S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

01/31/2017 - 22:29

రేపటి పౌరుడు ఉత్తముడిగా వెలుగొంది, దేశ భవిష్యత్‌కు పునాది కావాలంటే అక్షర స్వీకారం తప్పనిసరి. ఇది జీవితానికి తొలి పునాదిగా చెప్పాలి. చదువు, సంస్కారం, క్రమశిక్షణ, సత్ప్రవర్తన వంటి సద్గుణాల కలయికే విద్య.

01/28/2017 - 22:25

మనది పురుషాధిక్య సమాజం. అందువల్లనే మహిళలను అరిటాకులతోను, పురుషులను ముళ్ళతోను పోల్చుతా రు. అరిటాకు వచ్చి ముల్లు మీద పడినా, ముల్లు వచ్చి అరిటాకుమీద పడినా, నష్టం జరిగేది అరిటాకుకే అనే మెట్ట వేదాంతం చెప్పడంలో మనవాళ్లు బహునేర్పరులు. ఈ మెట్ట వేదాంతాన్ని తల్లులు తమ పిల్లలకు చిరుప్రాయం నుంచే బోధించి వారి బ్రెయిన్ వాష్ చేస్తారు.

01/27/2017 - 22:10

తొమ్మిదేళ్ల వినీల ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి ఆసియాలోనే కాదు ప్రపంచంలో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు నమోదు చేసుకుంది. ఈ చిన్నారి హైదరాబాది వాసి. సాహసంగా చేసిన తన యాత్ర గురించి అడిగితే చాలు ఆ రికార్డులు గురించి నాకేమి తెలియదు. అన్నయ్య చెయ్యి పట్టుకున్నాను. అధిరోహించాను అని చెబుతుంది.

01/26/2017 - 21:46

వికసించిన పద్మాలు వీరు. విభిన్న రంగాల్లో వీరు వెదజల్లిన పరిమళం వారి ప్రతిభకు కొలమానంగా నిలిచి ఈ ఏటి మేటి పురస్కారమైన పద్మశ్రీ వరించింది. ఒకరు వైద్యంతో ప్రాణాలు పోశారు. మరొకరు యుద్ధకళలో రాటుదేలిన ధీర.. ఇంకొకరు ఛిద్రమైన జీవితాల్లో వెలుగులు నింపిన చిరుదివ్వె.. విద్యా సుగంధాలను వెదజల్లిన చదువుల తల్లి.

01/26/2017 - 21:44

తొమ్మిదేళ్ల గీత మేకప్ వేసుకుంటుంది. ఆ మేకప్ తెల్లవారుజామున రెండు గంటల వరకు ఉండాలి. రోజుకు 60 మంది కామదాహం తీర్చుతుంది. అలా చేయకపోతే వైర్లు, రాడ్లతో దెబ్బలు. కాలిన స్పూన్లతో వాతలు. ఇలాంటి చిత్రహింసలు కొనే్నళ్లు పాటు భరించింది. ఇపుడు గీత వయసు 26 ఏళ్లు. చల్లని తల్లి ఒడి చేరింది. అవును. ఆ తల్లి నేపాల్ మదర్ ధెరిసా.

01/26/2017 - 21:42

పేషెంట్లు అంటే ఆ తల్లికి ప్రాణం. మందులతో పాటు మమకారాన్ని రంగరించి వైద్యం చేసే చేతులు అవి. అందుకే 91 సంవత్సరాల వయసులోనూ ఆ చేతివైద్యం ఎందరికో పెన్నిధిగా మారింది. ఆమే భక్తియాదవ్. దేశంలోనే తొలి గైనకాలజిస్ట్. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన భక్తియాదవ్ తొ మ్మిది పదుల ముదిమి వయసూలోనూ వైద్యురాలిగా ఎంతోమందికి పురుడు పోస్తున్నారు. ప్రస్తుతం ఆమె బరువు 28 కిలోలు.

01/26/2017 - 21:40

మీనాక్షి రాఘవన్ గది నుంచి బయటకు వస్తుంటే ఓ ఆడపులి వస్తున్నట్లు భావిస్తారు. సాధారణ మహిళ వలే చీరకట్టులో ఉండే ఆమె చేతుల కు ఉండాల్సిన గాజులు స్థానం లో కత్తి, మెడలో ఆభరణాల స్థానంలో కవ చం ఉంటాయి. ఆహార్యంలో ఆమె చూపులకు ఆ విధంగా కనిపించినా చెరగని చిరునవ్వుతో కేరళలోని ప్రాచీన యుద్ధ కళ కలరియపట్టుకు ప్రాణం పోస్తున్నారు.

01/26/2017 - 05:34

మయన్మార్‌కు సమీపంలో ఉండటం, కొండ ప్రాంతం కావటం వల్ల ఇక్కడ కాపలా కాయటం సైనికులకు కత్తిమీద సాములాంటిది. అలాంటి ఈ సైనిక విభాగంలోకి 2014లో మహిళలు నియమించబడ్డారు. వీరు శిక్షణ తీసుకుని తమ సత్తా చాటుతున్నారు.

01/24/2017 - 22:57

చింతకింది మల్లేశం.. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి జిల్లా ఆలేరు మండలం, శారాజీపేట అనే ఒక మారుమూల గ్రామీణ నేతకారుడు. నిరుపేద చేనేత కుటుంబం. రోజంతా పనిచేస్తేనేకానీ రాత్రికి పళ్లెంలో నాలుగు మెతుకులు కనిపించవు. ఒక చీర ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టూ 9వేల సార్లు (12-13 కిలోమీటర్లదూరం) అటూ ఇటూ తిప్పాలి. అలా రోజుకి 18వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితేగానీ (25 కి.మీ దూరం) రెండు చీరలు తయారుకావు.

01/21/2017 - 21:21

పిల్లలు రాత్రి సమయంలో 9-10 గంటల మధ్య నిద్రపోయి ఉదయం ఐదు గంటలకు నిద్ర లేచే విధంగా అలవాటు చేయాలి. రాత్రిపూట ఎక్కువ సేపు మేల్కొని ఉండటంవలన శరీరంలో వేడి పెరిగి పలు అనారోగ్య సమస్యలు కలుగుగతాయి. అంతేకాకుండా కళ్ళ సంబంధ సమస్యలు కూడా పెరుగుతాయి. రాత్రి పూట కన్నా ఉదయం పూట మనస్సు, ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటాయి. దీనివలన, వారి బుద్ధి కూడా చురుకుగా పనిచేస్తుంది.

Pages