S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

08/26/2019 - 22:23

ఆంధ్రదేశ రాజకీయం, సాహిత్య చరిత్రలకు సంబంధించి 17వ శతాబ్దకాలం ఎంతో విశిష్టమైంది. ఈ కాలంలో ఆంధ్ర పాలకులను గాని, ఆంధ్ర సాహిత్యాన్నిగాని పరిశీలించాలంటే దక్షిణాంధ్ర యుగమే ముఖ్య ఆధారం. ఆంధ్రదేశంలో విజయనగర సామ్రాజ్యం రాక్షస తంగడి యుద్ధంతో దాని ప్రతిభ మసకబారింది. విజయనగర వారసులు నామమాత్రంగా పెనుగొండను రాజధానిగా చేసుకుని జీవిస్తున్నారు.

08/19/2019 - 21:52

కొన్ని అనుభవాలూ, పరిశీలనలూ జ్ఞాపకాలుగా మారి కాలంలో ఇంకిపోయేముందు, ఎక్కడో ఒకచోట భద్రపరచాలి. కాస్త ఆలస్యమైనా రాయాలని రాస్తున్నాను. ఆకాశవాణి మిత్రులు, కవీ, సంపాదకులూ, రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గతంగా మారిపోయారు. వారితో, ఆంధ్రభూమి దినపత్రికతో ముడిపడిన ఒకటి, రెండు విషయాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ వ్యాసం. ఇంద్రగంటి అనగానే నాకు హనుమచ్ఛాస్ర్తి గుర్తుకు వస్తారు.

08/19/2019 - 21:50

వీరేశలింగం శత జయంతికి (1948) నిజాం నవాబు మీర్ ఉస్మానలీఖాన్ భూమి విరాళం ఇచ్చాడనో, ఇవ్వబోతున్నాడనో ఆంధ్రపత్రికలో ఆ రోజుల్లో వార్త వెలువడింది. కాబట్టి ఆరోజుల్లో వీరేశలింగం తెలంగాణాలో కూడా విశ్రుతుడే అని తెలియటం లేదా! అప్పట్లో వీరేశలింగం శత జయంత్యుత్సవాలు ఆంధ్రదేశంలో ప్రతి నగరంలో జరిగాయి. బెంగుళూరు, చెన్నపట్నాలలో కూడా జరిగాయి. చెన్నైలోనైతే మూడు రోజులు జరిగాయి.

08/11/2019 - 21:14

మహాస్వప్నం మహాత్మాగాంధీ( నార్ల వెంకటేశ్వరరావు సంపాదకీయాలు, ఇతరుల వ్యాసాలు)
సంపాదకులు : డా. నాగసూరి వేణుగోపాల్
- ప్రతులకు - రామ్ మనోహర్ లోహియా సమతా ట్రస్ట్, లోహియా విజ్ఞాన సమితి
101, గోధా నిలయం, మయూరి మార్గ్, బేగంపేట, హైదరాబాద్ - 500 016
=============================================================

08/05/2019 - 22:29

మహాకవి జాషువాగారు కర్ణుని గురించి ‘భారత వీరుడు’ అనే శీర్షిక క్రింద తమ మూడు ఖండ కావ్యాలలో మూడుచోట్ల 25 పద్యాలు రాశారు. ఆ పద్యాలన్నింటిలో ఉత్ప్రేరకములు, స్ఫూర్తిదాయకములు, మూల బీజములు అనదగిన పద్యాలను కర్ణునికి సంబంధించినవే అయినా మరో 8 పద్యాలను తమకు వచ్చిన స్వప్నవృత్తాంతంగా ‘‘నా కథ’’లో ‘‘వ్యథా ఘట్టములు’’లో చెప్పుకున్నారు.

