S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

02/11/2017 - 22:56

మహిళల అన్ని రంగాల్లో రాణించాలంటే వారికి వారుగా ఆలోచించగలిగి, నిర్ణయాలు తీసుకోగలిగి ఉండాలి. వాటిని ధైర్యంగా అమలు చేయగలగాలి. అలా చేయాలంటే కుటుంబం తోడుగా నిలవాలి. తన విషయంలో తల్లిదండ్రులు అలా నిలబడటం వల్లే ఇవాళ ఈ స్థాయికి చేరుకోగలిగాను. ఆడమగ భేదం లేకుండా పిల్లల్ని సాకడం, ప్రోత్సహించడం చేస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. నైతిక విలువలతో కూడిన విద్య అందిస్తే మహిళలు చక్కటి ఫలితాలు సాధించగలరు.

02/11/2017 - 22:54

మహిళలకు సాధికారత ఇంటినుంచే మొదలవ్వాలి. సొంతంగా నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి రావాలి. కేవలం రాజకీయ రంగంలోనే సాధికారత చాలదు. సేవలు, విద్య ఇలా అన్ని రంగాలపై మహిళలు జయకేతనం ఎగురవేయాలి. తన తండ్రి కేంద్రమం త్రి అయినప్పటికీ విద్యాసంస్థల నిర్వహణపై దృష్టిసారించా. మా విద్యాసంస్థలో బాలుర సంఖ్యకు సమానం గా బాలికల సంఖ్య ఉండేలా చూస్తా. అవకాశాలు, ప్రా ధాన్యాలూ అంతే.

02/11/2017 - 22:46

ఇల్లు, సమాజం నుంచి ఎంత ప్రోత్సాహం లభిస్తే అంత తొందరగా, దూకుడుగా మహిళలు అభివృద్ధి పథంలో దూసుకుపోతారు. విద్య అందించే విషయంలో వివక్ష ఉండకూడదు. ఆడపిల్లల్ని చదువు మధ్యలో ఆపేయకూడదు. పెళ్లి తరువాత చాలామంది చదు వు ఆపేస్తారు. అలాంటివి మానేయాలి. యువతుల అభిరుచికి తగ్గట్లు ప్రోత్సహించాలి. అప్పుడే వారిలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది.

02/11/2017 - 22:45

అందమైన లోకం లో ఇలా మన కు జన్మనిచ్చిన తల్లికి వం దనం. దేశంలో చాలా ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయి. మహిళల పరిస్థితికూడా అంతే. సాధికారత సాధ్యమవ్వాలంటే విద్య అవసరం. ఇలాంటి సదస్సులు స్ఫూర్తిని రగిలిస్తాయి. ఈ బృహత్తర కార్యక్రమం ఏటా కొనసాగాలి. మరుసటి సదస్సు జమ్మూకాశ్మీర్‌లో జరిగితే ఎంతో ఆనందంగా ఉంటుంది. సదస్సుల్లో తెలుసుకున్న విషయాలను జీవితంలో అనుసరించేందుకు ప్రయత్నిస్తే కొంత మేలు జరుగుతుంది.

02/11/2017 - 22:43

మహిళా సాధికారతకోసం ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు ఐక్యరాజ్య సమితి (యు ఎన్) సిద్ధంగా ఉంది. ఈమేరకు ఒప్పం దం కూడా కుదిరింది. లింగవివక్ష లేకుండా చూడ టం, అందరికీ విద్య అందించడం, బాలికలు, మహిళలపై దాడుల నియంత్రణ, కనీస సదుపాయాల కల్పన వంటి ఐదు అంశాలపై కలసి పనిచేసేందుకు ఎమ్‌ఒయు కుదుర్చుకున్నాం. ఇలాంటి సదస్సులు మరెన్నో నిర్వహిస్తాం.
- ఆశ టొర్కిల్సన్, డిప్యూటి రిప్రజెంటేటివ్,

02/11/2017 - 22:41

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఏ రంగంలోనూ వారు పురుషులకన్నా తక్కువకాదు. అసలు మగవారికన్నా తక్కువ వారమనే అభిప్రాయం తప్పు. ఆ ఆలోచనరీతిలో మార్పు రావాలి. ఆత్మవిశ్వాసంతో అందరికన్నా గొప్పవారమన్న భావన పెంచుకోవాలి. ఇంట్లో అందరి ప్రోత్సాహం ఉంటే సాధికార సాధ్యం. అయినా సమాజంలో ఇంకా మార్పు రావాలి. ఇప్పటికీ మహిళలపట్ల వివక్ష ఉంది. దీనిని ఎదుర్కోవాల్సి ఉంది.

02/10/2017 - 23:01

అవకాశం ఎవరూ ఇవ్వరు.. మనమే వెతుక్కోవాలి.. ముందుకు దూసుకువెళ్లాలి అంటూ మహిళా నేతలు పిలుపునిచ్చారు. విజయవాడ పవిత్ర సంగమం వద్ద తొలిసారిగా నిర్వహిస్తున్న జాతీయ మహిళా పార్లమెంటుకు పెద్దసంఖ్యలో మహిళలు హాజరయ్యారు. రాజకీయ, సినీ, పారిశ్రామిక, విద్యారంగాలకు చెందిన ప్రముఖులతోపాటు వేల సంఖ్యలో విద్యార్థినులు హాజరయ్యారు. వివిధ రంగాల్లో ఎదుగుతూ వచ్చిన మహిళలు తమ అనుభవాలను వివరిస్తే...

02/10/2017 - 23:00

సమాజంలో మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని, అదే జరిగితే ఇక వారిని అడ్డుకునే శక్తి ఏదీ ఉండదని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడి అన్నారు. వారు అనుకున్నది సాధించేందుకు అవకాశాలు ఇవ్వాలని ఆమె సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తొలి మహిళా పార్లమెంట్‌కు హాజరైన ఆమె మాట్లాడారు.

02/10/2017 - 22:58

దేశంలో మహిళలపై జరుగుతున్న యాసిడ్ దాడులను నియంత్రించాల్సిన అవసరం ఉందని స్టాప్ యాసిడ్ ఎటాక్ మిషన్ ఉద్యమకారిణి లక్ష్మీ అగర్వాల్ పిలుపునిచ్చారు. యాసిడ్ దాడి చేసేవారికి చట్టం అంటే భయం లేకుండా ఉందన్నారు. తనపై 2005 సంవత్సరంలో దాడి జరిగిందని తెలిపారు. తనను పెళ్లి చేసుకోమని ఒక యువకుడు కోరాడని, తాను తిరస్కరించడంతోతనపై యాసిడ్ దాడికి దిగాడని తెలిపారు.

02/10/2017 - 22:57

ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని వైకాపా ఎంపి బుట్టా రేణుక అన్నారు. జనాభాలో 50 శాతం మేరకు మహిళలు ఉన్నప్పటికీ 10 శాతం మాత్రమే చట్టసభలకు వెళుతున్నారని గుర్తు చేశారు. పురుషులు, మహిళల మధ్య అసమానత్వం ఎక్కువగా ఉందన్నారు. గతంలో ఈ అసమానతలను మహిళలు ఆమోదించారని, కానీ అక్షరాస్యత పెరగడంతో సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. ఫలితంగా గృహ హింస తగ్గుతోందన్నారు.

Pages