S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

07/27/2018 - 21:22

రెండు దశాబ్దాల క్రితం పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత, నాయకత్వపు లక్షణాలు, విభిన్న ఆలోచనాధోరణి పెంపొందించే దిశగా విద్యా విధానం వుండేది. క్రీడలు, ఆటపాటలు, వృత్తి శిక్షణ, చిత్రలేఖనం ఇత్యాది రంగాలు విద్యాభ్యాసంలో భాగమై వుండేవి. రాను రాను కార్పొరేట్ విద్యా సంస్కృతి విస్తరించి, ర్యాంకులు, మార్కుల సాధనే ధ్యేయంగా విద్యాభ్యాసం నడుస్తోంది.

07/26/2018 - 19:20

ఆమె ఓ జర్నలిస్ట్
ఆమె ఓ ఆర్జే
ఆమె ఓ వాయిస్ ఓవర్
ఆమె ఓ వ్యాపారవేత్త..

07/25/2018 - 19:57

నేటికాలంలో మహిళలు సాధికారత సాధించారు. అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఎవరు పోటికి వచ్చినా ఎందులోనూ తీసిపోము మేము అని మహిళలంతా ఆర్థిక, రాజకీయ, సామాజిక ఇలా అన్ని రంగాల్లోను కృషి చేస్తునే ఉన్నారు.

07/24/2018 - 18:47

ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ దృశ్యరూపమిచ్చిన చిత్రం మోనాలిసా. శతాబ్దాలు గడుస్తున్నప్పటికీ ఈ చిత్రం వెనుక రహస్యం ఏమిటన్నది బయట పడలేదు. అయితే ఒక్కో కోణంలో చూస్తే ఒక్కో తరహాలో కనిపించే ఆ పెయింటింగ్ వెనుకున్న మిస్టరీని ఛేదించేందుకు పురాతత్వ శాస్తవ్రేత్తలు, ఇతర విభాగాల నిపుణులు ఇప్పటికీ యత్నాలు సాగిస్తూనే ఉన్నారు.

07/23/2018 - 20:35

నేటికాలంలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నా సరే ఒకటో తేది రాగానే గాబరా పడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అంతేకాదు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు, అనారోగ్యాలు దరిచేరినప్పుడో ఇక డబ్బుల గురించి చెప్పనక్కర్లేదు. ఎన్నో భీమా సంస్థలు అనారోగ్యాలున్నవారికోసం పథకాలు తెస్తున్నాయి. కాని చాలామందికి ఇవన్నీ ఉన్నాసరే... ఏదో ఒక బాధపడేవారే ఎక్కువ మనదేశంలో.

07/22/2018 - 22:21

ప్రతి ఒక్కరూ రేపటి నుంచి ఎలాగైనా వ్యాయామం చేయాలనుకుంటారు. కానీ చేయరు. ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలను తీసుకుంటామని చెబుతారు కానీ తీసుకోరు. ఇలా ప్రతిరోజూ వ్యాయామాలను వాయిదా వేస్తూ పోతే బరువు పెరిగిపోతారు. శరీరం కదలకుండా పోతుంది. పెళ్లికి ముందు ఫిట్‌గా ఉండే ప్రతి ఒక్కరూ పెళ్లయి పిల్లలు పుట్టాక ఉద్యోగం, పిల్లలు, ఆలస్యంగా పడుకోవడం, ఆహారనియమాలు పాటించకపోవడంతో లావయిపోతారు.

07/20/2018 - 19:07

అన్నదమ్ములు పెళ్లిళ్లు చేసుకొని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ముగ్గరక్కలూ ఏదో గంతకు తగ్గ బొంత అని పెళ్లిళ్లు చేసుకొని తిప్పలు పడుతున్నారు. శైలజ అమ్మనాన్నలను చూడాల్సిన బాధ్యత మీద పడింది. ఇంటర్ చదివేకాలంలోనే కష్టాలు చవి చూడడం ఆరంభించింది. అందుకే శైలజ ఇంటర్‌తో చదువుకు పుల్‌స్టాప్ పెట్టేసి బట్టల కొట్టులో సేల్స్ గర్ల్‌గా చేరింది.

07/19/2018 - 19:29

కుపుత్రోజాయేత క్వచిదపి కుమాతా న భవతి .. అంటే ఏమిటి అనుకొంటున్నారా... ఏమీ లేదండీ.. ఎక్కడైనా మంచి కొడుకు ఉండక పోవచ్చు.. కాని చెడ్డ తల్లి మాత్రం ఉండదు అని అర్థం అండీ...
నిజమే కదా. ఈకాలంలో వీధికో వృద్ధాశ్రమాలున్నాయి అంటే చెడు అమ్మలు ఉన్నట్టా లేక చెడ్డ పిల్లలున్నట్టా చెప్పండి... సరే.. అసలు విషయానికి వద్దాం..

07/18/2018 - 19:50

పిల్లలు పుట్టిన క్షణం నుంచి ఇతరులను అనుకరిస్తుంటారు. వారికి మొదటి గురువు తల్లే. తల్లిని అనుకరించడం తల్లి మాట వినగానే నవ్వడం, కాళ్లు చేతులు ఆడించడం లాంటివి మాటలు రాని సమయంలోనే చేస్తుంటారు. అటువంటి పిల్లలు వయస్సు పెరుగుతున్న కొలది తల్లిదండ్రల నుంచి ఇరుగు పొరుగు, స్నేహితుల వల్ల వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉంటారు. ఈ వ్యక్తిత్వ నిర్మాణంలో ఉపాధ్యాయులు కూడా ప్రధాన భాగం అవుతారు.

07/17/2018 - 19:20

పాతకాలం నాడు అయితే ఉద్యోగం చేయాలనుకొన్నవారు ముందుగా ఏదొక డిగ్రీ పాస్ కావాలి. ఆ తరువాత ఉద్యోగానే్వషణలో పడేవారు. కాని నేడు అలా కాదు. అంతర్జాల మహిమతో ప్రపంచం అంతా అరచేతిలోకి వచ్చేసింది. ఎక్కడ చూసినా ఎనె్నన్నో కొత్తకొత్త విషయాలు ప్రతి నిముషమూ తెలుస్తునే ఉంటున్నాయి.

Pages