S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

07/05/2019 - 19:41

వీరేశలింగం నవభావాలు యువతరానికి ఎంతో నచ్చాయి. అందుకే వారాయన వెన్నంటి నిలిచారు. సంస్కరణలకు ముందుకు వచ్చారు. పీఠాధిపతుల లోపాలు, లొసుగులు బయటకు లాగారు. సమాచార సేకరణలో, సంరక్షణలో ఎంతో తోడ్పడ్డారు. అలాగే ఎందరో శ్రేయోభిలాషులు, దాతలు సంస్కరణాభిలాషులు ఆ మహనీయునికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయపడ్డారు.

07/04/2019 - 18:47

1899లో గోల్డ్‌స్మిత్ నవల ‘వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్’ ఆధారంగా రాజశేఖర్ చరిత్ర అనే తొలి తెలుగు నవల రాశారు. దేవుళ్లు, రాజులను గాక మానవుడ్ని కథానాయకుడిగా తీసుకున్నారు. మొత్తంపైన ఆయన రచనలు వందకుపైనే వుంటాయి. క్రొత్త గ్రంథాలు రాయడమేగాక, పాతవి పరిష్కరించి ప్రచురించారు. వ్యాకరణం రాశారు. ఆఖరుకు వైజ్ఞానిక దృష్టితో జీవశాస్త్రం, ప్రకృతి శాస్త్రం వంటివి తెలుగులోకి తీసుకువచ్చారు.

07/03/2019 - 19:40

1874లో తానే వివేకవర్థని పేరుతోమాసపత్రికను ప్రారంభించారు. దానికి అనుబంధంగా హాస్య సంజీవని అనే మాసపత్రికను ప్రారంభించారు. తనపైన, తన రచనలపైనా ఛాందసులు చేసే విమర్శలను ఎదుర్కోవడానికి, సాంఘిక దురాచారాలను ఖండించడానికి ఆయన దాన్ని సాధనంగా చేకున్నారు. పెద్దయ్యగారి పెళ్లి అని పామరులు చెప్పుకున్న బ్రహ్మ వివాహం ప్రహసనము ఈ పత్రికలోనే మొదట వెలువడింది.

07/02/2019 - 19:31

ఆ తర్వాత 1874లో తానే వివేకవర్థని పేరుతో మాసపత్రికను ప్రారంభించారు. దానికి అనుబంధంగా హాస్య సంజీవని అనే మాసపత్రికను ప్రారంభించారు. తనపైన, తన రచనలపైనా ఛాందసులు చేసే విమర్శలను ఎదుర్కోవడానికి, సాంఘిక దురాచారాలను ఖండించడానికి ఆయన దాన్ని సాధనంగా చేకున్నారు. పెద్దయ్యగారి పెళ్లి అని పామరులు చెప్పుకున్న బ్రహ్మ వివాహం ప్రహసనము ఈ పత్రికలోనే మొదట వెలువడింది.

07/01/2019 - 19:52

విద్యార్థి దశలో ఆయన అసమర్థుడైన ప్రధానోపాధ్యాయునికి వ్యతిరేకంగా పోరాడి, వెనక్కు పంపించారు. చదువులలో ప్రతిసారీ ప్రథములుగా వచ్చి అనేక ప్రశంసలు, సహాయాలు అందుకున్నారు.

06/30/2019 - 22:38

సుప్రసిద్ధకవి, రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారు 1936లో రెండవ ముద్రణకు పీఠిక రాస్తూ, తన హోదాను ‘వీరేశలింగ మహాశయుని శిష్య పరమాణువు’ అని రాసుకవోడం ఆ గురుశిష్యులిద్దరి గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. హితకారిణీ తరఫునే స్వీయ చరిత్రను సంగ్రహ ముద్రణ వెలువడింది. 1971లో నేషనల్ బుక్‌ట్రస్ట్ వారు కూడా సంగ్రహ ముద్రణ వెలువరించారు.

06/28/2019 - 20:01

ఆయన గురించి అమూల్యమైన పరిశోధన చేసిన అక్కిరాజు రమాపతిరావు గారన్నట్లు4రాజారామ్ మోహనరాయ్‌కి మహాత్మాగాంధీకి మధ్యకాలపు తెలుగుదేశపు సాంఘిక, సాహిత్య వైద్యా వైజ్ఞానిక రంగాల చరిత్ర.

06/27/2019 - 22:19

జాతీయ పునరుజ్జీవం, సామాజిక పునర్నిర్మాణం వంటి భావనలు ఆలోచింపజేశాయి. జీవితానుభవాలు, అవసరాలకు తోడు ఇంగ్లీష్ వారి సాంఘిక, సాంస్కృతిక ప్రభావం కూడా ఇందుకు ప్రేరేపించింది. తరతరాలుగా పాతుకుపోయిన సాంఘిక దురాచారాలు మేధావులను, ఆలోచనాపరులను కలవరపరచాయి.

06/26/2019 - 22:22

కార్యశూరుడు వీరేశలింగం, కదంపట్టి పోరాడిన సింగం, దురాచారాల దురాగతాలను తుదముట్టించిన అగ్నితరంగం22 అని మహాకవి శ్రీశ్రీ ఆయనను అభివర్ణించారు. 34కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు, వీరేశలింగమొకడు మిగిలెను చాలు22 అని ఆరుద్ర ఆయనకు నివాళులర్పించారు. 34ఆధునిక కాలంలో అగ్రగణ్యుడైన ఆంధ్రుడు22 అని కట్టమంచి రామలింగారెడ్డి అంటే 3ప్రముఖ భారతీయులలో ఒకడు. లోతైన వివేచన, అంతులేని సాహసము, అమితమైన శక్తి కలవాడు.

06/24/2019 - 22:53

మరికొంచెం ముందుకెళ్లి శ్రీశ్రీకంటే ఎక్కువగా కవిత్వ భాషను విప్లవీకరించిన ఘనత ఆరుద్రది అని కూడా ప్రకటించారు కెవిఆర్. నిజానికి ఈ వ్యాసపరంరలో ఆరుద్రమీద చాలా వ్యాసాలున్నాయి. కవిత్వంలో ఆరుద్ర బహుళ రూపాల్ని విశే్లషించే ప్రయత్నం కెవిఆర్ ఈ వ్యాసాలలో చేశారు.

Pages