S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

04/08/2019 - 22:06

అన్నింటా పురుషాధిక్యమే యుండిన ఆ కాలంలో విద్య, వైద్య, రాజకీయం, సాంఘిక రంగాలలో ముందడుగు వేసి, మహిళా లోకానికి అపారమైన సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, బహువిధ సేవకురాలైన డాక్టర్ ముత్తులక్ష్మిరెడ్డి గుఱించి తమిళనాట తెలియని వారుండరు. సాంఘిక సంస్కరణోద్యమంలో కూడా పాల్గొని రాణించిన మహిళా నాయకమణి ముత్తులక్ష్మి. ముత్తులక్ష్మి 1886 జూలై 30న పుదుకోటలో జన్మించారు. తండ్రి నారాయణస్వామి, తల్లి చంద్రమ్మ.

04/01/2019 - 21:54

సౌజన్యంబను మేకతోలు మెయినాచ్ఛాదించుకొన్నట్టి రుూ
రాజుల్ రాజులె? దొంగ బెబ్బులులు; వీరా? మా శ్రమ స్వేద పా
థోజాలంబు హరియించువారు; కృతియిత్తున్ మెచ్చి గైకోగదే!
నీ జిహ్వాగ్రములన్ ధనంజయుడ! రాణింపన్ జిరస్థాయిగన్‌॥

04/01/2019 - 21:53

ఆరుద్రలో అడ్డెడు చల్లిన పుట్టెడు పండుననేది నేటికి ఆంధ్ర దేశంలో ప్రతి నిత్యం విన్పించే నానుడి. కార్తెల్లో ఆరుద్ర అంతటి విశిష్టమైనదన్న మాట. సాహితీ చరిత్రలో ఆరుద్రగా చెరగని ముద్ర వెయ్యగలిగిన భాగవతుల శివశంకరశాస్ర్తీ ఉత్తరాంధ్ర నివాసి ఐనప్పటికి పత్రికలో చదివిన కథనానికి స్పందించి త్వమేవాహమ్ కావ్య రచన చేసి తెలంగాణ పోరాటంలో పాల్గొనక పోయినా పోరాటం పట్ల ప్రగాఢ సానుభూతిని కావ్యనామంలోనే ప్రతిధ్వనించారు.

03/25/2019 - 22:29

అటు రాచకొండ విశ్వనాథశాస్ర్తీ, ఇటు కె.ఎన్.వై.పతంజలి వారసునిగా కళింగాంధ్ర నేలలో మొలిచిన ‘చింతనా వృక్షం’ కథారచయిత. నవలాకారుడు, నాటకకర్త చింతకింది శ్రీనివాసరావు. ఈ విషయాన్ని అతని మూడు కథా సంపుటాలూ విస్పష్టం చేస్తాయి. ఆయన రచించిన ‘వికర్ణ’ నవల ఆధునికోత్తర తెలుగు సాహితీ రంగంలో సంచలనం రేపింది. ‘అదిగో ద్వారక’ పేరిట ద్వాపరయుగంనాటి ద్వంద్వ ప్రమాణాలను బయల్పరుస్తూ ఆయన చేసిన నవలా రచన వినూత్నం.

03/18/2019 - 21:51

ఆంధ్ర భాగవతకర్తయైన బమ్మెరపోతనకు శ్రీనాథునితో బాంధవ్యమున్నదా? అని పరిశీలిస్తే చారిత్రకంగా లేదనిపిస్తోంది. కానీ సాహితీ లోకంలో ఎన్నో కథలు, గాథలు, వారివురి చుట్టూ, అల్లుకుని ఉన్నాయి. గురజాడ శ్రీరామమూర్తిగారి ‘కవి జీవితములు’ అనే ప్రాచీన గ్రంథములో కూడా వీరిని బావ, బావమరదులుగా చూపిస్తూ అనేక కథలు మనకు గోచరిస్తున్నాయి. దీనికి ఆధారభూతమనదగిన పద్యమొకటి దగ్గుపల్లి దుగ్గన నాసికేపాఖ్యానంలో మనకు కనిపిస్తుంది.

03/11/2019 - 02:07

నాగసూరి విద్యాధికుడు, నిరంతర అధ్యయనశీలి. పేదరికంలో పుట్టినా, అన్నింటికి ఎదురీది ఉన్నత స్థానానికి ఎదిగిన ఘటికుడు. సైన్స్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేసినవాడు. పత్రికలంటే విపరీతమైన మక్కువ పెంచుకున్నవాడు. ఈ ఇష్టమే జర్నలిజంలో ఆయన్ని డాక్టరేట్‌ను చేసింది. ఆకాశవాణిలో ఉన్నతోద్యోగం. దశాబ్దాలుగా టీవీ మాధ్యమాన్ని క్షీర, నీర న్యాయంతో వివేచన చేసి వ్యాసాలుగా వెల్లువెత్తించిన అనుభవం..

02/24/2019 - 21:30

ఒకప్పుడు తెలుగువారి సాంస్కృతిక రాజధానిగా కీర్తించబడిన చెన్నైతో తెలుగువారిది విడదీయరాని బంధం. తెలుగువారి మనసులలో ఇప్పటికీ ‘మదరాసు’గానే ముద్రితమై ఉన్న చెన్నై మహానగర అభివృద్ధిలో తెలుగువారిది సింహభాగం అంటే, ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.

02/17/2019 - 23:19

కొద్దిరోజుల ముందర ఆంధ్రప్రదేశ్ సాహితి అకాడెమీ ఏర్పాటు పూర్తిస్థాయి ప్రకటన వెలువడింది. ముప్ఫై మూడేళ్ళ తరువాత, తెలుగు రచయితలకు ఈపాటి ఆలంబన ఏర్పడడం జరుగుతున్నది. అలనాడు 1980ల్లో ఎన్‌టిఆర్ ప్రభుత్వం అటు మద్య నిషేధం, ఇటు అకాడెమీల రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నది. అకాడెమీలను తెలుగు విశ్వవిద్యాలయం పరిపాలనా వ్యవహారాల్లో భాగం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

02/11/2019 - 23:55

అరయగ కార్యదక్షత మహా గుణశీలము ప్రజ్ఞతాల్మియున్
పరహిత చింత పట్టుదల ప్రాజ్ఞుల సఖ్యము శ్రద్ధసేవయున్
గురుతర కార్యనిర్వహణ కూర్మిజెలంగు ప్రజానురాగమున్
స్థిరమగు భావసంపదయు ధీరతగల్గిన నాయకుండగున్.

02/03/2019 - 23:53

మ ప్రాంతాల తెలుగును ఇతరులు ఈసడించినా, తాము తెలుగు వాళ్ళమని, తమ భాషను పరిరక్షించుకోవడం తమ కర్తవ్యమని దక్షిణ భారతంలోని ముఖ్యంగా తమిళనాడులోని తెలుగువారు ఆరు దశాబ్దాల క్రిందటే భావించారు. సాధు వరదరాజం పంతులుగారి అకుంఠిత దీక్షవల్ల తమిళనాడులో కొడిగట్టుతున్న తెలుగుదీపం స్నేహప్రాప్తిని పొంది మళ్ళీ వెలుగుతూంది.

Pages