S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

07/22/2019 - 23:02

ఆధునిక సాహిత్య చరిత్రలో కవిగా ప్రజాపక్షం వహించి, తన కలాన్ని ఝుళిపించి, సాహిత్యాన్ని సామాన్యుని ముంగిట అసామాన్యం చేసినవాడు, నవీన వాఙ్మయ రత్నగర్భలో గుండెలను కరిగింపగల భావావేశ పూరితములైన కావ్యములను రచించినవాడు తెలుగుజాతి గర్వించదగ్గ తెలుగు తల్లి ముద్దుబిడ్డ గుఱ్ఱం జాషువా. గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో వీరయ్య, లింగమాంబ దంపతులకు 1895 సెప్టెంబర్ 28న జన్మించాడు.

07/08/2019 - 21:40

దక్షిణ భారతానికి చెందిన వరకవులలో కవి యోగ వంద్యులు సిద్దప్ప వరకవి తెలుగు సాహిత్య చరిత్రలో ఉన్నత స్థానంగా చెప్పవచ్చు. తెలంగాణలో ఇతని పద్యాలు ప్రజల నాలుకలపై నాట్యం చేస్తాయి. సంవత్సరాలు ఎన్నో గడిచిపోయినా, తరాలెన్నో పుట్టి గిట్టుతున్నా, కాలము భూతకాలంలో కలిసిపోయినా కాని ప్రజల మనోఫలకాలపై రూపుదిద్దుకున్న సిద్దప్ప వరకవి అనే మహనీయుని రూపం ఎన్నటికీ చెరిగిపోదు.

07/01/2019 - 22:03

శ్రీనాథుని చాటువులుగా చెప్పబడే కొన్ని పద్యాలను పరిశీలిస్తే ఆయన ‘సంచారి’ ఏమో అన్న భావన కలగడం సహజం. సూక్ష్మంగా పరిశీలిస్తే ఎన్నో అతివేలమైన శృంగార పద్యాలను, అశ్లీలమైన పద్యాలనూ శ్రీనాథునికి అంటగట్టి ప్రచారంలో పెట్టారనిపిస్తుంది. నిజానికి ‘శృంగార వైషధం’ అని పేరు పెట్టినప్పటికీ ఆ గ్రంథంలో శ్రీనాథుడు ఎంతో అందమైన, సున్నితమైన వర్ణనలు చేశాడే గాని ఎక్కడా అసభ్యతకూ, అశ్లీలతకూ ఇసుమంత కూడా తావివ్వలేదు.

07/01/2019 - 22:01

మధుస్మృతి
మధునాపంతుల సత్యనారాయణశాస్ర్తీగారి
శారదావరణ స్ఫురణాలు
రచన: శ్రీ సన్నిధానం నరసింహశర్మ,
వెల: రు.100/-
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లో-
*

06/24/2019 - 22:40

కొందరు తమకొరకే జీవిస్తారు. మరికొందరు ఇంకొకరికోసం బ్రతుకుతారు. ఆ ఇంకొందరు తాము బ్రతకరు. ఇంకొకరిని బ్రతకనివ్వరు. జీవితం అశాశ్వతమని తమకొరకుకాక, ఇంకొకరికొరకు జీవిస్తే తాము చనిపోయినా ప్రజల హృదయాలలో పదిలంగా ఉంటామనే సత్యాన్ని తెలుసుకోలేనివాళ్ళు ఈ జగాన కోకొల్లలు. ఆయనో తెలుగు శ్వాస. ఆయనో తెలుగు ఊపిరి. వినే మీకు అతిశయోక్తిగా అనిపించినా ఇలా చెప్పక తప్పదు.

06/17/2019 - 22:47

(జూన్ 21న కరుణశ్రీ వర్ధంతి సందర్భంగా..)
*

06/10/2019 - 21:47

తమిళనాడు నడిబొడ్డులో శ్రీవిల్లిపుత్తూరుకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజపాళయం శ్రీ ముదునూరి జగన్నాథరాజావారి స్వగ్రామం. గురుస్వామి రాజా, అమ్మణియమ్మ దంపతులకు కుమారుడుగా 1933 జూలై 26న వీరు జన్మించారు. బాల్యంలో వీధి బడిలో ఆరవ తరగతి వరకు మాత్రమే వీరి విద్యాభ్యాసం కొనసాగింది.

06/03/2019 - 23:42

పలనాటి గడ్డ గొప్ప పోతుగడ్డ అనీ, విద్వత్కవులకూ, అవధాని వరేణ్యులకూ అన్నింటినీమించి సదాచార సంప్రదాయపరాయణులకు పుట్టినిల్లనీ నాలాంటి కవి నట గాయక సామాన్యుడు గొంతెత్తి ఆరున్నొక్కటి శ్రుతిలో అరవనక్కరలేదు.

05/26/2019 - 20:42

విళ్ల... ఈ పేరుకు ఒక ప్రత్యేక పుట లేకుండా తెలుగు అచ్చు చరిత్రను మనం ఎంత మధించినా అది అసంపూర్ణమే. తెలుగు బీజాక్షర జగతిని అచ్చుల్లో అందంగా ముస్తాబుచేసి తెలుగు జాతి అరచేతుల్లో పెట్టిన మహానుభావుల్లో వావిళ్లవారు అత్యంత ముఖ్యులు. నేడు తెలుగు అచ్చుపుస్తకం చదువుతున్న ప్రతి తెలుగువారికీ ప్రాతఃస్మరణీయులు వావిళ్ల రామస్వామి శాస్ర్తీగారు.

05/20/2019 - 22:47

మనిషితోపాటే కథ పుట్టింది. జీవితం ఎన్ని మలుపులు తిరిగితే సాహిత్యం కూడా అన్ని మలుపులు తిరగక తప్పదు. తెలుగు జీవితాన్ని అంటిపెట్టుకొని ఎన్నో మెలికలు తిరిగిన సాహిత్య ప్రక్రియ తెలుగు కథానిక అంటారు పురాణం సుబ్రహ్మణ్యశర్మ, వాకాటిగార్లు. దిద్దుబాటుతో తొలి కథకు శ్రీకారంచుట్టిన మహాకవి గురజాడ మొదలు వర్తమాన కథకులవరకు వందలాది కథకులు వేలాది కథలను తెలుగు దేశానికి అందించి తెలుగుతేజాన్ని దశదిశలా వ్యాపింపజేశారు.

Pages