారి ఆలోచనలు పసిగట్టి చెప్పే మృదువైన జవాబులుంటాయి. ఆ మాటలు, జవాబుల్లో తాత్విక ధోరణి తొంగి చూస్తుంది.

02/15/2017 - 21:17

ఆడపిల్లకు నీడలా వెంటాడే నెలసరి బాధ. ఈ సమస్యకు సరైన పరిష్కారం చూపాలనుకున్నాడు అరుణాచలం మురుగునాథ్. ఇందుకోసం ఇరవై ఏళ్ల నుంచి అరుపెరగకుండా శ్రమిస్తున్నాడు. అవసరమైతే ఎద్దుల బండిలో ప్రయాణిస్తాడు. గాడిదలు, ఎద్దులు మీద సైతం వెళతాడు. తాను చేరాలనుకున్న మారుమూల గ్రామానికి వెళ్లటానికి ఇలాంటి కష్టాన్ని ఎంతైనా భరిస్తాడు. మనసులో దృఢంగా నాటుకున్న అతని ప్రయత్నం గ్రామీణ మహిళ హితం.

02/14/2017 - 23:05

లిఖితా భాను బయోటెక్నాలజీ ఇంజినీర్. హైదరాబాద్‌కు చెందిన ఈ యువ ఇంజినీర్ నాలుగువేల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారంలో దూసుకుపోతుంది. తన వ్యాపారంలో రైతులను భాగస్వామ్యులను చేసి నాణ్యమైన, పోషకవిలువలతో కూడిన ఆహారాన్ని ప్రజల నోటికి అందించే సామాజిక బాధ్యతతో ముందుకు వెళుతోంది. వ్యవసాయ కుటుంబ నేపథ్యంకాకపోయినా పంటలపై ఆమెకున్న పరిజ్ఞానం ఆపారం.

02/11/2017 - 23:00

సాధికారతే లక్ష్యంగా విజయవాడ వేదికగా మొదలైన జాతీయ మహిళా పార్లమెంట్ రెండోరోజూ ఉత్సాహంగా కొనసాగింది. దేశంలోని వివిధ ప్రాంతాలు, వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు గళం విప్పారు. తాము ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నది, వాటిని ఎలా అధిగమించారో వివరిస్తూ యువతులకు మార్గనిర్దేశం చేశారు. స్ఫూర్తి రగిలించారు. విద్య, కుటుంబం, సమాజం తోడ్పాటు ఎంత అవసరమో స్వానుభవాలను వివరించారు.

02/11/2017 - 22:57

ఏ రంగంలోనైనా అవకాశాలను దొరకబుచ్చుకోవాలి. ఏ చిన్న అవకాశాన్ని వదులుకోరాదు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక మహిళలకు అవకాశాలు పెరిగాయి. ప్రాధాన్యమూ పెరిగింది. మహిళా సాధికారత మా కుటుంబంలో ఎప్పటి నుంచే సాకారమైంది. సమాజంలో అలాంటి పరిస్థితులు లేవు. మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. పురుషులకు దీటుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

Pages