S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

12/03/2018 - 06:09

కటిక చీకటి తెరల వెనుక
స్ఫటిక వేకువలు కానరావాలి
ఎడారి దారుల మజిలీలో
తడియారని ఆశలు తొణికిసలాడాలి
నిరాశ వృక్షపు ఛాయల్లో
మానవ వికాసపు గుర్తులు చూడాలి
మిత్రమా -
హృదయానికి ఓపిక ఉంటే
ఉదయాలు ఎదురై రాక మానవు
పయనమెందుకో జ్ఞాపకముంటే
విజయ పవనాలు నిను తాకక మానవు

11/28/2018 - 03:14

తీసి పారేసే గడ్డిపరక కూడా
కొన్ని వాక్యాలను చేతికందిస్తుంది
కట్టెపుల్ల కూడా కవిత్వాన్ని
పలికించగలదని
ఇప్పుడిప్పుడే తెలుస్తుంది!

11/28/2018 - 03:12

అడవి జంతువుల నుండి రక్షణకై
తయారుచేసుకొన్న ఆయుధం
తన ప్రాణాలనే కబళిస్తుంది

ఆకులను వస్త్రంగా చేసుకొని
నాగరికుడైన నరుడు
విచ్చలవిడి స్వేచ్ఛతో
అందాలను తూర్పారబడుతూ
అనాగరికుడవుతున్నడు

మనుగడ కోసం గుంపులుగా
ఏర్పడ్డ మానవుడు
ఆధిపత్యం, అధికారం వేటలో
కుల, మత, వర్గాలుగా విచ్ఛిన్నమవుతున్నడు

11/26/2018 - 02:32

చేప ఎక్కడైనా చేపే
కాని అది చైనా చేప,
తదేకంగా ననే్న చూస్తుంది.

చిన్నప్పటి నుంచి
ఒక నిశ్చల దృక్కు
నాకు గుచ్చుకుంటూనే వుంది.
వదిలించుకొని
మరో జీవితంలోకి
ఈదుకుంటూ వెళ్లిపోయాను.

11/19/2018 - 07:05

వౌనం..
బంగారమూ కాదు, గంభీరమూ కాదు
వౌనం..
ఘనమూ కాదు, సుగుణమూ కాదు
వౌనం... ఓ నిర్జీవ సంగీతం
ఓ నిర్బల సంకేతం
ఓ నిష్ఫల సందేశం

అన్యాయం ఎదురైనప్పుడు
నీతి అరుదైనప్పుడు
జాతి నిదరోయనప్పుడు
మూతి బిగించడం పాతకమే
మానవతపై ఘాతుకమే
గుండె పగిలినపుడు
గొంతు పెగలాల్సిందే
కడుపు రగిలినపుడు
మాట పిడుగై కురవాల్సిందే

11/19/2018 - 07:06

ఉషోదయాలన్నీ
విషోదయాలైన నది ఒడ్డున నిలబడి

తలో, చేతులో తెగిపోయన దినాల్ని
ప్రతి ఉదయాన
పతాక శీర్షికగా చదువుకోవడం కన్నా
అతి పెద్ద విషాదం ఏదనుకోవాలి...?!

11/19/2018 - 07:03

పంచ భూతాల్ని ప్రపంచిస్తున్న ప్రకృతిని
అమానుషతత్త్వ వేది మీద పరాభవించేటప్పుడు
వైఖరి గుడ్డిది
లోకులు పదవులు వదలలేని పెదవులు కదపలేని
‘‘కృభీద్రో’’హులే
ఐనా ఒక గీతమేదో ఆగామి కర్తవ్యాన్ని తట్టింది
అప్పుడే ఆవహం - ఆ పై ఆహవం...

11/19/2018 - 06:55

వీర శతావధానిగా పేరుగాంచిన గాడేపల్లి వీరరాఘవ శాస్ర్తి (1891-1945)గారు విధి వశాత్తు ప్రథమ కళత్రం గతించగా, ద్వితీయ వివాహం కోసం ప్రయత్నించే సందర్భంలో చిత్తూరు జిల్లాలోని మదనపల్లె ప్రాంతానికి వెళ్లారు. శాస్ర్తిగారు ఆజానుబాహువు. గంభీరమైన విగ్రహం. వధువు పేరు సావిత్రమ్మ. పిడతల లక్ష్మీనృసింహశాస్ర్తిగారి కుమార్తె. వధువు ఇంటిలోనే పెండ్లిచూపులు.

11/12/2018 - 00:09

మనిషి చుట్టూ
కొన్ని కలలు ప్రవహిస్తాయి!

అలల గుండెచప్పుళ్ళతో
ఉప్పెనలా ఎగిసిపడుతూ
తుపాను రాత్రుళ్ళను వెంటేసుకుని
మనసు మీద
ప్రవహిస్తున్న దృశ్యం!

వేకువ పొద్దు
కళ్ళు తెరిచి చూసినంత మేర
కనీ కనిపించని
అడుగుల గుండెచప్పుళ్ళు!

వీధి గుమ్మంలో
ఏదో తెలియని
గమ్మతె్తైన సందడి!

11/12/2018 - 00:07

నేను నిర్మించుకున్న జీవితం
సాలీడు అల్లుకున్న గూడు
లోతుగా తరచి చూస్తే
రెండూ ఒకలా కనిపిస్తున్నాయ

ఎన్నో దారాల కట్టడం
క్షణభంగురంలా అనిపించినా
నిత్య మార్గదర్శిగా కనిపిస్తుంది
అన్ని అల్లికలు చూసినప్పుడు
గజిబిజి గందరగోళంలా
ఇవన్నీ అవసరమా
అన్న నాలోని ప్రశ్నకు
జవాబులూ ఉన్నాయందులోనే

Pages