S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

09/23/2019 - 22:29

ఈ పత్రికా ప్రకటనమునందు నా యుద్దేశములు రెండు. భాషాభివృద్ధితో దేశాభివృద్ధి నేనేర్పఱుచుకొన్న భాషాభివృద్ధి మార్గము, తెలుగు భాషలో మృదువైన సులభశైలిని సలక్షణమైన వచన రచన చేయుట’’ ఆధునిక తెలుగు వచన శైలికి ఆద్యులైన సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగంగారు, స్వీయ చరిత్రలో పేర్కొన్న వివేకవర్ధని పత్రిక ప్రస్తావనలోని వాక్యాలివి.

09/16/2019 - 22:56

శిరోమణి సన్నిధానం సూర్యనారాయణశాస్ర్తి గారు 1897 డిసెంబర్ 10న బుచ్చినర్సమ్మ, సుబ్బయ్య పుణ్య దంపతులకు జన్మించారు. వైదిక కుటుంబీకులైన శాస్ర్తిగారి బాల్యమంతా వారి మేనమామ గారింట కృష్ణాజిల్లాలోని చిరివాడ గ్రామంలో బాల్యం గడిపారు.

09/16/2019 - 22:50

‘...వాడెవడు, నన్ను జూడు. అదిగాదు - అనే ప్రయోగాలు సర్వత్రా వినిపిస్తుంటాయి. ఆ మాటల్లో సంధి దాగుందని మాట్లాడేవాళ్ళకు తెలీదు, వినేవాళ్ళకూ తెలీదు. సంధికి మాటలను తేలిక పరిచే స్వభావం ఉన్నందువల్ల అవి అప్రయత్నంగా వ్యవహారంలో ఇమిడిపోయాయి.

09/09/2019 - 22:19

ప్రజల గురించి, ప్రజలకోసం, ప్రజల భాషలో కవిత్వం రాసిన అచ్చమైన ప్రజాకవి కాళోజీ. తెలంగాణ ప్రసిద్ధకవుల్లో కాళోజీ ఒకరు. కాళోజీ కవిత్వమంతా నిరంతరం తన చుట్టూ జరుగుతున్న సామాజిక సంఘటనలను ఆశ్రయించి ఉంటుంది. వైయక్తిక జీవితానికి, కవిత్వానికి మధ్య పవిత్రమైన వైరుధ్యం కాళోజీ కవిత్వంలో కనిపించదు. తన భావాలను వీలైనంత తేలికగా వ్యక్తం చేయడమే కాళోజీ లక్ష్యం.

09/02/2019 - 01:33

మఱుగున పడిన మహాకవి
తురగా వెంకమరాజు
రచన: కొల్లా శ్రీకృష్ణారావు
ప్రతులకు: రచయిత
రోహిణీ టవర్స్,
2-11, బ్రాడీపేట
గుంటూరు- 522002
ఫోన్: 9440033715
*

08/26/2019 - 22:23

ఆంధ్రదేశ రాజకీయం, సాహిత్య చరిత్రలకు సంబంధించి 17వ శతాబ్దకాలం ఎంతో విశిష్టమైంది. ఈ కాలంలో ఆంధ్ర పాలకులను గాని, ఆంధ్ర సాహిత్యాన్నిగాని పరిశీలించాలంటే దక్షిణాంధ్ర యుగమే ముఖ్య ఆధారం. ఆంధ్రదేశంలో విజయనగర సామ్రాజ్యం రాక్షస తంగడి యుద్ధంతో దాని ప్రతిభ మసకబారింది. విజయనగర వారసులు నామమాత్రంగా పెనుగొండను రాజధానిగా చేసుకుని జీవిస్తున్నారు.

08/19/2019 - 21:52

కొన్ని అనుభవాలూ, పరిశీలనలూ జ్ఞాపకాలుగా మారి కాలంలో ఇంకిపోయేముందు, ఎక్కడో ఒకచోట భద్రపరచాలి. కాస్త ఆలస్యమైనా రాయాలని రాస్తున్నాను. ఆకాశవాణి మిత్రులు, కవీ, సంపాదకులూ, రచయిత ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గతంగా మారిపోయారు. వారితో, ఆంధ్రభూమి దినపత్రికతో ముడిపడిన ఒకటి, రెండు విషయాలు కూడా ఉన్నాయి. అందుకే ఈ వ్యాసం. ఇంద్రగంటి అనగానే నాకు హనుమచ్ఛాస్ర్తి గుర్తుకు వస్తారు.

08/19/2019 - 21:50

వీరేశలింగం శత జయంతికి (1948) నిజాం నవాబు మీర్ ఉస్మానలీఖాన్ భూమి విరాళం ఇచ్చాడనో, ఇవ్వబోతున్నాడనో ఆంధ్రపత్రికలో ఆ రోజుల్లో వార్త వెలువడింది. కాబట్టి ఆరోజుల్లో వీరేశలింగం తెలంగాణాలో కూడా విశ్రుతుడే అని తెలియటం లేదా! అప్పట్లో వీరేశలింగం శత జయంత్యుత్సవాలు ఆంధ్రదేశంలో ప్రతి నగరంలో జరిగాయి. బెంగుళూరు, చెన్నపట్నాలలో కూడా జరిగాయి. చెన్నైలోనైతే మూడు రోజులు జరిగాయి.

08/11/2019 - 21:14

మహాస్వప్నం మహాత్మాగాంధీ( నార్ల వెంకటేశ్వరరావు సంపాదకీయాలు, ఇతరుల వ్యాసాలు)
సంపాదకులు : డా. నాగసూరి వేణుగోపాల్
- ప్రతులకు - రామ్ మనోహర్ లోహియా సమతా ట్రస్ట్, లోహియా విజ్ఞాన సమితి
101, గోధా నిలయం, మయూరి మార్గ్, బేగంపేట, హైదరాబాద్ - 500 016
=============================================================

08/05/2019 - 22:29

మహాకవి జాషువాగారు కర్ణుని గురించి ‘భారత వీరుడు’ అనే శీర్షిక క్రింద తమ మూడు ఖండ కావ్యాలలో మూడుచోట్ల 25 పద్యాలు రాశారు. ఆ పద్యాలన్నింటిలో ఉత్ప్రేరకములు, స్ఫూర్తిదాయకములు, మూల బీజములు అనదగిన పద్యాలను కర్ణునికి సంబంధించినవే అయినా మరో 8 పద్యాలను తమకు వచ్చిన స్వప్నవృత్తాంతంగా ‘‘నా కథ’’లో ‘‘వ్యథా ఘట్టములు’’లో చెప్పుకున్నారు.

Pages