S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

09/24/2018 - 04:41

నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా కవిత్వం ఇప్పటికీ, ఎప్పటికీ సజీవ దృశ్య కావ్యం. ఆయన కవిత్వపు చిక్కదనం, చక్కదనం మహా మహా అద్భుతం మరియు అనితర అసాధ్యం. అదియునూ జాషువా ఒక్కరికే సొంతం. అసమాన సమాజం మనుగడలో ఉన్నంత వరకూ జాషువా కవిత్వానికీ మనుగడ తప్ప, మరణం ఉండదు. కుసుమ ధర్మన్న, బీర్నీడి మోషే వంటి దళిత తొలి గళాలు ఉన్నా, వర్ణ అధర్మంపై పిడిగుద్దులు గుద్దిన తొలి దళిత మహాగళం జాషువానే.

09/16/2018 - 23:37

పిల్లనగ్రోవితో ఉల్లము ఝల్లున పొంగితే
చిరు చిమ్మన గ్రోవితో చింతలు పెక్కింతలు!
పిల్లనగ్రోవితో రాగాలు పదివేలు
చిరు చిమ్మన గ్రోవితో రోగాల కనేక మందులు!

09/16/2018 - 23:34

చాలా విషయాల్లో ఆయనది చెరపడానికి అసాధ్యమైన రికార్డు. బాల్యంలో పనె్నండేళ్ల వయస్సులోనే మృదుమధురమైన పద్యకవిత వ్రాశారు. శతాధిక గ్రంథాలను రచించి ప్రచురించారు. కాశీ, ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల నుండి కళాప్రపూర్ణ గౌరవాన్ని, గౌరవ డాక్టరేట్ పట్టాలను అందుకొన్నారు. భారత ప్రభుత్వంనుండి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకొన్నారు.

09/10/2018 - 01:29

తెలుగు సాహిత్య అవధానంలో కొప్పరపు సోదరుల ఖ్యాతి ఎప్పటికీ చెక్కుచెదరనిది. అవధానంలో వారి సాహితీ ప్రతిభను మరోసారి గుర్తుచేస్తూ ప్రముఖ చిత్రకారుడైన బాపు సోదరుడు శంకరనారాయణ పెన్సిల్ స్కెచ్ చిత్రాలివి.

09/10/2018 - 01:27

అదో అయిదు రూపాయల పెన్ను
ఐనా దానికి విలువ కట్టడమేంటి?

ప్రతీదానికి ఓ రేటుండే
ఈ ప్రపంచంలో చెప్పాలనే కాని
అది అమూల్యం అద్భుతం
అనంతం ఆహ్లాదంతో కూడి
అక్షర ఆహార్యం దానిలాగే
అందంగా అమరుతోంది

09/10/2018 - 01:25

ఎవరైనా
మరణం కేసి అడుగులేస్తుంటారు

కోరికల సాధన కోసం
అలుపు లేకుండా శ్రమిస్తుంటారు

ఎనె్నన్ని అవస్థలు పడినా
తీరిక లేకుండా గెలుపు కోసం
కత్తి అంచు మీదనో
నిప్పుల మీదనో నడుస్తుంటారు

పచ్చని ఆకు పండు బారినట్టు
అమ్మ ముఖ కళ
రోజుకింత మారిపోతుంది

09/10/2018 - 01:23

కళ్లని ఆకాశం గూట్లో పెట్టి
నేలపైన చినుకు జాడ కోసం
ఎదురుచూస్తుంటాడు సేద్యగాడు

ఐనా ఇక్కడ కరువు లేదంటాడు ‘వాడు’
పచ్చగడ్డి పేరుకైనా లేని నేలలో
పగలంతా తిరిగి తిరిగి
సాయంత్రానికి బీడుపడ్డ చెరువుగట్టు పై
నురగల్ని నెమరేస్తూ కూచుంటాయ పసరాలు
ఐనా యక్కడ కరువు లేదంటాడు వాడు

09/03/2018 - 00:23

* అవినీతి వ్యతిరేక కవితల పోటీకి ఆహ్వానం

09/03/2018 - 00:21

ఓ నిశీధి వేళలో...
జ్ఞాపకాల తీరాన
ఆశా నిరాశల పడగ నీడలో
కొట్టుమిట్టాడే సమయాన...
మనో క్రీడాంగణంపై
గత స్మృతుల దొంతరలు
దాగుడుమూతలాడసాగాయ!
ఇంకేముంది? మనసు...
ఎంచక్కా బ్రతుకు పుస్తకంలోని
ఒక్కో పేజీ తిరగేస్తూ...
కొమ్మకొమ్మపై
వాలిన పిట్టలు కాసేపటికే
ఎగిరిపోయనట్లు...
సమస్యలు సైతం
చుట్టాల వోలె పరామర్శించి

09/03/2018 - 00:17

చివురు వెచ్చని వెనె్నల
నవమి గడచి
మెత్త తెలిరేకు నొత్తిన
మెలపులోన
తగులమెంతయు సాగెడు
తావి బఱపి
సన్న సంపంగి నవ్వెను
చాటు నుండి...

నీలి కాసార గగనంపు
నీళులందు
చుక్కలను బోలు కల్వల
లెక్కలేదు
విచ్చుకొన్నవి తారకల్
విభ్రమమున
పుడమికిన్ స్వర్గమునకొక్క
ముడి రచించి...

Pages