07/28/2019 - 22:57

తెలుగు భాష పట్ల ప్రజలకు మమకారాన్ని పెంచి, తమిళ భాష ఆధిపత్యాన్ని గూర్చి ఆలోచింప చేసిన వ్యక్తి బి.జె.డబ్ల్యూ. పుష్పరాజ్. భాషావ్ఢ్యౌ ప్రభావాన్ని ఎదుర్కొని ఎదురీదిన యోధుడు. అవి ఉగాది వేడుకలు. చెన్నపురి ఆంధ్ర మహాసభ వేదిక. నేను నా మిత్రుడు ఆ కార్యక్రమానికి వెళ్ళాము. సభ ప్రారంభమైంది. కాని ఏ ఒక్కరూ తెలుగులో మాట్లాడడం లేదు. హేమాహేమీలైన తెలుగు రాజకీయ నాయకులూ అందులో ఉన్నారు. సభామర్యాదలకై ఓపికపట్టారు.

07/28/2019 - 22:56

ఈ పత్రిక ఎవరు నడిపి ఉంటారో ఊహించగలరా? ఎవరు? మరెవరు నడపగలరు?! గిడుగువారే నడిపారు. 1919 సెప్టెంబర్‌లో మాసపత్రికగా దీనిని ప్రారంభించారు గిడుగువారు. 1920 ఫిబ్రవరి తరువాత పత్రిక రాలేదు. ఎందుకని? తెలుగువారికి స్వ సంస్కృతి, స్వభాషపట్ల శ్రద్ధాసక్తులు లోపించటంవల్ల!

07/22/2019 - 23:02

ఆధునిక సాహిత్య చరిత్రలో కవిగా ప్రజాపక్షం వహించి, తన కలాన్ని ఝుళిపించి, సాహిత్యాన్ని సామాన్యుని ముంగిట అసామాన్యం చేసినవాడు, నవీన వాఙ్మయ రత్నగర్భలో గుండెలను కరిగింపగల భావావేశ పూరితములైన కావ్యములను రచించినవాడు తెలుగుజాతి గర్వించదగ్గ తెలుగు తల్లి ముద్దుబిడ్డ గుఱ్ఱం జాషువా. గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో వీరయ్య, లింగమాంబ దంపతులకు 1895 సెప్టెంబర్ 28న జన్మించాడు.

07/08/2019 - 21:40

దక్షిణ భారతానికి చెందిన వరకవులలో కవి యోగ వంద్యులు సిద్దప్ప వరకవి తెలుగు సాహిత్య చరిత్రలో ఉన్నత స్థానంగా చెప్పవచ్చు. తెలంగాణలో ఇతని పద్యాలు ప్రజల నాలుకలపై నాట్యం చేస్తాయి. సంవత్సరాలు ఎన్నో గడిచిపోయినా, తరాలెన్నో పుట్టి గిట్టుతున్నా, కాలము భూతకాలంలో కలిసిపోయినా కాని ప్రజల మనోఫలకాలపై రూపుదిద్దుకున్న సిద్దప్ప వరకవి అనే మహనీయుని రూపం ఎన్నటికీ చెరిగిపోదు.

07/01/2019 - 22:03

శ్రీనాథుని చాటువులుగా చెప్పబడే కొన్ని పద్యాలను పరిశీలిస్తే ఆయన ‘సంచారి’ ఏమో అన్న భావన కలగడం సహజం. సూక్ష్మంగా పరిశీలిస్తే ఎన్నో అతివేలమైన శృంగార పద్యాలను, అశ్లీలమైన పద్యాలనూ శ్రీనాథునికి అంటగట్టి ప్రచారంలో పెట్టారనిపిస్తుంది. నిజానికి ‘శృంగార వైషధం’ అని పేరు పెట్టినప్పటికీ ఆ గ్రంథంలో శ్రీనాథుడు ఎంతో అందమైన, సున్నితమైన వర్ణనలు చేశాడే గాని ఎక్కడా అసభ్యతకూ, అశ్లీలతకూ ఇసుమంత కూడా తావివ్వలేదు.

Pages