S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/31/2018 - 01:55

అకాల వర్షం దండెత్తి పంటలని
తెగనరికినప్పుడు
మొదలంటా కుదుళ్లని
పెకలించి మట్టిని ఏడిపిస్తుంది

రా రమ్మని వేడుకోళ్లని తిరస్కరించి
చిత్తం వచ్చినప్పుడే హాజరు వేసి
సమూలంగా తుడిచిపెట్టే గాలి బీభత్సానికి
నేలరాలిన విత్తుల కన్నీళ్లు

గోదాములలో వెచ్చగా నిద్రించాల్సిన
రేపటి బువ్వగింజలు
అల్పపీడనానికి భయపడి
నిలువెత్తు తడిసిపోయాయ

12/31/2018 - 01:53

గుండె తడినుంచి
అంకురించు అక్షరం
గుండెల్ని తాకడమే
దాని లక్ష్యం

అన్నం తింటూ
ఆలోచించండి
అందులో కనపడుతుంది
అన్నదాత ‘గోడు’
వాగడానికి
ఎందుకంత తొందర?
‘వినడం’ ఓ కళ
నేర్చుకో ముందర
మన లోకమంతా
ప్లాస్టిక్ ఫారెస్ట్
కాలుష్యమే
మనకు చీఫ్ గెస్ట్

12/31/2018 - 01:52

ప్రతులకు:
ప్రొ.కె.సంజీవరావు (శిఖామణి),
వెల:రూ.450/-, పేజీలు:482,
కవిసంధ్య గ్రంథమాల, యానాం.
సెల్:9848202526.
*

12/24/2018 - 23:27

ఉదయం నుంచీ సాయంకాలం దాకా...
అలసిపోయన ఒళ్ళును
అక్కడ కూర్చోబెడతాను
కొన్ని క్షణాల వౌనదీక్షలో
శతకోటి స్పందనలు తచ్చాడుతాయ

12/24/2018 - 23:26

మార్చి 21 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా కవిసంధ్య సాహిత్య సాంస్కృతిక సంస్థ, జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సహకారంతో కవితల పోటీ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ దాట్ల దేవదానం రాజు ఒక ప్రకటనలో తెలిపారు. సమకాలీన వస్తువు, ఆధునిక భాష, అభివ్యక్తితో కూడిన వచన కవితలు మాత్రమే పోటీకి పరిశీలించబడతాయ. ఈ పోటీలో పాల్గొనదలచినవారు రూ.200 ఎంట్రీ ఫీజుగా చెల్లించాలి.

12/17/2018 - 03:22

ఇప్పుడందరూ ఏమిటో
వౌనాన్ని ముఖానికి తగిలించుకుని
ఒంటరితనాన్ని మోసుకుని తిరుగుతున్నారు
మాట్లాడాల్సిన మాటలన్నిటినీ గుండెల్లో పాతేసి
చీకట్లోకి నడిచిపోతున్నారు
సూర్యుడిని మబ్బుల్లో కప్పెట్టి
దిగులు మేఘాల దొంతరలను పేర్చుకుంటూ
రాత్రులకు ప్రాణం పోసుకుంటున్నారు
తోటలోని అందమైన పూలను ఆరాధించడం మాని
రాలిన ఆకులను లెక్కెడుతూ

12/17/2018 - 03:14

వినదగు నెవ్వరు చెప్పిననే
విజ్ఞుల అభిభాషణ అవసరం లేదు
ఆహ్వాన విన్నపం చాలనే -
అతిరధులు, మహారధులనబడే
మహా నాయకుల మహోపన్యాసాల
ఆకర్షణలతో హాజరయే
నేల ఈనిందా,
చీమలపుట్ట పొదిగిందా అనిపించే
పిడికిలి తెరచిన హస్తాలు
రెపరెపలాడించే రెండు వ్రేళ్లు
ఎవరు చెప్పినా, ఏమి చెప్పినా
వీడు పిలిచినా, వాడు పిలిచినా
వీటికి, వాటికి, వేటికైనా

12/10/2018 - 03:52

ఒక శ్వాసకు మరొక శ్వాసకు
మధ్య దూరాన్ని గణించడమంటే
ఒక జననాన్ని ఒక మరణాన్ని లెక్కించడమే
విధ్వంసం జరిగితేనే
నిర్మాణానికి హస్తరేఖలు కలుసుకుంటాయ

దూరదూరంగా జరుగుతున్నారంటే
బ్రహ్మజెముడు మొక్కలు రక్తం చిందిస్తున్నట్టే
ఒంటరిగా ఉన్నప్పుడు మన గుండెచప్పుడే
భయంకర మృత్యునాదవౌతుంది

12/03/2018 - 06:05

సాయం వేళ సూరీడు వీడ్కోలు పలుకుతున్నప్పుడు
అలుక్కుపోయన రంగుల ఆకాశంలా
రకరకాల భావాల కలగలుపుతో
గజిబిజిగా ఉంది అతడి మనసు

12/03/2018 - 06:09

ఆ గాలికెలా తెలిసిందో
నేనిక్కడ ఉన్నానని
ఆమె అందెల రవళిని
ఎంచక్కా మోసుకొచ్చింది

ఆ వెనె్నలకి చెప్పింది ఎవరో
ఆమె చలువ చూపుల్ని
నాపై సుతారంగా విసిరేయమని

ఆ సెలయేరుకెలా తెలిసింది
ఎక్కడ తీసుకుంది తర్ఫీదు
అచ్చం ఆమెలానే నడుస్తుంది

అరె! ఆ గులాబి మొక్కేంటి కవిత
ఆమె చక్కదనాల నవ్వుల్ని
రోజూ పూస్తూనే వుంది

Pages