S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినమరుగైన

03/07/2019 - 20:07

గత శతవసంతాల తెలుగు సాహిత్య ప్రస్థానాన్ని గురించి ఆలోచించేటప్పుడు మొట్టమొదట మనసులో మెదిలే కొద్దిమంది వైతాళికుల్లో కట్టమంచి రామలింగారెడ్డి గారొకరు. సరిగ్గా వంద సంవత్సరాల క్రితం- అంటే 1899లో రామలింగారెడ్డిగారు 20వ శతాబ్దంలో రాబోయే సాహిత్యానికి దారిచూపారు. 1899లో తన 19 సంవత్సరాల వయస్సులో వారు రాసి ప్రచురించిన ముసలమ్మ మరణము తెలుగు కవిత్వంలోకి కొత్త ఆలోచనను ప్రవేశపెట్టింది.

03/06/2019 - 20:11

‘కోరికలు ఆత్మస్వరూపం తెలుసుకోలేక అజ్ఞానంతో లొంగిపోయేవారిని వేశ్యలాగా లొంగదీస్తాయి. లోభి దగ్గర పసిపిల్లలాగా మారాం చేస్తాయి. ఆత్మజ్ఞానం గలవాడి దగ్గర భయపడి హద్దుల్లో వుంటాయి. ప్రతి మానవుడు తనలో వున్న ఆత్మస్వరూపాన్ని గుర్తించి ఆత్మయొక్క సలహాననుసరించి ముందుకు పోగలిగితే ప్రపంచకంలోని సుఖదుఃఖాలకు కారణమైన కోరికలను కొరతలను సులభంగా జయించగలదు.

03/05/2019 - 20:11

తల్లిని పువ్వులలో పెట్టి చూసుకునే కుమారుడు, అడుగులకు మడుగులొత్తే సిబ్బంది. ఈ అవ్వని అబ్బురంగా చూసుకునే మనవడు. నోటితో నవ్వుతూ నొసలతో వెక్కిరిస్తున్నట్టు అనిపించే కోడలు- కక్షలు కార్పణ్యాలు, కావేషాలు, మాట పట్టింపులు వున్నా రుూవిడని ప్రేమతో రంధ్రానే్వషణతో భూషిస్తూ దూషిస్తూకూడా అనుక్షణం గౌరవించే బంధుకోటి- ఇరుగు పొరుగు.

03/05/2019 - 00:05

ఇక్కడ మనం ఒక్క విషయం మరిచిపోకూడదు. ఈ అత్తగారి కథలు.. నిజమైన వ్యక్తి యొక్క ఆత్మకథ కాదు. ఆవిడ జీవితంలో సంఘటనల రిపోర్టింగ్ కాదు.
మహాకవి లక్షణాలను గురించి చెబుతూ శ్రీ మాధవపెద్ది సుందర రామశాస్ర్తీగారు-
‘‘మోదములోన మోదమై పోదురు,
భేదములోన భేదమై పోదురు
యాహ్లాద వినోదముల్ కడు విలక్షణములు
కవులన్న- నిత్య సూర్యోదయ
మానస సరోవర హంసలటుల్ రసప్రియుల్’’

03/03/2019 - 22:34

లోభిహృదయం, పతిత, జీవితంలోని అగాధాలు, శమంతకమణి- చారుశాస్ర్తీ- ఈ నాలుగు కథలు మన హృదయాన్ని దశదిశలా కదిలించివేస్తాయి. మనలోని మానవత్వాన్ని మేలుకొలుపుతాయి.

03/01/2019 - 19:58

రచయితలు 20 శతాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు. శాశ్వతమైన రచనలు చేశారు. నాలుగు కాలాలపాటు నిలిచిపోగల పాత్రలను కల్పించారు.
ఈ సమయంలోనే ఎన్నో మంచి రచనలు తెనుగు భాషలో ఉద్భువించాయి. కథలు - నవలలలు- నాటకాలు - నాటికలు - విమర్శలు -వ్యాఖ్యానాలు- కవితలు - కావ్యాలు- అనువాదాలు రుూ సాహిత్య ప్రక్రియలు అన్నింటిలోను మన కవులు - రచయితలు పండితులు ఎంతో కృషి చేశారు.

02/28/2019 - 20:34

తన తప్పును తెలుసుకోవడమే కాకుండా దేశానికి ఉపయోగపడే ఉత్తమ పౌరునిగా తయారవటానికి అవకాశమిచ్చినట్లవుతుందనీ వాళ్లకి నచ్చజెప్పి ఒప్పిస్తాడు హెడ్‌మాస్టర్. అంతే.. ఆ క్షణం నుంచీ రావు జీవితంతో గొప్ప మార్పు వస్తుంది.
భార్య కమలతో సహా హెడ్‌మాస్టర్ అంత్యక్రియలకు హాజరయి, ఆయనగారి కొడుకు సకాలంలో అక్కడికి చేరుకోలేడని తెలుసుకుని, ఆయన భార్య అనుమతితో తానే అంత్యక్రియలు జరిపిస్తాడు.

02/27/2019 - 19:49

ఆ స్థితిలో రావు కలగజేసుకుని సీనియర్ అధికారి అయిన రూంగ్తామీద చెయ్యి చేసుకుని, అతన్ని ప్రక్కకి తోసేసి స్టీరింగ్ తన అధీనంలోకి తెచ్చుకుంటాడు. అతని లాఘవంవల్ల ప్రమాదం తప్పి విమానం క్షేమంగా ల్యాండ్ అయింది.
కాని రావులో అంతర్మథనం.

02/26/2019 - 19:57

రాత్రి అందరూ నిద్రలోకి జారుకోగా ముసలయ్య కోపం మరిచి రత్తి దగ్గరకు చేరటం..

02/25/2019 - 19:51

తన దుఃఖాన్ని చాలా అందంగా, గాంభీర్యంగా మలచుకున్నాడు.
అదో పొగడ్తలను తెచ్చిపెట్టింది.
రాజారావు మళ్లీ పెళ్లిచేసుకోలేదు. చేసుకోకపోవటానికి కారణం కేవలం భార్యమీద ప్రేమే అనుకున్నారు అందరూ. కాని అసలు కారణం తనకు తాను అర్థం కాని అసంగ్థితతే. అలా సృష్టించుకున్న ఒంటరితనంలోంచి అతన్నుండి వెల్లువగా కవిత్వం పుట్టుకువచ్చింది.

Pages