S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

08/19/2018 - 22:34

ఏదైతేనేం, 19వ శతాబ్దం చివర 20 శతాబ్దం తొలి భాగంలో పౌరాణిక నాటక రచన సాగింది. ఆ నాటకాలు ప్రజాదరణ పొందాయి. బలిజేపల్లివారి హరిశ్చంద్ర, ధర్మవరం వారి సారంగధర, చిలకమర్తివారి గయోపాఖ్యానం ఇవన్నీ తెలుగువారికి రసవత్ దృశ్యకావ్యాలను అందించాయి.

08/17/2018 - 18:45

అక్షరం అణువైతే అణుశక్తి సాహిత్యం
అక్షరం సుమమైతే పరిమళం సాహిత్యం
అక్షరం మనిషైతే అంతరాత్మ సాహిత్యం

08/16/2018 - 19:36

ప్రశ్నార్థకంగా నిల్చిన మధురవాణి చెవుల్లో, సత్పురుషులు చెప్పిన భగవద్గీత దగ్గర తనకి రక్షణ వుందా? లేక తన స్వానుభవం ‘‘ఒక రైతు కిల్లాలినై వంగ మొక్కలికి, మిరప మొక్కలికీ నీళ్లు పోసుకుంటే నా అన్నవారుండేవారేమో’’ అని చెప్పిన చోట రక్షణ సంరక్షణగా వుంటుందా అన్న సందేహాలు మారుమ్రోగి ప్రశ్నల్నించి ప్రశ్నల్ని పుట్టిస్తూ ఉంటాయి.

08/15/2018 - 21:16

సన్నిహితమైన ప్రతి ఒక్కరినీ సంస్కరించాలనుకున్న మధరవాణి వారెవరూ మారలేదు గాని తనకి తానుగా మంచికి మారిందనీ విశాఖ దృశ్యాల్లో సూచితమైంది. పీక్కి ఉరిపడినందువల్ల లుబ్ధావధాన్లు పశ్చాత్తాపపడి కొద్దిగానైనా మంచికి మారడుగాని అవధాన్లు కన్నా ఏడాకులు ఎక్కువ చదివిన అతని తమ్ముడు గిరీశం మాత్రం మారే స్వభావం కలవాడు కాదు గాక కాదని హెడ్‌తో దొంగ సాక్ష్యాలు కట్టే దృశ్యంలో గిరీశం చూపించిన విశ్వరూపమే నిరూపించింది.

08/14/2018 - 21:16

పాత కొత్తల కీడు కలయికగా ఉదయించబోతున్న ఒకానొక సంక్లిష్ట స్వభావం తనని తాను పరిచయం చేసుకుంటూ నాటకాన్ని ఆరంభించింది.
ఈ ఆరంభపు మెలకువలుల అర్థవంతమైన ముగింపు తొలి కూర్పులోనే వున్నాయి. అయితే అందులో పాత కొత్తల కీడు కలయిక జరిగినంతగా మేలు కలయిక జరగలేదు. ఆ గుణ దోషాల్ని బేలన్స్ చేసే ఉద్దేశంతోనే గురజాడ ఆకాశాన్ని పైకెత్తేంత విశ్వ ప్రయత్నం చేసుంటారు. ఫలితంగా నాటకం మహా నాటకమైంది.

08/13/2018 - 19:48

గిరీశం ఆషాఢభూతి స్వభావం వ్యక్తమైనంతగా మధురవాణి మేలైన స్వభావం వ్యక్తం కాలేదు. ఇక వాస్తవికత విశదీకరణ వ్యక్తమయ్యే అవకాశమే లేదు.

08/12/2018 - 22:52

అడుగుజాడ గురజాడ అది భావికిబాట
మనలో వెధవాయిత్వం మరపించేపాట
అడుగుజాడ
ఇవి శ్రీశ్రీ కవితా వాక్యాలు. ఇందులో గురజాడ సాహిత్య సారమంతా ఇమిడి ఉంది. గురజాడ అడుగుజాడని గుర్తించాలంటే ఆయన సాహిత్యాన్నంతా పరిశోధించాలి. అందుకు స్థూలంగా కన్యాశుల్కాన్ని పరిశీలించినా చాలు.
ప్రధానోద్దేశం

08/10/2018 - 19:00

క థా పరిష్కార ఘట్టంలో
సెట్టియొకడు నేను చెకుముకి శాస్ర్తీయు
కాలరుద్రు మూడు కనుల భంగి
మేము ముమ్వురమును మేల్కొని యుందుము
ప్రభువు విశ్రమంబు బడయుగాక’’
అనడం యుగంధరుని వంటి నిరంతర జాగ్రన్మూర్తికి సహజం.
సేనాని విశ్వాసరావు అన్నట్టు
ఆయన గాలిని బేనును తోయముతో నఱకు బొగలతో గోడలిడున్
ఆయన ప్రయోగ మభినవ తోయజ భవ సృష్టి పెఱది దుస్స్వప్నమగున్’’

08/09/2018 - 18:56

ఆయా పాత్రల మధ్య కథను పడుగు పేకగా అమర్చి నాటక కథా సంవిధానానికీ, మనస్తత్వ చిత్రణకీ, రసపోషణకీ త్రివేణీ సంగమంలాగా ఆంధ్రౌన్నత్యానికి అనన్య దర్పణం లాగ వేదం వారు రచించిన ప్రతాపరుద్రీయ నాటకం అసదృశ్యకావ్యం.

08/08/2018 - 19:08

ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్ ఆరేనెల్లకు పట్టుకుపోతాన్,
వీరణ్ణి రాగణ్ణి మన్ను చేయిస్తాన్,
గోతిలో పెట్టించి గోరీ కట్టిస్తాన్’’

Pages