S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

11/21/2019 - 22:22

తే.గీ. కాసు లేకున్న ఁ గంటికి ఁగానరాము
కాసు ఁ గల్గినఁ జుట్టూత ఁ గాంచుజనులు
మనుషులకుఁగాను కాసుకి మ్మహిమ విలువ
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

11/19/2019 - 22:54

మానవుని నిత్య చైతన్యం చేసేది సాహిత్యం. మంచి ఆలోచనలతో సమాజాన్ని అభివృద్ధి పథంలోకి నడిపే అద్భుత శక్తి సాహిత్యానికి వున్నది. అక్షరం నుంచి సాహిత్యం వస్తుంది. అక్షరం సాక్షాత్ పరమేశ్వర స్వరూపం. సకల వాఙ్మయం ఈశ్వరుని ఢమరుకం నుంచి ఆవిర్భవించినదే. ‘శీతే జగదస్మిస్నితి శివః’ అనగా శివుడే సర్వ జగత్తునకు అధిష్టాన దేవత.

11/18/2019 - 23:13

తే.గీ. అర్థరహితమైనట్టి యరుపులేల?
వ్యర్థ వాదాలకిమ్మహి వణుకుటేల?
కోపతాపాల బరువెక్కు గుండెలేల?
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

11/17/2019 - 22:21

మంచు కురిసే శీతాకాలం ప్రారంభమయిందంటే స్వామియే శరణం అయ్యప్పా అని భక్తాగ్రేసరుల భజనలు పల్లె, పట్టణం తేడా లేకుండా ప్రతిధ్వనిస్తాయి. గతంలో పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ దీక్షలు, నేడు మారుమూల గ్రామాలకు సైతం విస్తరించి, భక్తజనం నానాటికీ పెరుగుతున్నది. కార్తీక మాసం ప్రారంభం నుండి వివిధ సమయాలలో ఆచరించే అయ్యప్ప స్వామి దీక్షలు భక్తిశ్రద్దలకు, పవిత్రతకు, నియమాలకు ప్రతీకలు.
అయ్యప్ప అవతారము

11/17/2019 - 22:16

తే.గీ. స్థితిపరులుగాగ నెందరో చేరవచ్చె
దరది కొరవడి నంతటఁదరలి పోదు
రెంత చోద్యమ్ము బంధమ్ము లంత హీన
మా? మనుజలక్ష్మణమ్మిదా? రామ రామ
చూడుమో కర్మసాక్షి ! యో సూర్యదేవ!

11/12/2019 - 19:03

70, 71 శ్లోకములు

శతతే ‘నారతా’ శ్రాంత సంతతా విరతా నిశమ్
నిత్యా ‘నవరతా’ జస్రమప్యథా’ తిశయో భరః
అతివే ల భృషా త్యథా మాత్రోద్గాడ నిర్బరం
తీవైకాంత నితాంతాని గాఢ బాధ దృడాని చ

11/11/2019 - 19:00

65, 66, 67 శ్లోకములు
ప్రచేతా వరుణఃపాషీ యాదసంపతి రప్పతి
శ్వసనః స్పర్శనో వాయుర్మాతరిశ్వా సదాగతిః
పృషాధ్వషో గంధ వాహన ‘నీలా’ శుగాః
సమీర మారుతం రుజ్జగ త్ప్రాణ సమీరణాః
సభస్వధాత పవన పవమానప్రభంజనాః
ప్రకంపనో మహావాతో యుఞ్ఘవాతః

11/08/2019 - 19:47

56,57,58,59 శ్లోకములు
అగ్ని వైశ్వానరో వహ్ని ర్న ర్వీతృహోత్రో ధనంజయః
కృపీటయో నిజ్వలనో జాతవేదాస్త నూనపాత్
బర్షిః సుష్మా కృష్ణ వర్మా శిచిశే్కష ఉషర్బుధః
ఆశ్ర్యాశో బృహద్భానుః కృశానుహు పావకణాలః
రోహితాశ్వో వాయసఖః శిఖావానషుక్షణిః
హిరణ్యరేతా హుభుగ్ దహనో హవ్యవాహనః
సప్తార్చిర్దమునాః శుక్త్ర శ్చిత్రభానుర్విభావసుః
శుచిరప్పిత్తవౌర్వస్తు వాడవో వాడవానలః

11/07/2019 - 19:23

బలిచక్రవర్తిని మూడు అడుగులు కోరగా, ఒక అడుగు భూమి మీద, రెండవ అడుగు ఆకాశంలోని ఆధ్యాత్మిక ప్రపంచాన్ని రంధ్రం చేయగా, అక్కడి నుంచి పవిత్ర ధార (గంగ) బయటకు వచ్చి మేఘం రూపంలో తేలుతుంది. (గంగని సంస్కృతంలో జలనభ అంటారు. జల= నీరు, నభ= ఆకాశం, ఆకాశంలో నీరు అంటే మేఘం అని అర్థం) విష్ణుపాదం తగిలినందువలన గంగను విష్ణుపది అని, భగవత్ పది అని పిలుస్తారు.

11/06/2019 - 20:18

వృష= ధర్మము గలవాడు, ఇంద్రుడు; వస్తోష్పతిః= స్వర్గమునకు రక్షకుడు, ఇంద్రుడ; సురపతిః= స్వర్గమునకు అధిపతి, ఇంద్రుడు ; బలారాతి= బల+ ఆరాతి=బలం కలిగినవారు+శత్రువు= రాయసులు+ శత్రువు = రాక్షసులు+శత్రువు =ఇంద్రుడు, శచిపతిః= ఇంద్రుడు; జంబ+్భది= వజ్రాయుధం పేరు జంబ+ ఛేదించిన= జంబ అనే వజ్రాయుధమును ఛేదించుట వలన ఇంద్రునకు జంబభేది అనే పేరు వచ్చింది.

Pages