S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/18/2019 - 19:00

భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దం చీరకట్టు. జాతీయత ప్రతిబింబించే అందమైన డ్రెస్. అందుకే సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు ప్రత్యేక సందర్భాల్లో తప్పకుండా చీర కట్టుకుని మురిసిపోతూ మెరిసిపోతుంటారు. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు? అనుకుంటున్నారు కదూ.. ఇప్పుడు మహిళలందరూ తమ చీర అనుభూతిని సోషల్ మీడియాతో పంచుకుంటూ తెగ సందడి చేస్తున్నారు. నిరంతం ఏదో ఒక హ్యాష్‌ట్యాగ్‌తో సందడి చేసే ట్విట్టర్..

07/17/2019 - 18:36

యోగ శారీరక బలాన్ని పెంచడానికి, మానసిక ఎదుగుదలకు దోహదపడుతుంది. ఆత్మస్థైర్యానికి శరీరాకృతి, అంతర్గత శక్తి చేసే సహాయం అంతా ఇంతా కాదు. ఈ రెండు విషయాలు దైనందిక జీవనంలో ప్రతి అంశంపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి. శారీరక బలం లేని వ్యక్తి అనేక ఆరోగ్య, మానసిక సమస్యలను ఎదుర్కోక తప్పదు.

07/16/2019 - 18:32

పిల్లలను తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుతారు. వారికి కావలసినవన్నీ కొనిపెడుతూ గారాబం చేస్తుంటారు. వేలు పట్టి నడిపించిన దగ్గరి నుంచి వారికి వివాహం చేసేంత వరకూ బాధ్యతను తమపైనే వేసుకుంటారు తల్లిదండ్రులు. తమ పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలన్న తపన ప్రతి ఒక్క తల్లిదండ్రులకూ ఉంటుంది. ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలని ఆరాటపడుతుంటారు.

07/15/2019 - 19:23

చినుకులు పడితే చాలు దోమలు పెరుగుతాయి. దోమల నుంచి రక్షించుకోలేకపోతే డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా.. ఇలా ఎన్నో ప్రాణాంతక వ్యాధులు మనల్ని బాధిస్తాయి. అందుకే దోమల నియంత్రణ చాలా ముఖ్యం. చిన్నపిల్లలు వున్న ఇంట్లో క్రిమిసంహారకాల ద్వారా దోమల్ని పారద్రోలలేం. అందుకని సహజ పద్ధతుల ద్వారా దోమల్ని వదిలించుకోవడం మంచిది. అదెలాగంటే..

07/11/2019 - 23:03

ఎంత ఎండనైనా తట్టుకోవచ్చు, ఎంత చలిగా వున్నా భరించవచ్చు. ఎండలో, చలిలో మన పనులు మనం చేసుకోవచ్చు. కానీ ఒంటిమీద చినుకుపడితే తట్టుకోలేం. వానలో తడుస్తూ ఏ పనీ చేయలేం.. చాలా ఇబ్బందిగా వుంటుంది. ఇంట్లోనుండి కాలు బయటపెడదామంటే ఎంతో కష్టంగా వుంటుంది. అయితే ఒకప్పుడు దాదాపు రెండు దశాబ్దాల క్రితంవరకూ కూడా రెయిన్‌కోట్స్ అందరికీ అందుబాటులో వుండేవి కావు. రెయిన్‌కోట్స్ ముందు గొడుగులు ఉపయోగించేవారు.

07/10/2019 - 18:30

ప్రపంచ జనాభా మొత్తంగా అడ్డూ అదుపూ లేకుండా కాలం కంటే వేగంగా విపరీతంగా పెరిగిపోంతోంది. ప్రజల అవసరాలు తీర్చే వనరులు జనాభా పెరుగుదలకు తగ్గట్లుగా సమకూరడంలేదు. ప్రజల అవసరాలు తీర్చగలిగే సంపద, సేవలు, సరుకులు లభించడంలేదు.

07/09/2019 - 18:30

పిల్లలు హుషారుగా లేరా? పరధ్యానంగా ఉంటున్నారా? అయితే ఇది ఆలోచించాల్సి విషయమే.. ఇంట్లో పెద్దలు ఏదైనా విషయం చెబుతుంటే ఇక చాలన్నట్లు, విననట్లు ఉండటం.. క్లాస్‌లో కూడా టీచర్ చెప్పేదంతా శ్రద్ధగా విన్నట్లే కనిపించడం.. కానీ టీచర్ చెప్పిన పాఠం గురించి ప్రశ్నిస్తే తెల్లమొహం వేయడం.. ఇవన్నీ పరధ్యానంగా ఉండే పిల్లల్లో కనిపించే కొన్ని లక్షణాలు.

07/08/2019 - 18:15

వర్షాకాలంలో ఒళ్లు తడవకుండా ఇంటికి వెళ్లడం అసాధ్యం. ఇలా రోజూ వర్షాల్లో తడవడం వల్ల చర్మం దెబ్బతింటుంది. ఈ సీజన్‌లో చర్మం పాడవకుండా సంరక్షణకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే..

07/07/2019 - 23:25

గోళ్ళకు రంగును కలిగించే గోరింటాకు ‘‘నఖరంజని’’ అని పేరు. ఆషాడంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం అనాదిగా ప్రబలంగా ఉంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం గోరింట మంచి మూలిక. దాని ఆకులే కాదు... పూవులు, వేళ్ళు, బెరడు, విత్తనాలు, గింజలు, ఓషధ గుణాలు కలిగి ఉంటాయి. హన్నొటాన్నిక్ ఆసిడ్‌తో కూడి ఒకరకమైన చిరువిషం ఉంటుంది. గింజలో చమురుంటుంది. పూలతో అత్తరు, వాసన నూనె తయారు చేస్తారు.

07/05/2019 - 18:49

భారతదేశ చరిత్రలో కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన రెండో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 1970వ సంవత్సరంలో ఇందిరాగాంధీ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఆర్థిక శాఖను కూడా తనవద్దే పెట్టుకున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ ఇది.

Pages