S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

08/30/2018 - 19:46

నిషేధం తొలగించిన తర్వాత ఈ నాటకం మూడవ ముద్రణ సెప్టెంబరు 1957లో ప్రచురించబడింది. ఆ తరువాత 1962 ఆగస్టులో, 1972 మార్చిలో, 1980 సెప్టెంబరులో, 1996 జూన్‌లో పునర్ముద్రణలు పొందింది. ఈ నాటక ప్రదర్శన స్వర్ణోత్సవం 1996లో జరిగింది.

08/29/2018 - 18:50

ఆధునిక సాంఘిక నాటక రంగంలో విశిష్టమైన స్థానాన్ని సంపాదించిన మాభూమి నాటకాన్ని వాసిరెడ్డి-సుంకర అనే జంట రచయితలు రచించారు. వాసిరెడ్డి భాస్కరరావుగారిది తెలంగాణ సరిహద్దులోని నందిగామ తాలూకా, వీరుల పాడు గ్రామం. వీరు 1914 సెప్టెంబరు 2న జన్మించి, 1957 నవంబరు 1న 43వ ఏట మరణించారు. సుంకర సత్యనారాయణగారిది విజయవాడ దగ్గర ఈడుపుగల్లు గ్రామం. వీరు 1909 మార్చి 23న జన్మించారు.

08/28/2018 - 18:52

ప్రేమాభిమానాలు, గౌరవం, నమ్మకం, పారదర్శకత లేని తమ దంపతీబంధం నుంచి స్వతంత్రురాలవుతుంది ఎంతో ఆవేదనతో.

08/27/2018 - 19:08

ప్రేమమీద మతానిదీ పెత్తనమే. వీరశైవుల రాకుమారి నందినిని జైనుడైన ఉదయాదిత్యుడు ప్రేమించి- తన ప్రేమకోసం మతాన్ని వదులుకుని ఆమెను పెళ్లాడితే.. ఆమె సోదరులు మతవ్ఢ్యౌం అతనిని నరికి పోగులు పెట్టింది. తోడబుట్టిన చెల్లిలి ఆక్రందన కూడా వారిలో కారుణ్య భావనను కలిగించలేకపోయింది.

08/26/2018 - 21:46

1920ల నాటికే రాజమన్నారు ఏకాంకికలు వెలువడినా.. అవి రావలసినంత పరిగణనలోకి రాలేదని తెలుపుతూ దానికి గల కారణాలను విశే్లషించారు గోపాలస్వామి గారు.

08/24/2018 - 18:48

అసలే యుద్ధం రోజులు. ఆపై ఆర్థిక మాంద్యం
ఎటు చూసినా అనిశ్చితి. ఎవరిని కదిపినా అభద్రత
లలిత కళలు పల్లవించే ప్రభవించే వాతావరణం, అవకాశం ఉంటుందా?
సంగీత సాహిత్య వాచికాభినయాల సమ్మిళితమైన రంగస్థల వైభవం మసకబారకుండా ఉంటుందా?
ఇదీ రాజమన్నారు నాటికలకు తెరతీసే నాటి తెర వెనుక కథ

08/23/2018 - 19:31

పెళ్లయిన మూడేళ్లకు కూడా కాపురానికి తీసుకుపోకపోయినా, పెళ్లి వేళ పెట్టిన నగలను తనకు ఈయకపోయినా, కనీసం భర్త అనే ఆ వ్యక్తి తనని తొంగి చూడకపోయినా అక్కనే తలుచుకుంటూ ఆమె ఆత్మకి శాంతి చేకూర్చాలంటే తన అత్తింటివారికి ఓ శాశ్వత గుణపాఠమును చెప్పాలని భావించిన మహోపద్వేష్టి.

08/22/2018 - 19:49

‘‘మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా, కంఠే బథ్నామి శుభగే సాజీవశరదాం శతం’’-

08/21/2018 - 19:00

పాండవ విజయంలో మరొక గొప్ప సన్నివేశం గంగా, యమున, సరస్వతి నదుల సంభాషణ. నిజమునకు ఇదొక విష్కంభ సన్నివేశం. నదులతో విష్కంభ సన్నివేశం నడపడం ఒక ప్రయోగం. భీష్మవధకు గంగాదేవి విలపించడం, వధకు పూర్వాపరాలను నదులతో కలిసి చర్చించడం, హృదయవిదారకమై కరుణరసప్లావితంగా నడుస్తుంది. యుద్ధ సన్నివేశాన్ని గంధర్వులతో చెప్పించడం నాటక ప్రయోగ పరిణతికి నిదర్శనం.

08/20/2018 - 20:30

తిరుపతి వేంకట కవుల వంటి అసాధారణ ధారణా సంపన్నుల చేతిలో భారతగాధ ఆరు నాటకాలుగా విరచితమైంది. ఆరు నాటకాలలో వారి శక్తి సామర్థ్యాలకు పరాకాష్ఠగా మిగిలింది పాండవోద్యోగం, పాండవ విజయం నాటకాలే.

Pages