S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

03/19/2019 - 22:22

చర్చల సందర్భంగా ఉమాకాన్తమ్‌గారు భారతీయ సాహిత్య శాస్ర్తియాంశాలనేకం, అనుభవ వివేచన పూర్వకంగా వివరించారు. పాశ్చాత్య వివేచకుల అభిప్రాయాలనూ పలుచోట్ల విస్తరించారు.

03/18/2019 - 19:00

ఇటీవల వెల్చేరు నారాయణరావుగారు తమ తెలుగులో కవితా విప్లవాలు గ్రంథంలో అవి జానపద స్థాయికి మించినవని నిరూపించటం, ఎంకిపాటల దుమారంలోనూ ఆ కాలంలో ఈ విషయాలు చర్చకు రావటం గమనిస్తే ఉమాకాన్తమ్‌గారి విశే్లషణ, నిరూపణలోని నిశితత్వం, ఔచిత్యం మనకు మరింత అవగాహనకు వస్తాయి.

03/17/2019 - 22:46

ఆ గ్రంథం వెలువడుతూనే తెలుగు కవితా లోకంలో అసాధారణమయిన సంచలనాన్ని సృష్టించింది. ఆనాటి భావ కవులు భావించిన తీరులో చెపితే ఆ గ్రంథంలో ఉమాకాన్తమ్‌గారు భావకవిత్వాన్ని చీల్చి చెండాడారు.

03/15/2019 - 19:37

అసలు ఈ కవిత్వ స్వభావమేమిటి? ఏనాటికయినా గర్వించదగిన భారతీయ నాగరికతా సంస్కృతుల వారసత్వం మనది. కాని, ఈ మహత్తరమయిన వారసత్వానికి, మన ఈ కవితా ప్రవృత్తి ఎంతవరకు అనుకూలంగా ఉంది? మన నిత్యజీవనంలో జీవిత లక్ష్యంతో ఈ కవితకువున్న సంబంధం ఎట్లాంటిది? జీవితంలోనూ, కవిత్వంలోనూ ఏవిధమయిన విలువలను మనం పాటిస్తున్నాము?

03/14/2019 - 18:57

ఆధునిక సాహిత్య విమర్శ ప్రస్థానంలో విప్లవాత్మకంగానూ తెలుగు సాహిత్య విమర్శను ఆరోగ్యకరమైన గొప్ప మలుపు తిప్పిన విమర్శ గ్రంథం అక్కిరాజు ఉమాకాన్త విద్యాశేఖరులు రచించిన నేటి కాలపు కవిత్వం.

03/13/2019 - 18:46

మార్పు తన్ను దాటి వెళ్లే మార్పుల్ని ఆమోదించలేడు. ఇది చాలామంది మేధావుల్లో కూడా వున్న బలహీనత. బహుశా ఈ బలహీనత రామలింగారెడ్డిగారిలో కూడా ఉందేమో!
కవిత్వతత్త్వ విచారం వచ్చిన కొత్తలో దానిమీద చాలా ప్రతి విమర్శలు వచ్చాయి. కాళ్ళూరి వ్యాసమూర్తి శాస్ర్తీగారూ, అక్కిరాజు ఉమాకాంతమ్ గారూ, నోరి నరసింహశాస్ర్తీగారూ ఆ గ్రంథంమీద విరుచుకుపడ్డారు.

03/12/2019 - 19:40

ఆ కాలంలోనే వచ్చిన భావకవిత్వం కాని, ఆ తరువాత వచ్చిన అభ్యుదయ కవిత్వం కాని రామలింగారెడ్డిగారిని బలంగా కదిలించలేకపోయింది. కన్యాశుల్కం గొప్పదనాన్ని గుర్తించటమూ, తృణకంకణం రాసిన రాయప్రోలును అభినందించటమైతే చేశారు కానీ ఆ ఉద్యమాల సారాన్ని పట్టుకోలేకపోయారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సుప్రసిద్ధ విమర్శకుడు రా.రా ఇలా అన్నారు.

03/11/2019 - 20:29

అందుచేతనే చాలామంది మన ప్రాచీన కవులు పాండిత్యాన్నీ, అలంకారికతనూ ఆశ్రయించారన్నది వారి సిద్ధాంతం. మితిమీరిన పాండిత్య ప్రదర్శనా, అలంకారికతా రసదృష్టికి ఎలా ఆటంకాలుగా నిలిచాయో రామలింగారెడ్డి ఈ గ్రంథంలో సోదాహరణంగా నిరూపించారు.

03/10/2019 - 22:57

రామలింగారెడ్డిగారు కవిత్వతత్త్వ విచారంలో ప్రధానంగా కవిత్వతత్త్వాన్ని గురించి చర్చించారు. మంచి కవిత్వం యొక్క లక్షణాలను చెప్పారు. విజయనగరం యుగం తరువాత తెలుగు కవిత్వం ఎందుకు పతనమైందో, ఎలా పతనమైందో చూపించారు. భారత కవుల్లోనూ, కళాపూర్ణోదయంలోనూ వున్న గొప్పదనాన్ని చూపించారు.

03/08/2019 - 20:34

అంతేకాదు తెలుగులో సంస్కృతానికి భిన్నమైన సాహిత్య సిద్ధాంతం కూడా లేదు. దాదాపు ఏడువందల సంవత్సరాల చరిత్ర వున్న తెలుగు సాహిత్యంలో ఒక యుగాన్నో, ధోరణినో, కావ్యాన్నో పరిశీలిస్తూ, విశే్లషిస్తూ ఎవరూ విమర్శ రాయలేరు.

Pages