S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

01/05/2017 - 08:59

ఒక వ్యక్తిని ‘మీరు రోజూ దేవుడిని ఏమని కోరుకుంటారు అని అడిగితే...’ ఈరోజు నాకు ఏ విషయంలోను, ఎవరి ముందూ పశ్చాత్తాప పడాల్సిన అవ సరం రాకుండా చూడమని కోరుకుంటాను’అని సమాధానం చెప్పాడట. విన గానే ‘ఇదేం కోరిక’ అనిపిస్తుంది గానీ... ఆలోచిస్తే దాని వెనక అర్థం చాలా ఉంది. ఎవరైనా పశ్చాత్తాపం ఎప్పుడు పడతారు.. ఏదయి నా తప్పు చేసి నప్పుడు..

01/03/2017 - 22:10

ఆర్థిక స్థిరత్వం, సాధికారిత కోసం అడుగులు వేసేందుకు సామాన్య గృహిణులు తపన పడుతుంటారు. ఇందుకోసం వ్యాపార ఆలోచనల దిశగా అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారం చేయాలనే లక్ష్యం ఉంటే చాలు విజయం సాధించటం సులువు అని నిరూపిస్తున్నారు ఈ ఇరువురు మహిళలు. వనజ ఆయుర్వేద అగరబత్తీ తయారీదారురాలు, జయమని తాటి మొవ్వతో

12/31/2016 - 22:15

ఉప్పొంగే ఉత్సాహంతో, అవధులు లేని ఆనందంతో అఖిల జగత్తు కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. గడిచిన ప్రతి క్షణం మధురమైన జ్ఞాపకంగా జీవితాంతం నిలిచిపోయనట్లు, కొత్త సంవత్సరంలోనూ అలాంటి క్షణాలను ఆస్వాదించాలనే ఆకాంక్షతో, కొత్త ఆశలతో స్వాగతించేందుకు సన్నద్ధమైంది. పాత సంవత్సరపు చేదు, తీపి జ్ఞాపకాలను నెమరవేస్తూ.. సరికొత్త నిర్ణయాలతో విజయం వైపు పయనించాలని అడుగు ముందుకు
వేయబోతుంది.

12/31/2016 - 22:13

ఆ అర్ధరాత్రి
ఉత్సాహంతో ఇంటా బయటా
ప్రతిబింబించే ఆనందోత్సాహాల హేల!
తీర్చిదిద్దిన రంగవల్లులతో
కొత్త ఏడాదికి ఆహ్వానం పలుకుతుంటే
మిన్నంటిన ఆంగ్ల సంవత్సరాది సంబరాలు!
కారుచీకట్లను చీల్చే
విద్యుత్ కాంతుల వెలుగురేఖల మెరుపులు
అణగారిన బతుకుల్లో ఆశాదీపాలు..!
స్మృతినుండి సందర్భంలోకి
అంతర్లోక విహార వీక్షణం!
రోజంతా విరబూసే మాటల పరిమళాలతో

12/30/2016 - 05:51

ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడం అంత తేలిక కాదు. అందులోనూ మహిళలకు మరింత కష్టసాధ్యం. ఒకపక్క కుటుంబ బాధ్యతలు, మరోపక్క సమాజంలో ఎదురయ్యే వివక్షాపూరిత ధోరణులు... కొన్నింటిని సమన్వయం చేసుకుని, మరికొన్నింటిని దీటుగా ఎదుర్కొని ఇష్టమైన రంగంలో ఉన్నత స్థితికి చేరడం గర్వకారణం. పోటీ ప్రపంచంలో ప్రతి క్షణమూ విలువైనదే. ప్రతి రోజూ లెక్కించదగిందే.

12/29/2016 - 09:04

ఒకప్పుడు కాలేజ్ గాళ్స్ సబ్జెక్టుకో నోట్‌బుక్, జామెట్రీ బాక్స్, టిపిన్ బాక్స్, వాటర్ బాటిల్.. ఇలా స్టేషనరీని వెంటేసుకుని కాలేజీకి వెళ్ళేవారు. వీటన్నింటినీ మోసే బ్యాగ్‌ను భుజాలకు తగిలించుకుని భారంగా నడిచేవాళ్ళు. ప్రెజెంట్ ట్రెండ్ మారింది. ఇంటర్ స్టూడెంట్ నుంచి రిటైర్డ్ ఎంప్లారుూ వరకూ అందరూ హ్యాండ్ బ్యాగ్ లేనిదే గడప దాటడంలేదు.

12/27/2016 - 23:11

రాకేష్ శుక్లా వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ప్రవృత్తిరీత్యా కుక్కల నేస్తం. ఈ రోజుల్లో కుక్కలను పెంచాలని ఎవరు ఇష్టపడతారు. మక్కువగా ఉండేవారు ఒకటి లేదా రెండు కుక్కలను పెంచుకుంటారు. మహా అయితే ఐదారు కుక్కలను పెంచుకోవచ్చు. కాని రాకేష్ శుక్లా మాత్రం దాదాపు 735 కుక్కలకు తండ్రిగా మారాడు.

12/24/2016 - 21:42

ప్రేమతో, స్వేచ్ఛగా మెలగమని తాను సృష్టించిన ఈ ప్రపంచ మానవాళి దారితప్పిన వేళ వారిని రక్షించేందుకు నరరూప అవతారమెత్తిన ఏసుక్రీస్తు జన్మదినం నేడు. క్రీస్తు జన్మదినాన్ని ప్రపంచమంతా జరుపుకునే ఈ శుభదినాన క్రైస్తవ సోదరులు ఒకరికొకరు కానుకలు ఇచ్చుకుని సహజీవనంతో మెలగాలనే గొప్ప సామాజిక స్పృహను నిరంతరం గుర్తుంచుకునేలా ఆ లోకరక్షకుడు తన జీవితానే్న త్యాగం చేసిన రోజు.

12/23/2016 - 22:35

ఎవరికైనా సామాజిక బాధ్యత అవసరం అని నిక్కచ్చిగా చెప్పవచ్చు. కానీ నేటి ఆధునిక యుగంలో సుఖాలకు అర్రులు చాచే వారికి అసలు సామాజిక బాధ్యత అంటేనే తెలీదు. తెలిసినా ఎందుకో అశ్రద్ధ..నిర్లక్ష్య వైఖరి! ఇటువంటి వారి వలనే నేడు భారతదేశాన్ని అనే క జాడ్యాలు,ప్రధానంగా వ్యాధుల భూతాలు పీడిస్తున్నాయి.

12/22/2016 - 22:09

ఫ్యాషన్ రంగంలో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న యువ డిజైనర్ ఆమె. యుక్త వయసులో ఉండే డిజైనర్లు ఎంతవరకూ తమ కెరీర్, సంపాదన గురించే ఆలోచిస్తుంటారు. ముంబయికి చెందిన మహెకా మిర్పూరి మాత్రం తన కెరీర్‌ను క్యాన్సర్ బాధితుల కోసం బాసటగా చేయాలని భావించింది. ఇందుకోసం 2.33కోట్ల రూపాయల నిధితో వైద్య సహాయం అందిస్తోంది.
పెళ్లి దుస్తులే ఫ్యాషన్ డిజైనర్‌ను చేశాయి

Pages