S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

04/29/2018 - 22:52

ఇరవయ్యో శతాబ్దపుటాంధ్ర కవుల్లో విలక్షణకవి అయిన కీ.శే. శ్రీ తుమ్మల సీతారామమూర్తి ‘రాష్ట్ర సిద్ధికొరకు రక్తమ్ముగార్చిన కవిని నేను’ అనీ ‘నేనఁగాఁ ద్రిలింగధరణీ హిత గాఢతపోగ్ని దుర్భరగ్లాని సహించినట్టి ఋషికల్పుఁడు మామక రాష్టగ్రామనముల్ వీనుల సోఁకి, రుూ తెలుఁగు విశ్వము మేల్కొనె’ననీ ధీర గంభీరంగా ఆత్మవిశ్వాసంతో చెప్పుకొన్నారు.

04/27/2018 - 23:24

‘‘ప్రణయ దుఃఖాన్ని మండి
నీలమై వంగి వాపోవు నింగి నెలత
నా కడనె నేర్చె బ్రణయ నియతి...’’

04/26/2018 - 23:52

‘‘ఈ నవవేణుదండ మిటువేటికి జెక్కెదవేల చిల్లులై
పో నొగిలింతువం చడలిపోయితి; వ్యర్థపు టూర్పుగాడ్పులన్
గానముగాగ మార్చుటకెగా యని యిప్పుడె నే గ్రహించితిం
గాని విశీర్ణమీ హృదయనాళమెటుల్ పలికింతువో ప్రభూ’’

04/25/2018 - 21:25

ప్రవాసి పద్యాలలో భగ్నజీవిని చూపిస్తారు వేదుల
‘‘ప్రేమ కఠోరతల్ చిదిమి పెట్టిన దుర్దివ సావసాన లే
హిమ సృణాంధకార పటలమ్ముల చాటున దాగి యెవ్వరో
కోమల తారకాద్యుతి నిగూఢరవమ్ముల రమ్మటంచు నన్
వేమరు బిల్చుచున్న సరణిన్ మదిదోచు బ్రతిక్షణమ్మునన్..’’

04/24/2018 - 21:31

అసలు స్వేచ్ఛా ప్రియునిగా భారతీయునికి ఎటువంటి కాంక్ష ఉందో చివర పద్యంలో చెప్పారు. ఇది నిజంగా ఈ శీర్షికలో భరతవాక్యమే!
‘‘నీచపు దాస్య వృత్తి మననేరని శూరత మాతృదేశ సే
వా చరణమ్మునం దసువులర్పణ జేసిన వారి పార్థివ
శ్రీ చెలువారు చోట దదసృగ్రుచులన్ వికసించి, వాసనల్
వీచుచు, రాలిపోవగవలెన్ దదుదాత్త సమాధి మృత్తికన్!’’

04/23/2018 - 21:51

మామూలు కోపం లెక్కలోకి రాదు. ఆ కోపంలో ముక్కంటి కంటిమంట వేడివేడిగా ప్రజ్వరిల్లాలి. త్రిశూలంపై మొనలా, కొనలా, వాడివాడిగా, భయం భయంగా ఆ కోపం గుచ్చుకోవాలి. అప్పుడే శత్రువు తోక ముడుస్తాడు. ఇంత మేలుకొలుపు ఈ అక్షరాలలో గాఢంగా ఉన్నది. అంతేకాదు-
‘‘దారి తప్పిన బాటసారుల కొరకు
దారిగానని పేదవారల కొరకు
వెలిగించు కాగడా! వెలిగించవోయి..’’

04/22/2018 - 22:09

దేవులపల్లి వారి తరువాత ఆ స్థానం వేదులవారినే వరించింది. ఆయనకంటె ఈయన మూడేళ్లు చిన్న. కృష్ణశాస్ర్తీ ప్రభావం వేదులమీద ప్రసరించినా- ఎవరి కలం వారిదే- ఎవరి గళం వారిదే. పద్యం చదివినా- పాటపాడినా-వేదుల స్వరముద్రకు నీరాజనం పట్టవలసిందే. కవితాగానం చేయటంలో కృష్ణశాస్ర్తీలా వేదుల కూడా మనోజ్ఞమైన శైలిని సొంతం చేసికొన్నారు. ఉపన్యసించినా అంతే! అది చమత్కారభరితమై ఉర్రూతలూగించేది.

04/20/2018 - 22:02

ఇలా ఎన్నో కవితా ప్రక్రియలు ఆయనలో ఉద్దీపన చెందాయి. ప్రక్రియలే అలా వుంటే ఆయన నేర్చిన భాషలూ అలాగే ఉన్నాయి. సంస్కృతం, హిందీ, బెంగాలీ భాషలలో ఆయన ప్రావీణ్యం సంపాదించగలిగారు. రవీంద్రుని కవితలు, బెంగాలీ నవలలు తర్జుమా చేశారు. ఏడు పదుల వయసులో కూడా వంగని హరివిలై ఒకానొక వంగ రచనకు అనువాద భిక్షనందించారు.

04/19/2018 - 22:06

గోధుమరంగు పంచెపై - మావిచిగురు అంచు...
దానిపై గౌతమీ నదిలా.. తళతళలాడే తెల్లటి చొక్కా...
ఆ రెండింటికి మరింత అలంకారంగా నల్లగా ఆ మనీషి..
మావిచిగురు - నలుపు- అనే పదాలు వినిపించేసరికి మనకేదో గుర్తుకు రాకమానదు.
అది తప్పనిసరిగా కోకిలే కావాలి.
అందులోను అది మామూలు కోకిలైతే వసంతం వాడిపోగానే మరచిపోతాం. కాని అది గౌతమీ కోకిల.

04/18/2018 - 21:16

భావములోను, భాషలోను పాత పాటలలోని యాస, స్వచ్ఛత కొత్త పాటలలో కొరవడ్డాయి. ఈ మార్పును సమర్థించుకుంటూ శ్రీ నండూరివారు ‘‘ఏ యెడను మార్పు సహజం. మార్పు గుణమున కాయెనా, దోషమున కాయనా, అను విషయమును సహృదయ లోకమే నిర్ణయించాలి’’ అని తమ కొత్త పాటల పీఠికలో విన్నవించుకున్నారు.

Pages