S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

05/07/2018 - 21:53

వంద యేబది కావచ్చు. అన్నీ చెక్కు చెదరక వారి స్మృతిపథంలో వుంటాయి. శాస్ర్తీగారు కావ్యరచన చేసే పద్ధతి ఇది. ఇదే ధ్యానతత్పరుడి అనే పంక్తిలోని రహస్యం.

05/04/2018 - 21:47

సంస్కృతంలో రామాయణం ఆదికావ్యమైతే, తెలుగులో మహాభారతం ఆదికావ్యం. ఇది కవిత్రయ కృతం. ‘అందు ఇది దొడంగి మూడు కృతులు ఆంధ్ర కవిత్వ విశారదుండు, విద్యా దయితుం డొనర్చె మహితాత్ముడు నన్నయభట్టు దక్షితన్ అని చెప్పి తిక్కన సోమయాజి పదియేనింటి తెలుగు చేసెదనన్నాడు. కథ ముగించి ‘హరిహరనాథ సర్వభువనార్చిత నన్ను దయజూడు మెప్పుడున్’’ అని చెయ్యి కడుక్కొన్నాడు. తిక్కన లెక్క ప్రకారం పదునెనిమిది పర్వములు వెలువడినవి.

05/03/2018 - 21:33

పడుపు వృత్తిలో దయనీయమైన స్థితిని అనుభవిస్తున్న అభాగినుల్ని ఇలా వర్ణించారు.
ఓ భోగంచానా! నీవు
సంఘానికి వేస్టు పేపరు బాస్కటువా?
మష్టు మషాణము
పడవేయబడునట్టి దిబ్బవా
ఇలా అన్నారంటే పఠానికి భోగం చానల మీద సానుభూతి ఉన్నట్టే. అందుకే ‘రక్తంలేని వారి అధరాలపయి, అంటుకొనియున్నది మాసిక హాసరేఖ’ అని అనగలిగారు. పడుపు వృత్తి పడతికన్నా మిగతా ప్రపంచమంతా అబద్ధం అని భావించారు పఠాభి.

05/02/2018 - 21:37

పద్యాల సంగతి అలా ఉంచితే ఈనాటి వచన కవితలో కనిపించే అంతర్లయ, భావలయ, ఊపు, విరుపు మొదలైన గుణాలేవీ ఈ కవితలలో కనిపించవు. గ్రాంధిక రూపాలు, వ్యవహారిక రూపాలు చెట్టాపట్టాల్ పట్టుకొని పోతుంటాయి. గ్రాంథిక భాషను ఎగతాళి చేయటానికే ఇలాంటి భాష వాడారు పఠాభి. ఫిడేలు రాగం అనే చివరి కవితలో అక్షరాలు రాయటంలో కూడా తిక్కవరపువారు కొంత తిక్క మనస్తత్వాన్ని ప్రదర్శించారు.

05/01/2018 - 21:27

కవిత్వాన్ని ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
మొదటిది ప్రభావ కవిత్వం
రెండవది ప్రసార కవిత్వం
మూడవది ప్రయోగ కవిత్వం
జాతికి అవసరమైనపుడు నిర్మాణాత్మకమైన గొప్ప భావాలతో ముందుచూపుతో కొత్తదారిని చూపించగలిగేది ప్రభావ కవిత్వం. గురజాడ, శ్రీశ్రీ మొదలైన కవులు ప్రభావ కవులు. మరో మాటలో చెప్పాలంటే సాహిత్య చరిత్రలోని యుగకర్తలు ప్రభావ కవులన్నమాట.

04/30/2018 - 21:07

సీతారామమూర్తిగారి ధోరణి వేరు. వారు అన్య కవుల మాదిరిగా పురాతనాంధ్ర వైభవాన్ని పుష్కలంగా కొనియాడినవారే. కాని అంతటితో వారు ఆగిపోలేదు. ఆంధ్రత్వాన్ని గూర్చి వారు ఆరాటపడినారు. ఆంధ్రోద్యమం తీరూ తెన్నూ చూచి ఆవేదన పొందారు. ఇదే సీతామమూర్తిగారిని ఇతర కవులనుండి వేరుచేసింది.

04/29/2018 - 22:52

ఇరవయ్యో శతాబ్దపుటాంధ్ర కవుల్లో విలక్షణకవి అయిన కీ.శే. శ్రీ తుమ్మల సీతారామమూర్తి ‘రాష్ట్ర సిద్ధికొరకు రక్తమ్ముగార్చిన కవిని నేను’ అనీ ‘నేనఁగాఁ ద్రిలింగధరణీ హిత గాఢతపోగ్ని దుర్భరగ్లాని సహించినట్టి ఋషికల్పుఁడు మామక రాష్టగ్రామనముల్ వీనుల సోఁకి, రుూ తెలుఁగు విశ్వము మేల్కొనె’ననీ ధీర గంభీరంగా ఆత్మవిశ్వాసంతో చెప్పుకొన్నారు.

04/27/2018 - 23:24

‘‘ప్రణయ దుఃఖాన్ని మండి
నీలమై వంగి వాపోవు నింగి నెలత
నా కడనె నేర్చె బ్రణయ నియతి...’’

04/26/2018 - 23:52

‘‘ఈ నవవేణుదండ మిటువేటికి జెక్కెదవేల చిల్లులై
పో నొగిలింతువం చడలిపోయితి; వ్యర్థపు టూర్పుగాడ్పులన్
గానముగాగ మార్చుటకెగా యని యిప్పుడె నే గ్రహించితిం
గాని విశీర్ణమీ హృదయనాళమెటుల్ పలికింతువో ప్రభూ’’

04/25/2018 - 21:25

ప్రవాసి పద్యాలలో భగ్నజీవిని చూపిస్తారు వేదుల
‘‘ప్రేమ కఠోరతల్ చిదిమి పెట్టిన దుర్దివ సావసాన లే
హిమ సృణాంధకార పటలమ్ముల చాటున దాగి యెవ్వరో
కోమల తారకాద్యుతి నిగూఢరవమ్ముల రమ్మటంచు నన్
వేమరు బిల్చుచున్న సరణిన్ మదిదోచు బ్రతిక్షణమ్మునన్..’’

Pages