S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

02/22/2019 - 20:40

రావుగారు చలికి తట్టుకోలేక వణికిపోతూ వుంటే ఆమె గాలి లోపలకు రాకుండా వుండేందుకు తలుపు వేసింది.
ఆయన సంతోషించి సూట్‌కేస్‌లోని బిస్కెట్ ప్యాకెట్ తీసి, కొన్ని తాను తీసుకుని ఆమెకి కూడా ఇచ్చాడు.
ఆకలి బాధ కొంతవరకు తీరింది.
గాలివాన ఇంకా ఉధృతమవుతోంది. దగ్గర్లోనే ఏదో కూలిపోయిన పెద్ద శబ్దం. రావుగారు తృళ్లిపడి, ఒక్క గెంతులో ఆమెవైపు దూకి ఆమెను కరచుకుపోయాడు.

02/21/2019 - 19:27

ఆయనకు జీవితంలోని అనేక అంశాలమీద దృఢమైన అభిప్రాయాలున్నాయి. అవన్నీ ఓ లాజిక్‌తో నిండి వుంటాయి.
ఆయన వేదాంతి, జీవితానికి, వేదాంతానికి మధ్య వున్న అనుసంధానం గురించి అనర్గళంగా మాట్లాడుతారు.
ఆయన మంచి ఉపన్యాసకుడు కూడా. వేదాంతానికి సంబంధించిన ఒక అంశంమీద వేరే వూళ్ళో ఉపన్యసించటానికే ఆయన రుూరోజు ప్రయాణం.

02/20/2019 - 19:43

తెలుగు కథకుల్లో పాలగుమ్మి పద్మరాజుగారికొక విశిష్టస్థానముంది. కొడవటిగంటిగారిలా, త్రిపురనేని గోపీచంద్ గారిలా ఆయన ఎక్కువ కథలు రాయలేదు. బుచ్చిబాబుగారిలా చాలా పరిమితంగా రాశారు.
ఆయన్లో వున్న విలక్షణమైన విశేషమేమిటంటే- కథావస్తువుల్ని ఎంచుకోవడంలో ప్రదర్శించిన వైవిధ్యం.
ఒక రచయిత సుప్రసిద్ధుడవాలంటే- రుూవైవిధ్యమనేది ఎంతో అవసరం.

02/19/2019 - 20:37

వ్యవస్థలోని దుర్లక్షణాలుగా అందరూ గుర్తించిన కొన్ని కాలదోషం పట్టిన సామాజిక అవగుణాలను చిత్రించి గూడా ఏ వ్యాఖ్యానమూ చెయ్యడు. బహుభార్యా కుటుంబ కథలు- భోగ కాంతా వ్యవస్థ-జంతు బలులిచ్చే కొలువులు- ఇట్లాంటివాటిలో రచయిత ఏ పక్షాన ఉన్నాడో ఇతమిద్ధం కాదు. వాదనలతో సమర్థించటం, కాపుకాయటం- నిరాకరించటం- సమర్థించటం- అతని స్వభావం కాదు- ‘‘వ్యవస్థ గురించి కాదు నా పట్టింపు.

02/18/2019 - 18:43

స్తంభన అనే కథ, బిందురేఖ అనే కథ మళ్లీ మళ్లీ చదివితే కథలు కవితాకథలు కావటం అంటే ఏమిటో తెలుస్తుంది. అమరావతిలో ఒక్కసారిగా గాలి స్తంభించిపోయింది. ఉక్కపోసింది. ఇంతలో ఎక్కడనుండో గాలి వచ్చింది.

02/17/2019 - 22:21

కావ్యాలలో నాటకీయతను గురించి తరచుగా విమర్శకులు చెపుతుంటారు. ఆ నాటకీయతకన్నా శ్రవ్య నాటకీయత ఇంకొంచెం భిన్నం. రంగస్థల నాటకాల కంటే శ్రవ్య నాటకాలకు భిన్నమైన గుణాలు ఉంటాయి. రంగస్థల నాటకాలన్నీ రేడియో నాటకాలు కాలేవు. శ్రవ్య మాధ్యమానికి కావలసిన నాటక గుణాలు వేరు. అవి శంకరమంచి వారి అమరావతి కథలలో కనిపిస్తాయి- అతనే వ్రాసిన హరహర మహదేవ రేడియో నాటకం చాలామందికి గుర్తు ఉండే ఉంటుంది.

02/15/2019 - 19:44

ఇదివరకు అమరావతి పేరు వినగానే అందరికీ అపురూప శిల్పాలు జ్ఞాపకం వచ్చేవి. 1980 తర్వాత అమరావతి పేరు వింటే సాహిత్య పాఠకులకు సత్యం శంకరమంచి పేరు జ్ఞాపకం రావటం మొదలైంది. అతను ఆకాశవాణిలో నాటక రచయిత, ప్రయోక్త, కథకుడు, అప్రకటిత కవి, కాల్పనికుడు, మనస్వి, అతి సున్నితమైన స్పందనలు గలవాడు. లోలోపల ఎంత మాట్లాడుకుంటాడో బయటకు అంత మితభాషి కూడా అనుకుంటా.

02/14/2019 - 19:54

నెమ్మదిగా పులి సాహచర్యంతో ఈ దేశంలోని పెద్ద మనుష్యులకి, వ్యాపారస్తులకి కూడా ఆవుతలలు, పులి తోకలు నప్పాయి. ఎవరికీ అవి ఎబ్బెట్టుగా లేదు. అంచేత కథకుడు ఎవరన్నా మెడమీది మనిషి తలకాయ వున్నవాడు దొరుకుతాడేమో మాట్లాడదామని బయలుదేరడంతో కథ ముగుస్తుంది. వ్యాపార సంస్కృతిని ఈ కథ ఎద్దేవా చేస్తుంది.

02/13/2019 - 20:11

ఈ మాటలు ఒక హెచ్చరికనో, ప్రమాద సూచికనో, జాగురూకతనో తెలియచేయడానికి ఇలాంటి మాటలు తరచు గ్రామాల్లోనే, లేదు లౌడ్ స్పీకర్లో పట్టణాల్లోనో విన్పిస్తాయి. వాస్తవానికి నగ్నముని కథలు నగర జీవితానికి సంబంధించిన కథలు. అంచేత ఈ హెచ్చరిక ప్రమాద సూచికను ఎగురవేసే విధంగా వుంది. ఈ ఎజెండాలోని మాటలు ఒక రాబోయే విపత్తునో, సమీపించిన నెత్తిమీద పెనుముప్పునో తొలగించుకోమనో చెప్తున్నట్టుగా వున్నాయి.

02/12/2019 - 20:52

వాస్తవానికి ఏ మాత్రం భావ వ్యక్తీకరణకి మార్గం లేనపుడు, రచయిత తాను చెప్పదల్చుకున్న దృక్పథం చెప్పి తీరాలనే నిబద్ధత కల్గి వున్నపుడు సహజంగానే ప్రతీకలనీ, సంకేతాలనీ ఆశ్రయిస్తాడు. వ్యంగ్యం, కసి, క్రోధం ఆధారంగా చేసికొని పాత్రలని తలకిందులుగా ప్రవర్తింపజేసి - పాఠకులకి తత్కాలీన పరిస్థితుల్ని పరోక్ష పద్ధతిలో అర్థం చేసికొనే పరిస్థితుల్ని కల్పిస్తాడు.

Pages