S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

06/24/2019 - 22:43

కాలం
ప్రవహించే క్షణాలన్నీ
చిగురు బంధంగా అనుబంధమైంది
సీతాకోక చిలుక తోటలో
దీపమై వెలిగింది
చీకటి హృదయంలో
నిశ్శబ్దంగా తేదీల్లో చిక్కుకున్న కాలం
గాయాలకు అనుభూతుల వెల్లువైంది
మళ్లీ మళ్లీ చినుకులా
మనసు వెనుక పరిమళించే పువ్వులా
కొత్త వెలుగులు
కొద్ది రోజులకు ముందు
సీతాకోక ఓ గొంగళీపురుగు
నేడు అందాల హరివిల్లు తోటలో

06/24/2019 - 22:41

నీ ప్రతి అక్షరం
నా మానస వీణను
మీటుతూ

నీ ప్రతి పదం
నా హృదయాంతరాళాన్ని
స్పృశిస్తూ

నీ ప్రతి వాక్యం
నా మనోఫలకాన్ని
పలకరిస్తూ

నీ సాంగత్యం
నా మూర్తిమత్వాన్ని
తీర్చిదిద్దుతూ
నను మనిషిగా
నడిపిస్తున్న నీకు
ఏమివ్వగలను?

హృదయపూర్వక
ఆలింగనం తప్ప...
- కయ్యూరు బాలసుబ్రమణ్యం
9441791238

06/17/2019 - 22:53

ఆ చౌరస్తాలో
మేకవొకటి ఎదుగుతున్నది
ఈ కాంక్రీటు వనంలో
ఆ నాలుగు కాళ్ళ అమాయకత్వం
మేత వెతుకుతున్నది
కదిలే ఆ మాంసంపై ఎన్ని దొంగ చూపులున్నాయో
ఇంకెన్ని కళ్ళు లొట్టలేసుకుని చూస్తున్నాయో
ఆ క్రూరజంతువు ఎటూ తప్పిపోకుండా
ఏ కనుచూపు కంచె కాపు గాస్తున్నదో..

06/17/2019 - 22:51

విధి నన్ను చూసి వెక్కిరిస్తోంది
నీకై నే నిర్మించుకున్న ఊహాసౌధాన్ని
పునాదుల్లేకుంటా కూల్చేశాననీ

గడ్డిపరకలు సైతం
గలగలమంటూ నవ్వేస్తున్నాయ్
కడసారి కదలివెళ్లిన నీ అడుగుల
గుర్తుల్ని చీల్చేస్తూ మొలకెత్తామనీ...

కాలం విర్రవీగుతోంది
నీకు నాకు మధ్య దూరాన్ని
ఒక జీవిత కాలం పెంచేశాననీ...

06/17/2019 - 22:50

అది తప్పేం కాదు
అప్పుడప్పుడు
చెప్పుల్లేకుండ నడవడం..

ఏ గతుకుల్లేని
గంభీరమైన
సిమెంటు రోడ్డుమీదే కాదు
గులకరాళ్ళు, గుండ్రాళ్ళు, సూదిరాళ్ళు
చుప్పనాతి ఎదుర్రాళ్ళ మీదుగా
కరుకు గరుకు రాళ్ళ మీదుగా చూసుకుంటూ
సున్నితంగా సుతారంగా ప్రయాణించు..

06/17/2019 - 22:48

ఇంకెన్ని రోజులు...
ఉప్పొంగే సముద్ర తరంగాలను ఏమార్చి
బాధాతప్త హృదయంతో
ఎగసే ఉల్లాస జ్వాలలను.. చల్లార్చి
ఆవేదనా భరిత కన్నీటితో
కుళ్ళు సమాజానికి భయపడి
నీలో నీవే కుమిలిపోతావ్...

06/10/2019 - 21:50

ధ్వనులు లేకుంటే
ప్రతిధ్వనులెక్కడివి!
వెరసి వాటి సంఖ్య
అసంఖ్యాకంగా పెరిగిపోతుంది
ధ్వనులకు మరణముంటుందా!
బహుశా అవి
జ్ఞాపకాల్లో బతుకుతాయ.

06/10/2019 - 21:49

భాషణం..
సాగరంపై కదలని అలల్లా
నిశ్చలమైనప్పుడు
సంభాషణం సాఫీగనే సాగుతది

మాటలకు, చేతలకు
కొంచెమైనా పొంతన కుదరనప్పుడే
అసలు కత మొదలైతది

చెప్పేది, చేసేది ఒక్కటి కానప్పుడు
ప్రవచించిన ప్రవచనాలు
క్రియలు, ప్రక్రియలు కాలగమనంలో
మంచులా కరిగిపోతాయ!

06/10/2019 - 21:46

కళ్ళు నులమక ముందే
వేళ్లు తాకాలి సెల్లు
ఫేస్ కడగకముందే
ఫేస్‌బుక్ చూడాలి
టీకప్పు చేతబట్టి
వాట్సాప్ చేయాలి
టిఫిన్ ముగిసే లోగా
ట్విట్టర్ తిరగెయ్యాలి
ఇంటి గడప దాటకముందే
ఇన్‌స్టాగ్రామ్ చెక్ చెయ్యాలి
రోడ్డు దాటుతుండగా
అప్‌లోడ్, డౌన్‌లోడ్లు
సందు దొరికిన చాలు
సందేశాలూ... లైక్‌లు
సెల్లు.. నిత్యమూ అరచేతిలో శోభిల్లు

06/03/2019 - 23:40

వాసంత సమీరానివై
వలపు పల్లవమును స్పృశిస్తూ
మోహన వాహినిలో
సరాగాల రాగకృతులను
సవరిస్తున్న వేళ
నేనొక విరహ వీక్షణనై
గోపికా తరళీక్షణనై
ప్రణయ చరణాల సుధాశృతి
గ్రోలుచున్నాను
కళాతృష్ణ తెలియని
నా గళ ద్వారం చెంత
నీ ప్రేమ గీతాల రుచులను
నింపుకొనుచున్నాను
ఈ వౌన వెదురుమీద
విపంచి సవ్వడులు వినిపించినట్టు

Pages