S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/08/2018 - 23:31

‘బొంబాయి మిఠాయి...
బొంబాయి మిఠాయి...’
వాకిట్లో డొక్కు సైకిల్ పిల్లగాని సైరన్..
జ్ఞాపకాల తేనెతుట్టెల్ని కదిలిస్తూ
గొంతు చించుకుని అరుస్తున్నాడు

కిర్రు.. కిర్రు... చెక్క గిలక చప్పుడు
ఇంకా మూసుకుపోని ముప్పైయేండ్ల కిందటి
ఈస్ట్‌మన్ కలర్ సినిమాను చూపిస్తోంది
పాత సినిమా రీళ్ళలోని ఫ్రేముల్లా
అంతా... దృశ్యాదృశ్యమై కనిపిస్తోంది

07/08/2018 - 23:26

భావాలకు రూపంగా
మనుషులు జీవించే జాడ
ఎంత వెతికినా కనపడని
పొద్దుపొడుపు నీడ
దార్శనికుల ప్రస్తావన అవసరమనిపించినా
మేధోమథనం సులభగ్రాహ్యమవునా..

07/08/2018 - 23:24

గ్రంథం: అనంతపద్యం
(అనంతపురం జిల్లా పద్య సాహిత్య వికాసం)
రచన: డా: అమళ్ళదినె్న వేంకట రమణప్రసాద్,
793 పుటలు; వెల: రూ.900లు;
ప్రతులకు
రచయిత, 3/696, రామాలయం దగ్గర,
సోమనాథనగర్, అనంతపురం- 505004,
నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ, హైదరాబాదు-27
*
‘‘ఆలయాలపైన/ అలమసీదులపైన/ చెర్చిపైన చేరి సేద దీరు/
పావురాలకేది పరమత ద్వేషంబు/ మలిన పడెను మనిషి

07/08/2018 - 23:23

చెరగనీకు పెదవులపై
చంద్రవంక చిరునగవు
చేయబోకు ఎడదనెపుడు
వెతలకింక తావు

ఆటుపోట్ల తాకిడికి
వెరవబోదు రేపు
కలతలు కన్నీళ్ళు
కలకాలం మనలేవు

ఎండకైన వానకైన
కొండ చెక్కుచెదరదు
తన గొంతు ఎండినా
ఎడారింక బెదరదు
రేయైనా పగలైనా
నది నడకనాపదు
ఋతువులెన్ని మారినా
చెట్టు ఎపుడు జడవదు

06/25/2018 - 05:27

దుఃఖపు చెట్టు కింద
ఒక్కడివే అలా కుమిలిపోతావేం?
శోకపు నుడిగాలికి
ఒంటరి ఈతచెట్టులా అల్లాడిపోతావేం?
నిరాశాలోయల్లో
ఒంటరి గబ్బిలమై అలా సంచరిస్తావేం?
తలా యంత వడపప్పు పంచినట్టు
బాధనో గాథనో పంచుకో
మనిషితోనో.. మానుతోనో!

06/25/2018 - 05:22

చచ్చింది మాత్రం వాస్తవం
భార్యా ఇద్దరు పిల్లల్ని
ఎటూ కాకుంట చేసే
మరణించింది మాత్రం నిజం

అతుకుల సంసారం
గతుకుల తొవ్వ
ఒక్కోసారి తట్టుకొని బోర్లాపడుడు
అప్పుడే లేచి దులుపుకొని నడిసుడు

పొద్దటిది పొట్టకు
మాపటిది బట్టకు
బీడీలు ఎన్ని చేసినా
సాంచాలు ఎంత నడిపినా
బతుక్కు బీడీలు మరింత బిగ్గితైతున్నయ్

06/18/2018 - 00:18

పువ్వుల్ని చూడగానే
మహాత్ములు గుర్తుకొస్తారు నాకు
బాగున్నావా అని ఆప్యాయంగా వారు
పలకరిస్తున్నట్లుంటుంది నా మనసుకు
అయ్యో, నేనెప్పుడైనా ఈ దేశానికి
కాస్త పరిమళం పంచానా అని దిగులుపడుతుంటాను
పరిమళాల మాట అట్లా ఉంచితే
దేశానికీ నేనంటించిన మురికి గురించి సిగ్గుపడుతుంటాను...

06/18/2018 - 00:16

మనిషిగా పుట్టి
మట్టిమీద పాదం మోపి
కులాల కుంపటిలో కుమిలి కుమిలి
కన్నీటి సంద్రంలో తడిసి తడిసి
వెక్కిరిస్తున్న లోకాన్ని చూసి

06/18/2018 - 00:14

వొళ్ళు విరుచుకుంటున్న
నాల్గు గోడల మధ్య
వేలాడుతున్న శూన్యాన్ని
ఒంటరిగా తెరిచిన కళ్ళతో చూశాను.

06/18/2018 - 00:10

పసిపాప నవ్వింది
పుప్పొడి రాలింది

లేత పెదవి విచ్చింది
పాలోసుకుని వరికంకి పొంగింది

చిట్టిచిట్టి చేతులతో మబ్బుల్ని నిమిరింది
నీటి తడి నేలను తడిమింది

నింగి ఇంద్రధనస్సునెక్కుపెట్టింది
బోసి నోరు తొలి శబ్దం విడిచింది

నెలబాలుడికి అరికాలు తాటించింది
వెనె్నలసోన సొగలిడిచి సోలిపోయంది

Pages